For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రెండు స్కీమ్స్ అదుర్స్, ఈ ఉత్పత్తులపై రుణం తీసుకోవచ్చు: ఎంత వస్తుందంటే?

|

స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లు లాంగ్ టెన్యూర్ పెట్టుబడులపై అత్యధిక వడ్డీ రేటును అందించడంతో పాటు ఎమర్జెన్సీ సమయంలో లోన్ కావాలంటే అధిక మొత్తం వస్తుంది. అయితే ఓ ఇన్వెస్టర్ కొన్ని అంశాల ద్వారా మాత్రమే పెట్టుబడులు పెట్టగలడు. కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఉత్పత్తుల ద్వారా రుణాలను పొందవచ్చు. సాధారణంగా పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ తీసుకుంటారు. అయితే ఈ పై ఉత్పత్తుల ద్వారా కూడా రుణ సౌకర్యం పొందవచ్చు.

కిసాన్ వికాస్ పత్ర

కిసాన్ వికాస్ పత్ర

ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్ర ఉత్పత్తిపై వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది. పెట్టుబడి పెట్టిన మొత్తంపై పదేళ్ల నాలుగు నెలల కాలంలో రెండింతలు అవుతుంది. ప్రస్తుతం ఇది మెచ్యూరిటీ పీరియడ్‌గా ఉంది. పెట్టుబడిదారు కనీసం రూ.1000 నుండి పెట్టవచ్చు. కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అయిదేళ్ల కాలపరిమతి కలిగిన ఉత్పత్తి. వడ్డీ రేటు 6.8 శాతగా ఉంది. కిసాన్ వికాస్ పత్ర లాగే కనీసం రూ.1000 నుండి పెట్టుబడిగా పెట్టవచ్చు. అలాగే గరిష్ట పరిమితి లేదు. పెట్టిన ప్రతి రూ.1000 అయిదేళ్ల కాలపరిమితిలో రూ.1,389 అవుతుంది.

లోన్ ఎంత వస్తుంది

లోన్ ఎంత వస్తుంది

బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్ సైట్ ప్రకారం రుణగ్రహీత ఈ ఉత్పత్తులపై కనీసం 85 శాతం రుణం తీసుకోవచ్చు. అయితే అవశేష మెచ్యూరిటీ కాల పరిమితి మూడేళ్ల వ్యవధి లోపు ఉంటే పై మొత్తం వస్తుంది. అవశేష మెచ్యూరిటీ కాల పరిమితి మూడేళ్లకు పైన ఉంటే 80 శాతం ఇస్తారు.

English summary

ఈ రెండు స్కీమ్స్ అదుర్స్, ఈ ఉత్పత్తులపై రుణం తీసుకోవచ్చు: ఎంత వస్తుందంటే? | Loan against KVP and NSC small savings schemes

Small Savings Schemes not only offer higher interest rates for long tenure investments, but they also come in handy if you want to pledge them to raise money in an emergency.
Story first published: Wednesday, July 7, 2021, 14:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X