For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ వేతనంపై ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుందని తెలుసా? కానీ.. ఖరీదు

|

మీకు డబ్బులు అత్యవసరమైతే ఏం చేస్తారు? పర్సనల్ లోన్ లేదా గోల్డ్ లోన్ ఇలా... వివిధ మార్గాలు ఉన్నాయి. అయితే వేతనజీవులకు కొంత మొత్తంలో డబ్బులు అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గం ఉందని తెలుసా? అదే శాలరైడ్ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. మీరు శాలరైడ్ అయితే మాత్రమే బ్యాంకు నుండి ఈ సౌకర్యం ఉంటుంది. అలా అని శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సదుపాయం వర్తించదు. అర్హత ఉన్నవారికి మాత్రమే ఇది లభిస్తుంది. అవసరమైతే మీరు మీ వేతన ఖాతాలోని బ్యాలెన్స్ కంటే ఎక్కువ మొత్తంలో నగదును ఉపసంహరించుకోవచ్చు

ఓవర్ డ్రాఫ్ట్ అంటే?

ఓవర్ డ్రాఫ్ట్ అంటే?

ఖాతాదారులు తమ ఖాతాలో ఉండే మొత్తం కంటే ఎక్కువ నగదును ఉపసంహరించుకోవడాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అని పిలుస్తారు. ఓవర్ డ్రాఫ్ట్‌లో మీరు ఖాతా నుండి ఉపసంహరించుకున్న మొత్తంపై వడ్డీని వసూలు చేయరు. మీరు తీసుకున్న అధిక మొత్తం పైన మాత్రం వడ్డీని చెల్లించవలసి వస్తుంది. సాధారణంగా కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్స్ పైన శాలరీ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉంది.

ఇక్కడ శాలరీ ఓవర్ డ్రాఫ్ట్ అంటే మీ ఖాతాలో పొందగలిగే రివాల్వింగ్ క్రెడిట్. డబ్బు అవసరమైనప్పుడు ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌కు మించి నిర్దిష్ట మొత్తాన్ని తీసుకోవచ్చు. దీనిపై తిరిగి చెల్లించేంత వరకు వడ్డీ పడుతుంది. ఏకమొత్తంలో లేదా వాయిదాలలో అదనంగా ఉపసంహరణ చేసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. ఆర్థిక అత్యవసర సమయాల్లో ఉపయోగం. వేతన ఖాతాలో నిధుల కొరత కారణంగా చెక్ బౌన్స్ కాకుండా, ఈఎంఐ మిస్ కాకుండా, సిప్ మిస్ కాకుండా ఇది ఉపయోగపడుతుంది.

ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి

ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి

చాలా బ్యాంకులు శాలరైడ్ క్రెడిట్ ప్రొఫైల్, యాజమాన్యం క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా ఇప్పటికే శాలరీ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తాయి. వేర్వేరు బ్యాంకుల్లో వేర్వేరు మొత్తం ఉంటుంది. క్రెడిట్ ప్రొఫైల్, క్రెడిట్ స్కోర్ కీలకం. శాలరీ ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి కోసం ఆయా బ్యాంకులకు ఆయా పారామీటర్స్ ఉన్నాయి. నికర వేతనంలో ఓవర్ డ్రాఫ్ట్‌ను 80 శాతం నుండి 90 శాతం వరకు అనుమతిస్తాయి.

నెట్ శాలరీ ఆదారంగా కొన్ని బ్యాంకులు రూ.3 లక్షల నుండి రూ.5 లక్షల వరకు, మరికొన్ని బ్యాంకులు రూ.1 లక్ష నుండి రూ.1.5 లక్షల వరకు, మరిన్ని బ్యాంకులు రూ.10వేల నుండి రూ.25వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ పరిమితిని ఇస్తున్నాయి.

ఉదాహరణకు HDFC, ICICI బ్యాంకుల్లో శాలరీ కంటే మూడు రెట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఆఫర్ చేస్తుండగా, సిటీ బ్యాంకు సువిధ శాలరీ అకౌంట్ ఏకంగా 5 రెట్లు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని (రూ.5 లక్షల వరకు) అందిస్తుంది.

ఖర్చుతో కూడుకున్నదే

ఖర్చుతో కూడుకున్నదే

శాలరైడ్ అందరికీ ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉండదు. ఎంపిక చేసిన శాలరైడ్‌కు ఇస్తారు. క్రెడిట్ హిస్టరీ, అర్హత ఆధారంగా అర్హత ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ పైన ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. వార్షిక పునరుద్ధరణ ఛార్జీ ఉంటుంది. శాలరీ ఓవర్ డ్రాప్ట్ కూడా ఓ విధంగా క్రెడిట్ కార్డు వలె ఎక్స్‌పెన్సివ్ రుణం. అయితే క్రెడిట్ కార్డులా వడ్డీరహిత కాలవ్యవధి ఉండదు. రివార్డ్ పాయింట్లు, ఆఫర్లు వర్తించవు. వార్షిక వడ్డీ రేటు 12 శాతం నుండి 30 శాతం వరకు ఉంటుంది. సమయానికి చెల్లించకుంటే పెనాల్టీ వర్తిస్తుంది. ఉపసంహరించుకున్న రోజు నుండి వడ్డీ వర్తిస్తుంది. మీరు తీసుకున్న మొత్తాన్ని ఒకేసారి లేదా ఈఎంఐగా మార్చుకొని చెల్లించవచ్చు.

వివిధ బ్యాంకుల్లో శాలరీ ఓవర్ డ్రాఫ్ట్ వడ్డీ రేట్లు

వివిధ బ్యాంకుల్లో శాలరీ ఓవర్ డ్రాఫ్ట్ వడ్డీ రేట్లు

వివిధ బ్యాంకుల్లో శాలరీ ఓవర్ డ్రాఫ్ట్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

సిటీ బ్యాంకులో 16 శాతం నుండి 19 శాతం,

స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో 15.50 శాతం నుండి,

ఐడీబీఐ బ్యాంకులో 11.05 శాతం నుండి,

ఐసీఐసీఐ బ్యాంకులో 12 శాతం నుండి 14 శాతం,

HDFC బ్యాంకులో 15 శాతం నుండి 18 శాతం,

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో బ్యాంకులో 10.05 శాతం వరకు ఉన్నాయి.

English summary

మీ వేతనంపై ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుందని తెలుసా? కానీ.. ఖరీదు | Most people may not know what a salary overdraft is?

Most people may not know what a salary overdraft is. But it is useful in times of emergency. If you are a salaried person, you can avail this facility from the bank where your salary account is located.
Story first published: Monday, January 24, 2022, 14:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X