For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిస్క్ వద్దనుకుంటే ఈ పెట్టుబడులు సురక్షితం, పదేళ్లలో మీ డబ్బులు డబుల్

|

పెట్టుబడుల కోసం వివిధ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం, అలాగే వివిధ ప్రభుత్వరంగ ఆర్థిక, ఇతర సంస్థలు కూడా పెట్టుబడి పథకాలను అందిస్తున్నాయి. వివిధ రకాల సేవింగ్స్ ఇండివిడ్యువల్స్ పెట్టుబడి ప్లాన్‌కు అనుకూలంగా ఉంటాయి. పిల్లల చదువులు, పెళ్లి, పదవీ విరమణ తదితర ఎన్నో లక్ష్యాల కోసం ఈ పెట్టుబడులు ఉపయోగపడతాయి.

రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా విస్తృత పెట్టుబడి ఆప్షన్స్ ఉన్నాయి. ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్(PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(NSC), పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్, పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం(POMIS), కిసాన్ వికాస్ పత్ర(KVP)తదితర స్కీమ్స్ ఉన్నాయి.

తక్కువ రిస్క్‌తో కూడినవి

తక్కువ రిస్క్‌తో కూడినవి

ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులు నమ్మదగినవి, తక్కువ రిస్క్‌తో కూడినవి, సురక్షితమైనవి. ఇందులో కొన్ని దీర్ఘకాలిక సంపద సృష్టికి అనువైనవిగా ఉన్నాయి. ఈ పెట్టుబడులు తక్కువ రిటర్న్స్ ఇచ్చినప్పటికీ, మార్కెట్ అస్థిరతకు లోనుకావు. కాబట్టి సురక్షితమైనవిగా చెప్పవచ్చు. ఈ పెట్టుబడుల్లో కొన్నింటికి లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ద్రవ్యోల్భణం, పెరుగుతున్న ఖర్చల ఆధారంగా వడ్డీ రేట్లను సవరిస్తుంటారు. ఈ సేవింగ్స్ పథకాలపై వడ్డీ రేట్లు త్రైమాసిక లేదా అర్ధ సంవత్సర ప్రాతిపదికన సవరిస్తారు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

ఇండివిడ్యువల్స్ ఎవరైనా ఏడాదికి రూ.500 కనీస మొత్తంతో ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ఈ పెట్టుబడిపై ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(NSC)

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(NSC)

రూ.1000 నుండి పెట్టుబడిగా పెట్టవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఏడాదికి వడ్డీ రేటు 6.8 శాతంగా ఉంది. పన్ను మినహాయింపు రూ.1.5 లక్షల వరకు ఉంది.

పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్

పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్

ఇండివిడ్యువల్స్ ఎవరైనా రూ.500 నుండి పెట్టుబడిగా పెట్టవచ్చు. పెట్టుబడి గరిష్ట పరిమితి లేదు. వడ్డీ రేటు ఏడాదికి 4 శాతంగా ఉంది. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ పైన వచ్చే వడ్డీ రేటుపై పన్నురహితంగా ఉంది.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్

ఇండివిడ్యువల్స్ కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి లేదు. మొదటి మూడేళ్ల కాలానికి 5.5 శాతం వడ్డీ రేటు, అయిదేళ్ల కాలపరిమితిపై 6.7 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది.

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్

గరిష్ట పరిమితి లేకుండా రూ.100 నుండి పెట్టుబడి పెట్టవచ్చు. వ్యక్తి లేదా సంయుక్తంగా డిపాజిట్ చేయవచ్చు. వడ్డీ రేటు 5.8 శాతం. వడ్డీపై పన్ను .ఉంటుంది. డిపాజిట్ పైన మినహాయింపు లేదు.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం(POMIS)

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం(POMIS)

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం ఖాతాలో గరిష్టంగా ఒకరి ఖాతాలో రూ.4.5 లక్షలు, ఉమ్మడి ఖాతాలో రూ.9 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. కనీసం రూ.1000 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఏడాదికి వడ్డీ రేటు 6.6 శాతం. దీనిని నెలవారీగా చెల్లిస్తారు. వడ్డీపై పన్ను ఉంటుంది.

కిసాన్ వికాస్ పత్ర (KVP)

కిసాన్ వికాస్ పత్ర (KVP)

ఇండివిడ్యువల్ కనీసం రూ.1000 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఏడాదికి వడ్డీ రేటు 6.9 శాతం. వడ్డీ పన్ను, మెచ్యూరిటీ తర్వాత మొత్తంపై మినహాయింపు. ఈ పెట్టుబడితో పది సంవత్సరాల నాలుగు నెలల్లో మీ మొత్తం రెట్టింపు అవుతుంది.

English summary

రిస్క్ వద్దనుకుంటే ఈ పెట్టుబడులు సురక్షితం, పదేళ్లలో మీ డబ్బులు డబుల్ | Know the details of best government savings schemes

There are various savings schemes available for investment, offered by both the government as well as public sector financial institutions.
Story first published: Friday, July 23, 2021, 11:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X