For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ నెల నుండే కొత్త పీఎఫ్ రూల్స్, మీ ఆదాయంపై ప్రభావం

|

ఈ నెల నుండి(ఏప్రిల్) పీఎఫ్ రూల్స్ మారిన విషయం తెలిసిందే. వివిధ కంపెనీల్లో పని చేస్తోన్న ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత జీవనం సాగించేందుకు దీర్ఘకాలిక పెట్టుబడి మార్గం ప్రావిడెంట్ ఫండ్. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఏడాదిలో రూ.2.5 లక్షలు దాటితే ఆ మొత్తంపై వచ్చే వడ్డీపై పన్ను విధిస్తామని ప్రకటించారు.

ఆన్‌లైన్ చెల్లింపులు అదుర్స్, 50 శాతం పెరిగిన ట్రాన్సాక్షన్స్ఆన్‌లైన్ చెల్లింపులు అదుర్స్, 50 శాతం పెరిగిన ట్రాన్సాక్షన్స్

పెట్టుబడులు నిలువరించేందుకు

పెట్టుబడులు నిలువరించేందుకు

మొదట ప్ర‌క‌టించిన ప్ర‌తిపాద‌న ప్ర‌కారం ఒక సంస్థ యాజ‌మాన్యం, ఉద్యోగి సంయుక్తంగా ఉద్యోగి ఖాతాలో జ‌మ‌చేసే పీఎఫ్ రూ.2.5 ల‌క్ష‌లు దాటితే దానిపై వ‌చ్చే వ‌డ్డీకి ప‌న్ను ఉంటుంది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు రిటైర్మెంట్ ఫండ్‌గా ఉప‌క‌రించే ప్రావిడెంట్ ఫండ్‌లో కొంతమంది వ్య‌క్తిగ‌తంగా ప‌న్ను మిన‌హాయింపు కోసం భారీగా పెట్టుబడులు చేయ‌కుండా నిలువ‌రించేందుకే ఈ నిబంధ‌న‌ను తెచ్చారు.

యజమాని 12 శాతం వాటా దాటితే..

యజమాని 12 శాతం వాటా దాటితే..

పన్ను చట్టం ప్ర‌కారం ఉద్యోగి వేత‌నంలో ఉద్యోగి వేతనంలో 12 శాతం, యాజ‌మాని వాటా నుండి మరో 12 శాతం మొత్తం 24 శాతం పీఎఫ్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. గత ఏడాది మార్చి నెల వ‌ర‌కు యాజ‌మాన్యాల కంట్రిబ్యూష‌న్ 12 శాతానికి ప‌న్ను మిన‌హాయింపు ఉండేది. ఒక‌వేళ 12 శాతం దాటితే మాత్రం ప‌న్ను ఉండేది.

అలా మినహాయింపు

అలా మినహాయింపు

తాజా నిబంధ‌నల ప్రకారం ఈ నెల‌లో ఉద్యోగులు తీసుకునే వేతనంలో ఈ నిబంధ‌న ప్ర‌భావం ఉంటుంది. ఉద్యోగి మాత్ర‌మే పీఎఫ్ ఖాతాలో కంట్రిబ్యూట్ చేసినా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ స్పష్టత ఇచ్చారు. పీఎఫ్ ఖాతాలో జమ చేసిన వారిలో 93 శాతం మంది ఉద్యోగులు రూ.2.5 లక్షల లోపు లబ్ధిపొందుతారని నిర్మల చెప్పారు.

English summary

ఈ నెల నుండే కొత్త పీఎఫ్ రూల్స్, మీ ఆదాయంపై ప్రభావం | New PF tax rule from this month, here's how your income will be affected

As the new financial year has begun, the new rule for tax on Provident Fund interest will come into force from this month. In Budget 2021, Union Finance Minister Nirmala Sitharaman had announced that the exemption limit on interest from PF will be increased to Rs 5 lakh. Earlier, the limit was Rs 2.5 lakh.
Story first published: Monday, April 5, 2021, 20:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X