For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Marriage Loan: పెళ్లి కోసం రూ.25 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు

|

మీకు పెళ్లి సెటిల్ అయిందా, ఖర్చుల కోసం నగదు కొరత ఉందని బాధపడుతున్నారా? అయితే అలాంటి చింత అవసరం లేదు. పెళ్లి ఖర్చుల కోసం కూడా రుణం తీసుకోవచ్చు. ఇంటి రుణం, వాహన రుణం, వ్యక్తిగత రుణం, బంగారంపై రుణం మనకు తెలిసిందే. బ్యాంకులు పెళ్లి ఖర్చుల కోసం కూడా రుణం ఇస్తాయి. ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు ఎక్కువగా లోన్స్‌ను తక్కువ వడ్డీ రేట్లకు అందిస్తుంటాయి. ఎలాంటి పూచీకత్తు లేకుండా క్రెడిట్ స్కోర్, బ్యాంకులో ఆయా ఖాతాదారులు నిర్వహించే ఖాతాలను బట్టి రుణం అందిస్తాయి. బ్యాంకులో ఖాతా, క్రెడిట్ కార్డు ఉన్నప్పటికీ వారు నిర్వహించే అకౌంట్ హిస్టరీ ఆధారంగా రుణాలు ఇస్తాయి. పర్సనల్ లోన్ అన్-సెక్యూర్డ్ కాబట్టి వడ్డీ రేటు ఎక్కువ. హోమ్ లోన్, కారు లోన్ సెక్యూర్డ్ లోన్ కాబట్టి వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది.

వివాహం... జీవితంలో ఒకేసారి జరిగే తంతు! కాబట్టి ఉన్నంతలో దీనిని అత్యంత వైభవంగా జరుపుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరిస్థితులను బట్టి వివాహ వేడుకలు నిర్వహిస్తారు. పెళ్ళిళ్లకు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సమయానికి తగినంత ఆదాయం లేని వారికి బ్యాంకులు పెళ్లి ఖర్చు కోసం రుణాలు అందిస్తాయి. ఇది పర్సనల్ లోన్ కిందకు వస్తుంది. మీ చెల్లింపు సామర్థ్యం ఆధారంగా లోన్, వడ్డీ రేటు ఉంటుంది. మీ సౌలభ్యాన్ని బట్టి రుణం తీర్చుకోవచ్చు.

Marriage Loan: Wedding loan of up to Rs 25 lakh

కారు లోన్ లేదా హోమ్ లోన్ తీసుకుంటే చెక్ నేరుగా విక్రేతకు అందిస్తారు. వ్యక్తిగత రుణం మాత్రం నేరుగా మీ బ్యాంకు ఖాతాలో క్రెడిట్ అవుతుంది. ఈ డబ్బును ఏ విధంగానైనా వినియోగించుకోవచ్చు. పెళ్లిలో క్యాటరర్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ బృందం లేదా డెకరేషన్ కోసం ఖర్చు చేయవచ్చు. వివిధ బ్యాంకుల్లో లోన్ వడ్డీ రేటు 8.80 శాతం నుండి 10.35 శాతం వరకు ఉన్నాయి. రూ.25 లక్షల వరకు కూడా రుణం అందించే బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్‌సీలు ఉన్నాయి.

English summary

Marriage Loan: పెళ్లి కోసం రూ.25 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు | Marriage Loan: Wedding loan of up to Rs 25 lakh

Marriage loans can be taken to fund the expenses associated with a wedding. Depending on your bank, the rate of interest will be levied and the maximum loan that is provided will vary.
Story first published: Friday, July 1, 2022, 18:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X