For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

EPF account online: ఉద్యోగం మానేసిన తేదీని మీరే అప్ డేట్ చేయండిలా..

|

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPF) మెంబర్స్ తమ కంపెనీ నుండి నిష్క్రమించిన తేదీని ఆన్‌లైన్ పద్ధతిలో ఉపయోగించి స్వయంగా అప్ డేట్ చేసుకోవచ్చు. ఉద్యోగులు ఇప్పుడు తమ ఈపీఎఫ్ ఖాతాలో నిష్క్రమణ తేదీని సొంతగా అప్ డేట్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ FAQ ప్రకారం ఆన్ లైన్ బదలీ కోసం దరఖాస్తు చేయడానికి గతంలో చేసిన ఉద్యోగం/ఉద్యోగం నుండి నిష్క్రమించిన తేదీని తప్పనిసరిగా అప్ డేట్ చేయాలి. ఉద్యోగం మానివేసిన రెండు నెలల తర్వాత మాత్రమే ఈ తేదీనిని అప్ డేట్ చేసుకోవచ్చు. పాత యజమాని అందించిన చివరి చెల్లింపు నెలలో ఏదైనా కావొచ్చు. అంటే మీరు ఇంట్లో కూర్చొని ఆన్ లైన్ ద్వారా అప్ డేట్ చేసుకోవచ్చు.

ఓటీపీ ద్వారా అప్ డేట్

ఓటీపీ ద్వారా అప్ డేట్

ఈపీఎఫ్ఓ తన మెంబర్స్‌కు కంపెనీ నుండి నిష్క్రమించిన తేదీని ఆన్ లైన్ ద్వారా ఎలా అప్ డేట్ చేయాలో ఉద్యోగులకు చెప్పడానికి ఓ వీడియోను విడుదల చేసింది. మీరు వేరే కంపెనీలో ఉద్యోగంలో చేరి పీఎఫ్‌ను బదలీ చేయాలని భావిస్తే అంతకుముందు పాత కంపెనీ నుండి ఉద్యోగం మానివేసిన తేదీని ఈపీఎఫ్ ఖాతాలో అప్ డేట్ చేయాలి. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ నుండి తేదీని అప్ డేట్ చేసే సౌకర్యం అందుబాటులో ఉంది. కాబట్టి యూఏఎన్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసిన వ్యక్తులు మాత్రమే ఈ సదుపాయాన్ని పొందుతారు. మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసినట్లయితే ఈపీఎఫ్ ఓటీపీ అదే నెంబర్‌కు వస్తుంది. అదే ఓటీపీ సాయంతో ఉద్యోగం నుండి నిష్క్రమించే తేదీని అప్ డేట్ చేసుకోవచ్చు.

ఇలా మార్చుకోవచ్చు

ఇలా మార్చుకోవచ్చు

- యూఏఎన్, పాస్ వర్డ్‌ను ఉపయోగించి https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పోర్టల్‌లోకి లాగ్-ఇన్ కావాలి.

- Manage ట్యాబ్ పైన క్లిక్ చేసి, మార్క్ ఎగ్జిట్ పైన క్లిక్ చేయాలి. ఎంప్లాయిమెంట్ డ్రాప్ డౌన్ ద్వారా పీఎఫ్ ఖాతా నెంబర్‌ను ఎంచుకోవాలి.

- తేదీని ఎంటర్ చేయాలి. ఉద్యోగం నుండి నిష్క్రమించడానికి గల కారణాన్ని వెల్లడించాలి.

- రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. అప్పుడు ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేయాలి. - చెక్ బాక్సును క్లిక్ చేయాలి. అప్ డేట్ పైన క్లిక్ చేసి, ఆ తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత మీరు మునుపటి కంపెనీ నుండి ఉద్యోగం మానివేసిన తేదీని విజయవంతంగా అప్ డేట్ చేసినట్లు మీ మొబైల్ నెంబర్‌కు సందేశం వస్తుంది.

కస్టమర్లకు ఈపీఎఫ్ఓ హెచ్చరిక

కస్టమర్లకు ఈపీఎఫ్ఓ హెచ్చరిక

నామినేషన్ ఫైలింగ్ చేయడానికి ఈపీఎఫ్ఓ ఎలాంటి చివరి తేదీని ప్రకటించలేదు.

ఈపీఎఫ్ఓ ఎప్పుడు కూడా మీ పర్సనల్ డిటైల్స్ ఇవ్వాలని అడగదు. అంటే ఆధార్, పాన్, బ్యాంకు వివరాలు ఇవ్వాలని ఫోన్ ద్వారా అడగదు.

ఏదైనా బ్యాంకులో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయమని కూడా అడగదు. అలాంటి కాల్స్‌కు స్పందించవద్దని ఈపీఎఫ్ఓ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేస్తోంది.

English summary

EPF account online: ఉద్యోగం మానేసిన తేదీని మీరే అప్ డేట్ చేయండిలా.. | Know how to update date of exit of job in epf account online

EPF members can update their date of exit from a company themselves using the online method. Employees can now self-update their date of exit in their EPF account.
Story first published: Wednesday, January 26, 2022, 14:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X