For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ బ్యాంకు డెబిట్ కార్డు ఉన్నా కూడా ఖర్చును EMI కిందకు మార్చుకోవచ్చు

|

క్రెడిట్ కార్డుతో మాత్రమే కాదు, డెబిట్ కార్డుతో చేసే ఖర్చును కూడా సులభ వాయిదాల్లో అంటే EMIలలో చెల్లించుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది ప్రయివేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంకు. ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ స్టోర్స్‌లో చేసే అన్ని రకాల ఖర్చులను EMI కిందకు మార్చుకునే వెసులుబాటును అందిస్తోంది. 'ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి(buy now pay later)'విధానాన్ని తీసుకు రావడంతో పాటు దీనిని మరింత విస్తృత పరచడంలో భాగంగా ఈ కొత్త సదుపాయాన్ని తీసుకు వచ్చినట్లు తెలిపింది. దీంతో బ్యాంకు ఖాతాదారులు ఇక నుండి ఎక్కడైనా, ఏదైనా కొనుగోలు చేసి EMI కిందకు మార్చుకోవచ్చు.

ఏదైనా స్టోర్‌లో కొటక్ మహీంద్రా బ్యాంకు డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరపగానే మీ ఫోన్‌కు ఓ లింక్‌తో కూడిన సందేశం వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ చెల్లింపు వివరాలను సరిచూసుకోవాలి. అక్కడ ఈఎంఐ ఆప్షన్‌ను ఎంపిక చేసుకొని, కాలపరిమితిని వెల్లడించాలి. ఆ తర్వాత ట్రాన్సాక్షన్ మొత్తం ఈఎంఐ కిందకు వెళ్లిపోతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మీరు ఖర్చు చేసిన మొత్తం మీ ఖాతాలో జమ అవుతుంది.

Kotak Debit Cardholders can now buy everything on EMI

అయితే ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి రూ.5వేలు అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే ఈ పరిమితి దాటితేనే దానిని ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. ఇది ప్రస్తుతం ప్రత్యేక డెబిట్ కార్డులకు మాత్రమే ఇప్పటి వరకు వర్తించింది. అది కూడా కొన్ని పరిమిత స్టోర్స్‌లలో మాత్రమే. కానీ ఇప్పుడు కొటక్ మహీంద్రా బ్యాంకు తీసుకు వచ్చిన ఈ సదుపాయంతో కొటక్ డెబిట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు అన్ని రకాల స్టోర్స్‌లలో చేసే ఖర్చును ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు.

English summary

ఈ బ్యాంకు డెబిట్ కార్డు ఉన్నా కూడా ఖర్చును EMI కిందకు మార్చుకోవచ్చు | Kotak Debit Cardholders can now buy everything on EMI

Kotak Mahindra Bank announced that all eligible Kotak debit cardholders can now avail of the EMI on Debit Card facility on all their mid and high-value purchases, at all offline and online stores across the country.
Story first published: Friday, August 13, 2021, 20:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X