For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వడ్డీ రేటు పెంచిన బ్యాంకులు, ఏ బ్యాంకులో ఎంత ఎంసీఎల్ఆర్ పెరిగిందంటే?

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక వడ్డీ రేట్లను ఇటీవల 50 బేసిస్ పాయింట్లు పెంచింది. అంతకుముందు నెలలో 40 బేసిస్ పాయింట్లు పెంచింది. మొత్తంగా ఐదు వారాల్లోనే ఆర్బీఐ 90 బేసిస్ యింట్లు పెంచింది. దీంతో ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు 4 శాతం నుండి 4.9 శాతానికి పెరిగింది. దీంతో వివిధ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. హోమ్ లోన్, వెహికిల్ లోన్ సహా వివిధ రుణాలు పెరుగుతున్నాయి. దీంతో బ్యాంకు రుణ గ్రహీతల ఈఎంఐ భారం కాస్త పెరుగుతుంది. వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. వివిధ బ్యాంకుల్లో ఎంసీఎల్ఆర్ ఎలా ఉందంటే...

ఐసీఐసీఐ ఎంసీఎల్ఆర్

ఐసీఐసీఐ ఎంసీఎల్ఆర్

ఐసీఐసీఐ బ్యాంకు జూన్ 1వ తేదీ నుండిమార్జినల్ కాస్ట్ ఆఫ్ ది ఫండ్స్ బేస్డ్ రుణ రేటును పెంచింది. ఓవర్ నైట్ వడ్డీ రేటును 7.30 శాతానికి, ఏడాది కాలపరిమితిపై వడ్డీ రేటును 7.55 శాతానికి పెంచింది.

HDFC ఎంసీఎల్ఆర్

HDFC ఎంసీఎల్ఆర్

HDFC బ్యాంకు జూన్ 7వ తేదీ నుండి వడ్డీ రేట్లను సవరించింది. అంతకుముందు మే 7వ తేదీన వడ్డీ రేటును పెంచింది. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 7.15 శాతం నుడి 7.50 శాతానికి, ఏడాది కాలపరిమితిపై 7.85 శాతానికి పెరిగింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంసీఎల్ఆర్

బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంసీఎల్ఆర్

బ్యాంక్ ఆఫ్ బరోడా అన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్‌ను 10 నుండి 20 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ బ్యాంకు వన్ ఇయర్ ఎంసీఎల్ఆర్ 7.50 శాతానికి పెరిగింది. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 6.80 శాతంగా ఉంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాది కాలపరిమితిపై వడ్డీ రేటు 7.45 శాతానికి పెరిగింది. ఓవర్ నైట్ వడ్డీ రేటు 6.70 శాతానికి చేరుకుంది. పెరిగిన వడ్డీ రేట్లు జూన్ 11, 2022 నుండి అమలులోకి వచ్చాయి.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంసీఎల్ఆర్

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంసీఎల్ఆర్

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంసీఎల్ఆర్ వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్లు పెంచింది. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 7.15 శాతానికి, ఏడాది కాలపరిమితిపై ఎంసీఎల్ఆర్ వడ్డీ రేటు 7.70 శాతానికి పెరిగింది. పెరిగిన వడ్డీ రేట్లు జూన్ 10, 2022 నుండి అమలులోకి వచ్చాయి.

కెనరా బ్యాంకు ఎంసీఎల్ఆర్

కెనరా బ్యాంకు ఎంసీఎల్ఆర్

కెనరా బ్యాంకు అన్ని కాలపరిమితిలపై ఎంసీఎల్ఆర్‌ను పెంచింది. ఓవర్ నైట్ కాలపరిమితిపై ఎంసీఎల్ఆర్ 6.65 శాతానికి, ఏడాది కాలపరిమితిపై 7.35 శాతం నుండి 7.40 శాతానికి పెంచింది.

English summary

వడ్డీ రేటు పెంచిన బ్యాంకులు, ఏ బ్యాంకులో ఎంత ఎంసీఎల్ఆర్ పెరిగిందంటే? | Latest MCLRs of ICICI, HDFC, BoB, UBI

Bank customers would see a rise in EMI for numerous types of loans. Other banks have begun to raise repo rate-linked home loan rates as well.
Story first published: Tuesday, June 14, 2022, 13:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X