For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియల్ ఎస్టేట్ లేదా ఇంటి కొనుగోలు మంచి పెట్టుబడి ఐడియానా?

|

పెట్టుబడి అంటే స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్(పసిడి సహా), మ్యూచువల్ ఫండ్స్, MF సిప్స్, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇంటి కొనుగోలు సహా రియల్ ఎస్టేట్‌లోను ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిటర్న్స్ పొందవచ్చు. కరోనా సమయంలో రియాల్టీ భారీగా పడిపోయింది. ఆర్థిక రికవరీ కనిపించినా కొద్ది రియాల్టీ విభాగం కూడా భారీగా వృద్ధిని నమోదు చేస్తోంది. హోమ్ లోన్ సహా రియాల్టీ పైన ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్వల్పకాలం నుండి దీర్ఘకాలం వరకు మంచి రిటర్న్స్ పొందవచ్చు.

ఇంటిపై పెట్టుబడి మంచి ఐడియానా?

ఇంటిపై పెట్టుబడి మంచి ఐడియానా?

లాంగ్ టర్మ్ పరంగా స్టాక్స్, బంగారంతో పాటు హోమ్ లేదా రియాల్టీపై పెట్టుబడి కూడా మంచి ఎంపికగా నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు బంగారం, రియాల్టీలో పెట్టుబడి పెడితే ఎమోషనల్ శాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది.

బెస్ట్ హోమ్ ఇన్వెస్ట్‌మెంట్

బెస్ట్ హోమ్ ఇన్వెస్ట్‌మెంట్

రియాల్టీలో పెట్టుబడి పెట్టే సమయంలోను మంచి రిటర్న్స్ వచ్చే దానిని ఎంచుకోవాలి. భూమి పైన, కమర్షియల్ ప్రాపర్టీ పైన, హౌస్ ప్రాపర్టీ పైన.. ఇలా వివిధ మార్గాలు ఉన్నాయి. భూమి పైన ఇన్వెస్ట్ చేస్తే రీ-సేల్‌లో మంచి ధర ఉంటుంది. లాంగ్ టర్మ్‌లోను మంచి ఫలితాలు వస్తాయి. ఇంటిని కొనుగోలు చేసి, అద్దెకు ఇస్తే నిత్యం రాబడి కనిపిస్తుంది. ఇక కమర్షియల్ ప్రాపర్టీ అయితే మరింత ప్రయోజనం ఉంటుంది. ప్రతి నెల రాబడితో పాటు దాని వ్యాల్యూ కూడా ఎప్పటికి అప్పుడు పెరుగుతుంది.

అనుకోకుండా కుదేలైతే

అనుకోకుండా కుదేలైతే

ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది రియాల్టీ వైపు మొగ్గు చూపుతుంటారు. కొందరు భూమిపై ఇన్వెస్ట్ చేస్తే, మరికొందరు ఇళ్లను కొని మంచి ధర వచ్చినప్పుడు అమ్మేస్తుంటారు. కరోనా సంక్షోభం నుండి బయటపడుతున్న నేపథ్యంలో మరోసారి రియాల్టీ రంగానికి ప్రాధాన్యత పెరుగుతోంది. భూమి కంటే ఇటీవల ఇంటిని కొనుగోలు చేసేవారు ఎక్కువగా పెరిగారు.

స్టాక్, బంగారం, బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడంపై చాలామందికి పెద్దగా అవగాహన ఉండదు. కాబట్టి తమ వద్ద ఉన్న డబ్బు అంతటిని రియాల్టీలో ఇన్వెస్ట్ చేసేవారు ఉంటారు. కానీ మొత్తాన్ని ఇక్కడే ఇన్వెస్ట్ చేయడం సరికాదు. ఎందుకంటే దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ, అనుకోని పరిస్థితుల్లో ఈ రంగం కుదేలైతే అవసరానికి చేతికి అందకపోవచ్చు. రియాల్టీ రంగానికి పెట్టుబడిలో 25 శాతం వరకు కేటాయించాలి.

ఇవి గుర్తుంచుకోండి...

ఇవి గుర్తుంచుకోండి...

ఇంటిని కొనుగోలు చేసినప్పుటు తెలియని, కనిపించను ఖర్చులు ఉంటాయి. పన్నులు, సొసైటీ నిర్వహణ వ్యయం, పునరుద్ధరణ ఖర్చులు, బ్రోకరేజీ ఖర్చు, అద్దెకు సంబంధించిన రిస్క్.. ఇలా ఎన్నో ఉంటాయి. కొత్తవారు అద్దెకు వచ్చిన ప్రతిసారి ఏజెంట్లకు బ్రోకరేజీ చెల్లించవలసి రావొచ్చు. ప్రతి అయిదారేళ్లకోసారి ఆధునికీకరణ పనులు చేయాలి. ద్రవ్యోల్భణం పెరుగుతున్న తరుణంలో అద్దెలను ప్రతి సంవత్సరం పెంచలేని పరిస్థితి.

English summary

రియల్ ఎస్టేట్ లేదా ఇంటి కొనుగోలు మంచి పెట్టుబడి ఐడియానా? | Is real estate is the best investment?

real estate was rated the best long-term investment – well ahead of gold, stocks and mutual funds, savings accounts/CDs and bonds.
Story first published: Friday, April 15, 2022, 15:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X