For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్‌లోన్ తీసుకున్నా.. డబ్బు తక్కువపడిందా? అయితే ఇది బెస్ట్!

|

భారత అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రియాల్టీ గోల్డ్ లోన్ స్కీంను ఆఫర్ చేస్తోంది. ఈ స్కీం ముఖ్య ఉద్దేశ్యం ఎవరికైనా హోమ్ లోన్ కోసం డబ్బులు తక్కువపడితే రియాల్టీ గోల్డ్ లోన్ స్కీం ద్వారా కొంత ఊరట దక్కవచ్చు. బంగారం, బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం ద్వారా రియాల్టీ గోల్డ్ లోన్‌ను తీసుకోవచ్చు. 'మీ కలల ఇంటి కోసం డబ్బులు తక్కువ పడ్డాయా, అయితే ఆ మొత్తాన్ని పూరించేందుకు ఎస్బీఐ రియాల్టీ గోల్డ్ లోన్ స్కీం తీసుకోండి. త్వరగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వస్తుంది' అని ఎస్బీఐ ట్వీట్ చేసింది.

ఎస్బీఐ రియాల్టీ గోల్డ్ లోన్ స్కీమ్ కీ ఫీచర్స్

ఎస్బీఐ రియాల్టీ గోల్డ్ లోన్ స్కీమ్ కీ ఫీచర్స్

గరిష్ట రుణ పరిమితి: రూ.50 లక్షలు

కనీస రుణ పరిమితి: రూ.50,000

సాధారణంగా హోమ్ లోన్ కోసం బ్యాంకులు రూ.30 లక్షల నుండి రూ.75 లక్షలు అంతకుమించి ఇస్తాయి. అయితే మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఈ రుణాలు ఇస్తాయి. దీంతో అరవై శాతం నుండి ఎనభై శాతం వరకు మాత్రమే రుణం వస్తుంది. మిగతా మొత్తాన్ని సర్దుబాటు చేయడానికి ఇబ్బందిపడేవారికి ఈ రుణం ప్రయోజనకరం.

మార్జిన్

మార్జిన్

SBI రియాల్టీ EMI గోల్డ్ లోన్: 25%

SBI రియాల్టీ లిక్విడ్ గోల్డ్ లోన్(Overdraft): 25%

SBI రియాల్టీ బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్: 35%

సెక్యూరిటీ: నాణ్యత, పరిమాణంతో తనిఖీ చేయబడిన బంగారు ఆభరణాల తాకట్టు.

ప్రాసెసింగ్ ఫీజు: లోన్ మొత్తంలో 0.50% + రూ.500 కనీస జీఎస్టీ వర్తింపు + applicable GST

వడ్డీ రేటు: MCLR-1 year కంటే 0.30% ఎక్కువ

ఇతర ఛార్జీలు: గోల్డ్ అప్రైజర్ ఛార్జీలు ఉంటాయి.

వడ్డీ రేటు, అర్హత

వడ్డీ రేటు, అర్హత

- రియాల్టీ గోల్డ్ లోన్ (all variants) వడ్డీ రేటు - 7.30%

- కొవిడ్ వారియర్స్‌కు వడ్డీ రేటు - 7.30%

- బుల్లెట్ రీపేమెంట్ కొవిడ్ వారియర్స్‌కు వడ్డీ రేటు - 7.00%

- రుణగ్రహీత వయస్సు 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ ఉండాలి.

- ఎస్బీఐ హౌసింగ్ లోన్ రుణగ్రహీత అయి ఉండాలి.

English summary

హోమ్‌లోన్ తీసుకున్నా.. డబ్బు తక్కువపడిందా? అయితే ఇది బెస్ట్! | Know the SBI Realty Gold Loan scheme? Interest rates, eligibility and other details

India's largest public sector lender SBI is offering Realty Gold Loan scheme under which home borrowers can avail loan to meet the shortfall in financing it.
Story first published: Wednesday, November 17, 2021, 16:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X