For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ చేసే సమయంలో ఇవి పాటించండి

|

జనవరి 1వ తేదీ నుండి కాంటాక్ట్‌లెస్ కార్డు ట్రాన్సాక్షన్స్ పరిమితిని రూ.2వేల నుండి రూ.5 వేలకు పెంచనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవల తెలిపారు. కరోనా సమయంలో సమర్ధ, సురక్షిత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం ఉందని అభిప్రాయపడ్డారు. సురక్షిత డిజిటల్ చెల్లింపుల కోసం కస్టమర్ ఇష్టానుసారం కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్ పరిమితి పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.2వేల వరకు చెల్లింపులు, ట్రాన్సాక్షన్స్ పిన్ నెంబర్ లేకుండా జరుపుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.5,000కు పెంచుతున్నారు.

RBI సెక్యూరిటీ రూల్స్! జనవరి నుండి పిన్ లేకుండా రూ.5,000 వరకు ట్రాన్సాక్షన్స్RBI సెక్యూరిటీ రూల్స్! జనవరి నుండి పిన్ లేకుండా రూ.5,000 వరకు ట్రాన్సాక్షన్స్

కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు పెరుగుతాయి

కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు పెరుగుతాయి

అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో మరింత భద్రమైన, సురక్షితమైన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అందించడంలో భాగంగా కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్, ఈ-మాండేట్స్ పరిమితిని పెంచడం వంటి నిర్ణయం సురక్షితమేనా అనే చర్చ సాగుతోంది. కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. తాజా నిర్ణయంతో షాప్స్, మాల్స్ సహా వివిధ ప్రాంతాల్లో కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు పెరుగుతాయి. అయితే సురక్షితంగా ఉండేందుకు వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేస్తున్నారు.

పాస్ వర్డ్ బలంగా..

పాస్ వర్డ్ బలంగా..

బ్యాంకు ఖాతాలు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు పాటించినట్లు, మొబైల్ ఫోన్స్, ఆన్‌లైన్ వ్యాలెట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. కాంటాక్ట్‌లెస్ బ్యాంకు ఖాతాకు సంబంధించి కార్డును సురక్షితంగా పెట్టుకోవాలి. కార్డును ఎవరికీ ఇవ్వవద్దు. బలమైన పాస్ వర్డ్స్ ఉండాలి.

కార్డుపోతే..

కార్డుపోతే..

కార్డు పోగొట్టుకుంటే వెంటనే బ్యాంకు కస్టమర్ సెంటర్‌కు ఫోన్ చేసి చెప్పాలి. కార్డును బ్లాక్ చేయించుకోవాలి. మీ ఖాతాకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖకు వెళ్లి చూసుకోవాలి. మీ పాస్ వర్డును ఎవరితోను పంచుకోవద్దు. కార్డును ఎక్కడా మరిచిపోకుండా చూసుకోవాలి.

English summary

కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ చేసే సమయంలో ఇవి పాటించండి | Is contactless card transaction safe?

The central bank has increased the limit for contactless card payments from ₹ 2,000 to ₹ 5,000 per transaction.
Story first published: Monday, December 7, 2020, 21:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X