For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రిజ్, ఎల్ఈడీ టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ లోన్ చూడండి

|

పర్సనల్ లోన్, వెహికిల్ లోన్, గోల్డ్ లోన్, హోమ్ లోన్ సాధారణంగా వినేవి. అయితే గృహోపకరణాలకు కూడా లోన్ తీసుకోవచ్చు. గృహోపకరణాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. త్వరగా నిరుపయోగంగా మారని వస్తువులను మన్నికైన లేదా కన్స్యూమర్ డ్యూరబుల్స్ అంటారు. ఇవి మన్నికైన వస్తువులు కాబట్టి తరుచూ కొనుగోలు చేయవలసిన అవసరం ఉండదు. ఈ వస్తువులు కనీసం మూడేళ్ల పాటు ఉంటాయి. ఆటోమొబైల్స్, బుక్స్, హౌస్ హోల్డ్ గూడ్స్(అప్లియెన్సెస్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్, టూల్స్ తదితరాలు), స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్స్, జ్యువెల్లరీ, మెడికల్ ఎక్విప్‌మెంట్స్ తదితరాలు ఇందులో ఉన్నాయి.

అయితే ఇందులో ముఖ్యంగా వాషింగ్ మెషీన్, ఎల్ఈడీ టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ వంటివి ఇప్పుడు ప్రతి ఇంట్లో తప్పనిసరి అయ్యాయి. వీటిని కొనుగోలు చేయడానికి ఒకేసారి పెద్ద మొత్తంలో చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు. అందుకే ఆర్థిక సంస్థలు వీటిపై రుణాలు ఇస్తుంటాయి. ఈ రుణాలపై ఈఎంఐ చెల్లించాలి. గృహోపకరణాలు, గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయాలంటే కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ తీసుకోవచ్చు. ఫోన్ నుండి ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మెషీన్ వరకు రుణం తీసుకోవచ్చు.

వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు

వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు

వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, ఏసీ, ఎల్ఈడీ టీవీ, మైక్రోవేవ్స్, ఫ‌ర్నీచ‌ర్, దుస్తులు, గ్రాసరీ కొనుగోలుకు కూడా ఆర్థిక సంస్థలు రుణాన్ని అందిస్తాయి. బ్యాంక్స్, బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్ వంటి ఆర్థిక సంస్థ‌ల నుండి ఈ రుణాల‌ు పొందవచ్చు. అంతేకాదు, సౌకర్యవంతమైన కాలపరిమితిని ఎంచుకొని చెల్లింపులు జరపవచ్చు. వీటిపై సున్నా లేదా త‌క్కువ వ‌డ్డీ రేట్లు ఉంటాయి.

రుణాలపై వడ్డీ రేట్లు పర్సనల్ రుణాలు, క్రెడిట్ కార్డ్స్ కంటే తక్కువగా ఉంటాయి. బజాజ్ ఫిన్ సర్వ్ వంటి ఆర్థిక సంస్థలు ఎంపిక చేసిన వస్తువులపై వడ్డీ లేని రుణాలను కూడా అందిస్తోంది. వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉంటాయి. ఈ రుణాలపై కొన్ని బ్యాంకుల్లో ప్రాసెసింగ్ ఫీజు ఉంటే, మరికొన్ని బ్యాంకుల్లో లేదు.

కాలపరిమితి

కాలపరిమితి

కన్స్యూమర్ డ్యూరబుల్ రుణ కాల‌ప‌రిమితి సాధార‌ణంగా మూడు నెలల నుండి 24 నెల‌లు ఉంటుంది. వస్తువులను బట్టి, బ్యాంకును బట్టి రుణ కాలపరిమితి ఉంటుంది. వడ్డీ మొత్తం తగ్గాలంటే రుణ కాలపరిమితి తక్కువగా ఉండాలి. వడ్డీ లేని రుణం అయితే ఈఎంఐ ఎక్కువ కాలం ఉన్నా పర్వాలేదు.

వస్తువులను బట్టి రుణం ఉంటుంది. ఇక డౌన్ పేమెంట్ ఆధారంగా ఈఎంఐ ఉంటుంది. సాధారణంగా వస్తువు వ్యాల్యూలో 90 శాతం వరకు రుణాలు ఇస్తాయి ఆర్థిక సంస్థలు. డౌన్ పేమెంట్ ఒక్కో సమయంలో ఇరవై శాతం వరకు ఉంటుంది. కొన్ని ఆర్థిక సంస్థలు వంద శాతం రుణాలు కూడా ఇస్తాయి.

రుణం కంటే ఇది బెట్టర్

రుణం కంటే ఇది బెట్టర్

రుణం తీసుకోవడం కంటే మొదటి నుండి పొదుపు చేయడం ద్వారా ఒకేసారి చెల్లించడం ద్వారా రుణం తీసుకోవడం మేలు అని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇటీవల కాలంలో భారీగా లాభపడుతున్నాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్‌లో అంబర్ ఎంటర్‌ప్రైజెస్, వోల్టాస్ కజారియా సెరామిక్స్, డిక్సన్, క్రాంప్టన్, ఓరియంట్ ఎలక్ట్రిక్, హావెల్స్ ఇండియా ఉన్నాయి.

English summary

ఫ్రిజ్, ఎల్ఈడీ టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ లోన్ చూడండి | Know about Consumer Durable Loan?

A Consumer Durable Loan is an option given to customers to purchase durable items.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X