For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ మూడు స్టాక్స్ కొనుగోలు చేస్తే మంచి లాభాలు రావొచ్చు

|

మార్కెట్లు గతవారం అస్థిరంగా ఉన్నాయి. కరోనా డెల్టా వేరియంట్ భయాలు గతవారం ప్రారంభంలో మార్కెట్లను నష్టాల్లోకి వెళ్లేలా చేశాయి. అయితే చివరలో మాత్రం లాభపడ్డాయి. నిఫ్టీ 15,850 పాయింట్లు దాటి 16,000 పాయింట్లకు సమీపంలో ఉందని, మార్కెట్లు ఈ వారం కాస్త సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే మార్కెట్లు గణనీయంగా పెరుగుతూ, కరోనా కొత్త వేరియంట్ ప్రభావంతో కుప్పకూలుతున్నాయని, వీటిని పరిగణలోకి తీసుకోవాలని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక రాబడి కోసం ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ మూడు స్టాక్స్‌ను సజెస్ట్ చేస్తోంది.

మహీంద్రా CIE

మహీంద్రా CIE

మహీంద్రా CIE ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తోందని మోతీలాల్ ఓస్వాల్ చెబుతోంది. యాజమాన్య సంస్థ మల్టీ టెక్నాలజీ ఆటోమోటివ్ కాంపోనెంట్ సప్లయర్. ఇది స్పెయిన్‌కు చెందిన CIE ఆటోమోటివ్ గ్రూప్ సబ్సిడరీ కూడా. ఇది మాడ్రిడ్, బిబావో స్టాక్ ఎక్స్చేంజీలో నమోదయింది. భారత్, యూరోప్‌లో 2021 క్యాలెండర్ ఏడాది రెండో అర్ధ సంవత్సరం మంచి ఆశాజనకంగా ఉన్నట్లు కంపెనీ ఇటీవల తెలిపింది. సెప్టెంబర్ నుండి సెమీకండక్టర్స్ కొరత తగ్గుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. బిల్ ఫోర్జ్ యూనిట్, తక్కువ కార్పోరేట్ ట్యాక్స్ కోసం హోసూర్‌లో గ్రీన్ ఫీల్డ్ ప్లాంటును ఏర్పాటు చేయడానికి ఆమోదించింది. మహీంద్రా CIE భారత్, ఈయూలోను ఖర్చులు తగ్గించి మార్జిన్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. మహీంద్రా CIE షేర్ ధర ప్రస్తుతం రూ.2.44.60గా ఉంది. టార్గెట్ ధరను రూ.రూ.295గా పేర్కొంది.

HUL

HUL

హిందూస్తాన్ యూనీలీవర్ (HUL) వృద్ధిని 19శాతం అంచనా వేసింది మోతీలాల్ ఓస్వాల్. గత ఏడాది కరోనా కారణంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఉండటం కలిసి వచ్చిందని చెప్పారు. కరోనా నుండి కోలుకొని దేశ ఆర్థిక వ్యవస్థ, కార్యకలాపాలు మెరుగు పడుతున్నాయని, దీంతో FMCG ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని, దీంతో పాటు ఆపరేటింగ్ మార్జిన్స్ పెరుగుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం హిందూస్తాన్ యూనీలీవర్ షేర్ ధర రూ.2,359 వద్ద ఉంది. టార్గెట్ ధర రూ.2840.

అల్ట్రా టెక్ సిమెంట్

అల్ట్రా టెక్ సిమెంట్

ప్రస్తుత మార్కెట్ ధరతో 18 శాతం అధిక ధర లక్ష్యంతో అల్ట్రా టెక్ సిమెంట్ షేర్లను కొనుగోలు చేయాలని మోతీలాల్ ఓస్వాల్ సూచిస్తోంది. ఈ బ్రోకరింగ్ సంస్థ ప్రకారం తక్కువ వ్యయ ద్రవ్యోల్ణం వంటి అంశాలు ఈ త్రైమాసికంలో ఎబిటా మార్జిన్ 9 శాతం రావడానికి కారణమైంది. ప్రస్తుతం అల్ట్రా టెక్ సిమెంట్ షేర్ ధర రూ.7,497.85 వద్ద ఉంది. స్టాక్స్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. కాబట్టి పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్లు ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. కరోనా డెల్టా వేరియంట్ వంటి అంశాల ప్రభావం ఉంటుంది. కాబట్టి సూచీలు ఎప్పుడైనా పతనం కావొచ్చు. ఎప్పుడైనా భారీగా పుంజుకోవచ్చు. కాబట్టి అన్నింటిని పరిగణలోకి తీసుకొని, నిపుణుల సలహాల మేరకు పెట్టుబడులు పెట్టాలి.

English summary

ఈ మూడు స్టాక్స్ కొనుగోలు చేస్తే మంచి లాభాలు రావొచ్చు | Motilal Oswal suggests these stocks to buy

Markets this week were once again very volatile, as news of new infections of Covid swept the globe.
Story first published: Sunday, July 25, 2021, 10:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X