For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వడ్డీ రేటు ఎక్కువే, కానీ: ఫిన్‌టెక్ కంపెనీల నుండి ఈజీగా రుణాలు

|

ఇటీవల కేంద్రఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లుగా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ మార్కెట్‌లలో భారత్ ఒకటి. ఫిన్ టెక్ అడాప్షన్ రేటు భారత్‌లో 87 శాతంగా ఉండగా, ప్రపంవచ్యాప్తంగా ఈ సగటు 64 శాతం మాత్రమేనని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పారు. వ్యక్తిగత రుణ విభాగంలో ప్రభావం కనిపిస్తోందని, ఎందుకంటే ఈ రుణాలను పొందే ప్రక్రియ అత్యంత సౌకర్యవంతంగా, వేగవంతంగా మారిందని ఫేస్ (ఫిన్‌టెక్ అసోసియేషన్ ఫర్ కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్) క్రెడిట్-బీ కో-ఫౌండర్ అండ్ సీఈవో మధుసూదన్ ఏకాంబరం అన్నారు. సాంప్రదాయ రుణాలు ఇచ్చే బ్యాంకులు రుణ గ్రహీత ఖాతా పర్ఫార్మెన్స్, క్రెడిట్ స్కోర్, శాలరీ ప్రూఫ్, ఏజ్ అండ్ రుణ కాలపరిమతి, శాలరీ ప్రూఫ్ వంటివి అవసరం. ఇది పూర్తి రుణ ప్రక్రియ ఆలస్యానికి, అధికస్థాయిలో ఫిజికల్ డాక్యుమెంటేషన్ అవసరం. అయితే ఫిన్ టెక్ ప్లేయర్స్ డిజిటల్ రుణాలను అందిపుచ్చుకోవడంతో పాటు భౌతిక పత్రాల అవసరం తగ్గేలా చేసింది.

ఫిన్‌టెక్‌కు ఆదరణ

ఫిన్‌టెక్‌కు ఆదరణ

వ్యక్తిగత రుణాల కోసం ఫిన్‌టెక్ పట్ల రుణ గ్రహీతలకు అనుబంధం పెరుగుతోంది. ఈ డిజిటల్ లెండర్స్ కొత్త క్రెడిట్స్(NTC-న్యూ టు క్రెడిట్) రుణ గ్రహీతలకు కూడా ఇస్తుంది. ఫిన్ టెక్ కంపెనీలు బ్యాంకుల కంటే వేగంగా 15 నిమిషాల నుండి గరిష్టంగా 72 గంటల్లో వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. మొబైల్ ద్వారానే రుణాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఫిన్‌టెక్ కంపెనీలు డిజిటల్‌గా రుణం తీసుకునే వ్యక్తి క్రెడిట్ యోగ్యతను కొన్ని పరిమితుల ఆధారంగా అంచనా వేస్తారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్ టెక్ మార్కెట్‌లో భారత్ ఒకటి. వ్యక్తిగత రుణ విభాగంలో ఫిన్‌టెక్ కంపెనీల ప్రభావం ఎక్కువ. ఇందుకు బలమైన కారణం రుణాలను పొందే అవకాశం అత్యంత సౌకర్యవంతంగా, వేగం కావడం.

రుణాల అందజేత

రుణాల అందజేత

పర్సనల్ లోన్ ఒక అన్-సెక్యూర్డ్ లోన్. సాధారణంగా బ్యాంకులు వ్య‌క్తిగ‌త రుణాలు ఇవ్వడానికి బ్యాంకు స్టేట్‌మెంట్, క్రెడిట్ స్కోర్‌, పే-స్లిప్స్, రుణం తీర్చే కాల వ్య‌వ‌ధి వంటి ఇంకా ఇత‌ర డాక్యుమెంట్స్‌ను భౌతికంగా తీసుకుంటాయి. రుణం ఇవ్వ‌డానికి ఏడు నుండి ఎనిమిది వర్కింగ్ డేస్ తీసుకుంటాయి. ఈ వ్య‌వ‌హార‌ం అంతా కస్టమర్లకు ఇబ్బందిగా ఉంటోంది. ఫిన్‌టెక్ కంపెనీలు దీనిని అంత‌టిని డిజిట‌ల్‌గా సుల‌భ‌త‌రం చేసాయి. కస్టమర్లు వ్య‌క్తిగ‌త రుణాల‌కై ఫిన్‌టెక కంపెనీల‌ను ఆశ్ర‌యించ‌టం క్రమంగా పెరుగుతోంది. క్రెడిట్ స్కోర్, ఆదాయం, ఎంప్లాయిమెంట్ హిస్టరీ, పాన్ కార్డు, ఆధార్ కార్డు, పేస్లిప్స్, బ్యాంకు స్టేట్‌మెంట్ వంటి పత్రాలను ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేసే సదుపాయాన్ని మొబైల్ యాప్ ద్వారా లేదా వెబ్ సైట్ ద్వారా అందించి, కస్టమర్‌ను తమ వద్దకు రాకుండానే రుణాలను అందిస్తున్నాయి. రుణం తీసుకునేవారి ఆధార్ వివరాలు, ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ ద్వారా రుణ ఒప్పందాలపై డిజిటల్ సంతకం చేయడానికి ఈ-కేవైసీని ఉపయోగించుకుంటున్నారు.

పెనాల్టీ

పెనాల్టీ

చాలా బ్యాంకులు, ఆర్ధిక సంస్థ‌లు ప్రీ-పేమెంట్ కోసం పెనాల్టీ ఛార్జీని విధిస్తాయి. అయితే ఫిన్‌టెక్ కంపెనీలు ప్రీ-పేమెంట్‌లో పెనాల్టీ ఛార్జీలు లేకుండా లేదా ప‌రిమితం చేసి బ‌కాయిల‌ను వ‌సూలు చేస్తున్నాయి. అయితే పర్సనల్ లోన్స్‌కు ఫిన్‌టెక్ కంపెనీలు వ‌డ్డీ రేటును కాస్త అధికంగానే వ‌సూలు చేస్తాయి.

English summary

వడ్డీ రేటు ఎక్కువే, కానీ: ఫిన్‌టెక్ కంపెనీల నుండి ఈజీగా రుణాలు | Keep these things in mind while taking a personal loan from fintech companies

India is among the world’s fastest-growing fintech markets, with an adoption rate of 87 per cent versus the global average of 64 per cent, as stated by the Finance Minister recently.
Story first published: Tuesday, October 12, 2021, 16:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X