For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల్ఐసీ సరికొత్త పాలసీ, సరికొత్త డెఫర్డ్ యాన్యుటీ ప్లాన్

|

ప్రభుత్వరంగ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) బుధవారం సరికొత్త డెఫర్డ్ యాన్యుటీ ప్లాన్‌ను తీసుకు వచ్చింది. దీనిని ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వ్యక్తిగత, కుటుంబం కోసం దీనిని తీసుకోవచ్చు. కుటుంబ ప్లాన్‌ను కనీసం రూ.15 లక్షలతో కొనవలసి ఉంటుంది. వార్షిక, అర్ధవార్షిక, త్రైమాసిక, నెలసరి విధానాల్లో వీటిని చెల్లించవచ్చు. 30 నుండి 79 ఏళ్ల వారు ఈ ప్లాన్‌కు అర్హులు.

ఈ పాలసీ ప్రారంభం నుండి యాన్యుటీ రేట్లు హామీ ఇస్తాయి. వాయిదా వ్యవధి అనంతరం యాన్యుటీ తీసుకునే వారి మొత్తం జీవితకాల యాన్యుటీల చెల్లింపు జరుగుతుంది. ఈ ప్లాన్‌ను 2020 అక్టోబర్ 21వ తేదీ నుండి ఆఫ్ లైన్ లేదా ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఈ ప్లాన్ కింద రెండు యాన్యుటీ ఎంపికలను ఎల్ఐసీ అందిస్తోంది.

ఉల్లి ధరలు భగ్గు, రెండ్రోజుల్లో రూ.60 జంప్: కేంద్రం కీలక నిర్ణయంఉల్లి ధరలు భగ్గు, రెండ్రోజుల్లో రూ.60 జంప్: కేంద్రం కీలక నిర్ణయం

 LIC launches New Jeevan Shanti deferred annuity plan

ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు, తాతలు, తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు మనవరాళ్లు, జీవిత భాగస్వాములు, తోబుట్టువుల మధ్య యాన్యుటీ తీసుకోవచ్చు. ఈ పథకంలో కనీస కొనుగోలు ధర రూ.1,50,000. ఇది కనీస యాన్యుటీ ప్రమాణాలకు లోబడి ఉంటుంది. వార్షిక, అర్ధవార్షిక, త్రైమాసిక, నెలవారీ యాన్యుటీ మోడ్ అందుబాటులో ఉంది. కనీస యాన్యుటీ ఏడాదికి రూ.12వేలు. గరిష్ట కొనుగోలు పరిమితి లేదు. ఈ ప్లాన్‌ను దివ్యాంగుల ప్రయోజనం కోసం కనీసం రూ.50వేల కొనుగోలు ధరతో తీసుకోవచ్చు.

English summary

ఎల్ఐసీ సరికొత్త పాలసీ, సరికొత్త డెఫర్డ్ యాన్యుటీ ప్లాన్ | LIC launches New Jeevan Shanti deferred annuity plan

Life Insurance Corporation of India (LIC) has introduced LIC’s New Jeevan Shanti plan. It is a Non-Linked, Non-Participating, Individual, Single-Premium, Deferred Annuity Plan.
Story first published: Thursday, October 22, 2020, 16:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X