For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకులో ఖాతా లేకున్నా లాకర్, అలా ఐతే 100 రెట్ల జరిమానా

|

బ్యాంకులో లాకర్ కావాలంటే ఇప్పటి వరకు ఆ బ్యాంకులో ఖాతా ఉండాలి. బ్యాంకులో ఖాతాను ప్రారంభిస్తేనే లాకర్ ప్రారంభించే పరిస్థితి. అయితే ఇక నుండి ఈ ఇబ్బందులు ఉండవు. బ్యాంకులో ఖాతా లేకపోయినప్పటికీ సేఫ్ డిపాజిట్ లాకర్/సేఫ్ కస్టడీని అందించాలని ఆదేశిస్తూ ఆర్బీఐ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. బ్యాంకుతో ఎలాంటి సంబంధం లేకపోయినా, బ్యాంకు కోరిన వివరాలు ఇచ్చి నిబంధనలు పాటించిన వారికి సేఫ్ డిపాజిట్ లాకర్ లేదా సేఫ్ కస్టడీని అందించాలని ఆదేశించింది. ఈ కొత్త మార్గదర్శకాలు జనవరి 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయి.

బ్యాంకులు ఇక నుండి సొంతగా కొన్ని నిబంధనలు రూపొందించుకొని అమలు చేసుకునే వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది. బ్యాంకులు తమ శాఖల్లో ఖాళీగా ఉన్న లాకర్స్ సంఖ్య, వెయిటింగ్‌లో ఉన్న వారి వివరాలు కోర్ బ్యాంకింగ్ సిస్టంలో నమోదు చేయాలని పేర్కొంది. లాకర్ల జారీలో పూర్తి పారదర్శకత ఉండేలా చూస్తోంది ఆర్బీఐ. లాకర్‌కు సంబంధించి ఆరు నెలల్లో కొత్త మార్గదర్శకాలు విడుదల చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సుప్రీం కోర్టు ఆర్బీఐకి సూచించింది.

New guidelines for locker in banks

బ్యాంకులు తమ వద్ద ఉన్న లాకర్ల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, పిడుగులుపడటం, భూకంపాలు తదితరాలు వచ్చినప్పుడు, అలాగే లాకర్‌ను తీసుకున్న వ్యక్తి నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టానికి మాత్రం బ్యాంకు బాధ్యత వహించదు. అగ్ని ప్రమాదాలు, దొంగతనం, బ్యాంకు ఉద్యోగుల మోసం వల్ల లాకర్‌లోని వస్తువులకు నష్టం వాటిల్లితే దానికి బ్యాంకు బాధ్యత వహించాలి. ఇలాంటి సందర్భాల్లో లాకర్ అద్దెకు 100 రెట్ల వరకు పరిహారం ఇవాలని పేర్కొంది.

లాకర్ అద్దెను సకాలంలో రాబట్టుకునేందుకు బ్యాంకులు ఖాతాదారుల నుండి టర్మ్ డిపాజిట్‌‌ను కోరవచ్చు. ఇది మూడేళ్ల అద్దెకు సమానంగా ఉండటంతో పాటు, లాకర్ కీ పోతే కొత్తది ఏర్పాటు చేసేందుకు అయ్యే ఖర్చు కలిసి ఉండవచ్చు. అయితే, పాత కస్టమర్లకు ఇది వర్తించదు. మూడేళ్లపాటు అద్దె చెల్లించని లాకర్‌ను నిబంధనలు, బ్యాంకు విచక్షణ మేరకు స్వాధీనంచేసుకునే వెసులుబాటు ఇచ్చింది.

కొత్తగా లాకర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రసీదుతో పాటు వెయిటింగ్ లిస్ట్ నెంబర్ ఇవ్వాలి. లాకర్ రెంట్ అగ్రిమెంట్ ఐబీఏ పేర్కొన్న నమూనాలో ఉండాలి. వరుసగా మూడేళ్ల పాటు లాకర్ రెంట్ చెల్లించకుంటే ఆ లాకర్‌ను తెరిచే స్వేచ్ఛ బ్యాంకుకు ఉంది.

ఇప్పటి వరకు బ్యాంకు లాకర్ ఖాతా పొందాలంటే బ్యాంకులో సేవింగ్స్ ఖాతాను తెరవడం ముఖ్యం. ఖాతా తెరవడానికి కావాల్సిన పత్రాలు, ఆధార్ కార్డు, పాన్‌కార్డ్, ఫామ్ 60, KYC పత్రాలు అవసరం. అయితే ప్రతి బ్యాంకు లాకర్ ఒప్పందాన్ని కలిగి ఉంటుంది. మీరు సదరు బ్యాంకుల్లో లాకర్ పొందడానికి ఈ ఒప్పందాన్ని అంగీకరించి సంతకం చేయవలసి ఉంటుంది. ఇది నష్టపరిహార నిబంధనను కలిగి ఉంటుంది. అలాగే దీనిని రు.100 విలువ చేసే స్టాంప్ కాగితంపై రాస్తారు. అయితే ఇప్పుడు ఆర్బీఐ నిబంధనలతో బ్యాంకులో ఖాతా ఉండాల్సిన అవసరం మాత్రం లేదు.

English summary

బ్యాంకులో ఖాతా లేకున్నా లాకర్, అలా ఐతే 100 రెట్ల జరిమానా | New guidelines for locker in banks

The RBI came out with revised guidelines for the hiring of lockers under which the liability of banks will be limited to 100 times its annual rent in case of fire, theft, building collapse or frauds by bank employees.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X