For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రేపే ఎల్ఐసీ లిస్టింగ్: ఈ స్టాక్ కొనుగోలు చేయవచ్చా?

|

ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీ రేపు (మే 17వ తేదీ, మంగళవారం) లిస్ట్ కానుంది. ఒక్కో స్టాక్ ధరను గరిష్టంగా రూ.949గా నిర్ణయించారు. ఎల్ఐసీ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ మే 4న ప్రారంభమై, 9వ తేదీన ముగిసింది. రిటైల్, పాలసీదారుల సబ్‌స్క్రిప్షన్ అధికంగా అయింది. 210 షేర్ల కోసం దరఖాస్తు చేసుకుంటే పాలసీదారులకు 48 షేర్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు 77 షేర్లు అలాట్ అయ్యాయి. పాలసీదారులు, రిటైలర్లు ఐపీవోలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో కొంత వెనక్కి వచ్చింది. దీంతో వారు లిస్టింగ్ తర్వాత మరిన్ని షేర్లను కొనే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. అయితే మార్కెట్ పరిస్థితికి అనుగుణంగా ఈ నిర్ణయం ఉంటుంది.

ఎక్కువమంది లిస్టింగ్ రోజు ఏదైనా కరెక్షన్ వస్తే భారీగా కొనుగోలు చేద్దామని, డిస్కౌంట్‌లో స్టాక్ దొరుగుతుంది కాబట్టి వదులుకోవద్దని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నేడు మాత్రం లాభాల్లోకి వచ్చాయి. ఎల్ఐసీ ఇష్యూ ప్రతిపాదించినప్పటి నుండి ఇప్పటి వరకు మార్కెట్ 15 శాతం వరకు నష్టపోయింది. ఇలాంటి సమయంలో ఎల్ఐసీ ఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ నష్టాల్లో లిస్ట్ అవుతుందా, లాభాల్లో అవుతుందా అనే ప్రశ్న నెలకొంది.

LIC IPO listing: Grey market premium negative: should you buy, sell?

ఈ షేర్ ధరను రూ.949గా నిర్ణయించారు. పాలసీదారులకు రూ.60, రిటైలర్లకు, ఉద్యోగులకు రూ.45 డిస్కౌంట్ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్ఐసీ షేర్ వ్యాల్యూ పెరిగితే ప్రస్తుతానికి ఎక్కువగా అమ్మకాలు నమోదు కావొచ్చునని భావిస్తున్నారు. దీంతో నష్టాల్లోకి జారుకోవచ్చునని అంటున్నారు. షేర్ ధర రూ.900 సమీపంలో లిస్ట్ అయినా పాలసీదారులు, రిటైలర్లకు దాదాపు నష్టం లేదు.

ఇప్పటికీ మార్కెట్ వాటాలో ఎల్ఐసీదే 60 శాతానికి పైగా ఉంది. కానీ గత కొంతకాలంగా ఎల్ఐసీ మార్కెట్ పడిపోతోంది. ప్రయివేటు సంస్థల నుండి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. అయితే దీర్ఘకాలానికి ఎల్ఐసీ స్టాక్ కొనుగోలు చేయాలనుకుంటే లిస్టింగ్ రోజునే కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, మార్కెట్ పరిస్థితికి అనుగుణంగా తర్వాత నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు.

English summary

రేపే ఎల్ఐసీ లిస్టింగ్: ఈ స్టాక్ కొనుగోలు చేయవచ్చా? | LIC IPO listing: Grey market premium negative: should you buy, sell?

LIC IPO listing: Grey market premium negative: should you buy, sell.
Story first published: Monday, May 16, 2022, 15:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X