For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC Plan:యాజమాన్యం-ఉద్యోగస్తులకు గ్రూప్ ప్లాన్... బెనిఫిట్స్ ఏంటి, తెలుసుకోండి..!

|

భారత దేశపు అతిపెద్ద జీవిత బీమా రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) సరికొత్త గ్రూప్ సూపర్‌యాన్యువేషన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనిపేరు న్యూ గ్రూప్ సూపర్‌యాన్యువేషనక క్యాష్ అక్యుములేషన్ ప్లాన్ (NGSCA). ఇది ప్రాథమికంగా యాజమాన్యాలు-ఉద్యోగస్తులకు లబ్ధి చేకూర్చే ప్లాన్‌గా నిలుస్తోంది. భవిష్యత్తులో ఉద్యోగస్తులు రిటైర్ అయ్యాక వారికి లబ్ధి చేకూర్చేందుకు ప్రధానంగా ఈ ప్లాన్ తీసుకురావడం జరిగింది.

ఇక NGSCA పథకం కింద ఏడాదిలో ఎప్పుడైనా ఒకసారి డబ్బులు జమచేయొచ్చు. ఈ జమ చేసిన డబ్బును యాజమాన్యం పేరిట లేదా ట్రస్టీ లేదా మాస్టర్ పాలసీ హోల్డర్ పేరిట ఉన్న గ్రూప్ పాలసీ అకౌంట్‌కు క్రెడిట్ చేయబడుతుంది. ఒకవేళ ఇది వద్దనుకుంటే గ్రూపులోని ప్రతి సభ్యుడికి వ్యక్తిగత పాలసీ అకౌంట్‌ను మెయిన్‌టెయిన్ చేయడం జరుగుతుంది. అయితే NGSCA అనే ఈ ప్లాన్‌కు కొన్ని అర్హతలను ప్రకటించింది ఎల్ఐసీ.

LIC New Plan:What is New Group Superannuation Cash Accumulation Plan,Know the details

ఈ పథకం వర్తించాలన్నా లేదా తీసుకోవాలనుకునే వారి వయస్సు 18 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య ఉండాలి. అదే మెచ్యూరిటీ వయసు అయితే 85 ఏళ్లు ఉండాలి. ఇక ఈ పాలసీ తీసుకున్న సమయంలో రూ.10వేలు కనీసం జమ చేయాలి. ఆ తర్వాత ఏటా రూ.1200 తప్పనిసరిగా గ్రూపులోని ప్రతి సభ్యుడు చెల్లించాలి లేదా జమచేయాలి. యాజమాన్యం-ఉద్యోగస్తుల పథకంలో కనీసం అంటే 10 మంది సభ్యులు ఉండాలి. ఇక ప్రభుత్వం ఇచ్చే సామాజిక భద్రత పథకాలకు సభ్యుల సంఖ్యపై పరిమితి లేదు. ఇది నిబంధనలకు అనుగుణంగానే ఉంటుంది.

ఈ పథకాన్ని వినియోగించుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఒక సభ్యుడు గ్రూపులో నుంచి నిష్క్రమించినట్లయితే... ఆ సభ్యుడు లేదా సభ్యురాలికి మాస్టర్ పాలసీ హోల్డర్‌లోని సూపర్‌యాన్యువేషన్ పథకం నిబంధనల మేరకు చెల్లింపులు జరుగుతాయి. ఒక్కసారి సభ్యుడికి లేదా సభ్యురాలికి చెల్లింపులు జరిగిన తర్వాత గ్రూపులోని వ్యక్తిగత పాలసీ ఖాతాను నిలిపివేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ పథకం కింద ఏటా కనీసం 0.5శాతం వడ్డీ కూడా చెల్లించడం జరుగుతుంది. ఇది ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకునే ముందు ప్రకటించడం జరుగుతుంది. కాంట్రాక్ట్ ముగిసే వరకు ఇది గ్యారెంటీగా ఇవ్వడం జరుగుతుంది.

English summary

LIC Plan:యాజమాన్యం-ఉద్యోగస్తులకు గ్రూప్ ప్లాన్... బెనిఫిట్స్ ఏంటి, తెలుసుకోండి..! | LIC New Plan:What is New Group Superannuation Cash Accumulation Plan,Know the details

India’s biggest life insurer Life Insurance Corporation of India (LIC) has come up with a new Group Superannuation Plan, called New Group Superannuation Cash Accumulation Plan (NGSCA)
Story first published: Saturday, March 20, 2021, 14:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X