For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Personal Finance: మీ రుణాన్ని తగ్గించుకోవడానికి ఏడు సులభమైన మార్గాలు

|

మీకు ఉన్న ఫిక్స్డ్ సంపద ద్వారా మీకు ఉన్న రుణాలను తగ్గించుకోవడం అంత సులభమైన విషయం కాదు. అంతేకానీ అసాధ్యం మాత్రం కాదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సరైన ప్రణాళిక ద్వారా మీ ఖర్చును తగ్గించుకోవచ్చు. మీ పరిమిత నెలవారీ ఆదాయంలో మీ రుణాలను తగ్గించడానికి మీ ప్రణాళిక సహాయపడుతుంది. సరైన ప్రణాళిక ద్వారా మీ రుణాన్ని తగ్గించుకునే కొన్ని మార్గాలు ఇక్కడ చూడండి.

అప్పుల కుప్పను నిలిపివేయాలి

అప్పుల కుప్పను నిలిపివేయాలి

అప్పుల కుప్పను తగ్గించుకోవడానికి మొట్టమొదట మీరు చేయాల్సిన పని ఆ అప్పును మరింత పెంచకుండా చూసుకోవడం. రోగం వచ్చాక తగ్గించడం కంటే రోగం రాకుండా నివారించడం ఉత్తమ మార్గం. అందుకే అప్పులను కూడా ఇష్టారీతిన చేయకుండా ఉండటం మంచిది. క్రెడిట్ కార్డ్స్ నుండి బయటి అప్పుల వరకు సాధ్యమైనంత మేర తగ్గించాలి. రుణం ఇప్పటికే బరువుగా మారితే క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనుగోలు నుండి కాస్త విరామం తీసుకోండి. మీ ఆదాయం.. ఖర్చులపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. అవసరమైనంత మేరగా ఆయా ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి. బడ్జెట్ ప్లాన్ ఉంటే రుణ భారం తెలివిగా పరిష్కరించుకోవచ్చునని చెబుతారు నిపుణులు. మీకు కచ్చితంగా అయ్యే ఖర్చులను ముందుగా గుర్తించడం ద్వారా అనవసర ఖర్చులను పక్కన పెట్టాలి.

ఆదాయం పెంచుకోండి

ఆదాయం పెంచుకోండి

మీరు చెల్లించే రుణాన్ని సాధ్యమైనంత ఎక్కువగా చెల్లించే ప్రణాళిక వేసుకోండి. మీరు ఎంత ఎక్కువగా రుణాన్ని చెల్లిస్తూ వెళ్తుంటే అంత త్వరగా భారం తగ్గుతుంది. ఇందుకు అదనపు ఆదాయ మార్గం కూడా ఎంచుకోవచ్చు.

ఎమర్జెన్సీ ఫండ్

ఎమర్జెన్సీ ఫండ్

రుణ భారాన్ని తగ్గించడం కోసం ఎమర్జెన్సీ ఫండ్‌ను తయారు చేసుకోవడం మరో మార్గం. ఎమర్జెన్సీ ఫండ్ కేవలం ఆరోగ్యపరమైన సమయంలోనే కాదు, అత్యవసరంగా రుణ భారాన్ని తగ్గించుకోవడం కోసం కూడా ఉపయోగపడుతుంది. అనవసరంగా క్రెడిట్ కార్డ్ కోసం వెళ్లకుండా ఉపయోగపడుతుంది.

తక్కువ వడ్డీ రేటు కోసం ప్రయత్నం

తక్కువ వడ్డీ రేటు కోసం ప్రయత్నం

రుణం తీసుకునే సమయంలో తక్కువ వడ్డీ రేటు కోసం చూడండి. అత్యవసరమని అధిక వడ్డీ రేటుతో రుణం తీసుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత మేర అన్ని బ్యంకుల్లో విచారించి తక్కువ వడ్డీ రేటుకు వెళ్లడం మంచిది. తక్కువ వడ్డీ రేటు కోసం మీ క్రెడిటార్స్‌ను అడగడం మంచిది. సాధ్యమైనంత మేర వడ్డీ రేటు పైన చర్చించేందుకు వెసులుబాటు ఉంటుంది. తక్కువ వడ్డీ రేటు కోసం చర్చించడం మీ అప్పు భారాన్ని కొంత తగ్గిస్తుంది. మీ పేమెంట్ హిస్టరీ బాగుంటే కనుక తక్కువ వడ్డీ రేటుకు అవకాశం ఉంటుంది.

రిటైర్మెంట్ ఫండ్

రిటైర్మెంట్ ఫండ్

మీ రుణ భారాన్ని తగ్గించుకోవడం కోసం మీ రిటైర్మెంట్ ఫండ్ నుండి ఉపసంహరించుకోవడం మరో ఉత్తమ మార్గం. అయితే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో దీనిని ఉపసంహరించుకోవడం మంచిది. మీకు మరో మార్గం లేని సమయంలో మీ నెలవారీ ఆదాయంతో పాటు ఇతర ఆదాయ వనరులు ఉన్న సందర్భాల్లో మాత్రమే దీనిని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ మీరో విషయం గుర్తుంచుకోండి. అయితే మీ రిటైర్మెంట్ ఫండ్ ఉపసంహరణ మీ వడ్డీ, మూలధనం, డివిడెండ్‌తో పాటు రిటైర్మెంట్ తర్వాత మీ సేవింగ్స్ పైన ప్రభావం చూపుతుంది.

రుణ పరిష్కారం

రుణ పరిష్కారం

మీ రుణానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో లోన్ సెటిల్మెంట్‌కు వెళ్లడం మంచి ఎంపిక. అంటే మీ రుణమొత్తాన్ని కాస్త తగ్గింపుతో ఒకేసారి ముందుగా చెల్లించడం. సాధారణంగా డిఫాల్టులో ఉన్న లేదా డిఫాల్టు చేయబోతున్న ఖాతాలకు సంబంధించిన వాటి పైనే బ్యాంకులు లోన్ సెటిల్మెంట్ వైపు మొగ్గు చూపుతారు. అయితే రుణ పరిష్కారం మీ క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం చూపుతుంది. చివరి ప్రయత్నంగా దీనిని చూడాలి.

క్రెడిట్ కౌన్సిలింగ్ ఏజెన్సీస్

క్రెడిట్ కౌన్సిలింగ్ ఏజెన్సీస్

క్రెడిట్‌కు సంబంధించి మీకు సరైన అవగాహన లేకుంటే సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. క్రెడిట్ కౌన్సిలింగ్ అనేది మీ రుణాన్ని నియంత్రణలోకి తీసుకు రావడానికి తెలివైన మార్గాలలో ఒకటి. మీ ఫైనాన్స్ నిర్వహణలో, మీ బడ్జెట్ సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయపడే అనేక క్రెడిట్ కౌన్సిలింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. మీరు ప్రతి నెల చేయవలసిందల్లా ఏకమొత్తంలో క్రెడిట్ కౌన్సిలింగ్ ఏజెన్సీలకు పంపించడం. వారు మీ తరఫున మీరు పంపిన మొత్తాన్ని విభజించి రుణదాతలకు అందిస్తారు.

English summary

Personal Finance: మీ రుణాన్ని తగ్గించుకోవడానికి ఏడు సులభమైన మార్గాలు | Personal Finance: Smart Ways to Reduce Your Debt

Reducing your debt within your fixed income is not as easy it looks but not impossible. Correct and combined strategies, and sticking to your consistent effort of reducing debt can help you to tackle this trap within your limited monthly income.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X