For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డ్ వార్నింగ్: గడువులోగా చెల్లించకుంటే జనవరి నుంచి ఈ బ్యాంకు భారీ షాక్

|

మీరు సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు కలిగి ఉన్నారా? మీ క్రెడిట్ కార్డు బిల్లును డ్యూ డేట్ లోపు చెల్లించలేదా? అయితే మీకో షాకింగ్. నిర్ణీత సమయంలోగా బిల్లు చెల్లించకుంటే జనవరి 1, 2020 తర్వాత మీరు ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు సిటీబ్యాంకు ఇండియా తమ సిటీ బ్యాంకు ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు యూజర్లకు అధిక వడ్డీ రేటు సమాచారాన్ని అందించింది. సిటీ బ్యాంకు ఇతర కార్డులు ఉపయోగించే వారికి కూడా ఇలాంటి సమాచారం వచ్చే అవకాశాలు లేకపోలేదు.

రోజుకు రూ.13తో రూ.1 కోటి, ఇతర బెనిఫిట్స్రోజుకు రూ.13తో రూ.1 కోటి, ఇతర బెనిఫిట్స్

4.8 శాతం అదనపు వడ్డీ

4.8 శాతం అదనపు వడ్డీ

సిటీ బ్యాంకు నుంచి సిటీ బ్యాంకు ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు వచ్చిన సమాచారం ఇలా ఉంది... చెల్లింపులు జరపని వారు జనవరి 1, 2020 నుంచి 4.8 శాతం వడ్డీ అదనంగా చెల్లించవలసి ఉంటుందని తెలిపింది. క్యాష్ విత్‌డ్రాకు కూడా ఇది అమలు చేస్తున్నట్లు తెలిపింది.

నాలుగు స్లాబ్ రేట్లు ఇలా మారుతున్నాయి..

నాలుగు స్లాబ్ రేట్లు ఇలా మారుతున్నాయి..

ప్రస్తుతం సిటీ బ్యాంకు ఛార్జీలు నాలుగు స్లాబ్ రేట్లు ఉన్నాయి. కార్డు హోల్డర్స్‌కు 37.2%, 39%, 40.8%, 42% గా ఉన్నాయి. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఆయా కార్డు హోల్డర్స్‌కు వరుసగా 42%, 42%, 42%, 43.2% కానున్నాయి. అంటే జనవరి 1, 2020 నుంచి ఇది అమలవుతుంది.

డ్యూడేట్ లోపు చెల్లించకుంటే..

డ్యూడేట్ లోపు చెల్లించకుంటే..

క్రెడిట్ కార్డు హోల్డర్స్ గమనించాల్సిన విషయం ఏమంటే డ్యూడేట్ లోపు బిల్లు మొత్తంలో కనీసం 5 శాతం చెల్లించాలి. లేదంటే పెనాల్టీ బాదుడు తప్పదు. ఈ పెనాల్టీ రూ.500, అంతకంటే ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు 18 శాతం జీఎస్టీ అదనం. మీ ఔట్ స్టాండింగ్స్ అన్నీ చెల్లించకపోతే మీ ఇంటరెస్ట్ ఫ్రీ పీరియడ్ ల్యాప్స్ అవుతుంది. చాలా కార్డుల ఇంటరెస్ట్ ఫ్రీ క్రెడిట్ 45-51 రోజుల మధ్య ఉంది. కార్డు బకాయిలు పూర్తిగా చెల్లించకుండా చేసే కొత్త కొనుగోళ్లకు వడ్డీ లేని కాలం ఉండదు. అలాంటి సందర్భాల్లో ఆ బ్యాంకు 48 శాతం వడ్డీ రేటు కూడా వసూలు చేస్తుంది.

English summary

క్రెడిట్ కార్డ్ వార్నింగ్: గడువులోగా చెల్లించకుంటే జనవరి నుంచి ఈ బ్యాంకు భారీ షాక్ | Not paying credit card dues on time: Get ready to pay higher interest from January 2020

If you are a Citi Bank credit card user and do not pay bill within the due date then you have to pay higher interest rate from January 1, 2020. Citibank India has informed its Citibank Indian Oil credit card users about the increase in interest rate. Other cardholders of Citi Bank might have also received similar communications.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X