ఈ వారం రెండు బడా సంస్థలు IPOకు వస్తున్నాయి. ఇండిగో పేయింట్స్ ఐపీవో జనవరి20న ప్రారంభమై జనవరి 22న ముగుస్తుంది. దీని కంటే ముందు ప్రభుత్వరంగ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పోరేషన్ (IRFC) నేడు (సోమవారం జనవరి 18) IPOకు వస్తోంది. 20వ తేదీన ముగుస్తుంది. రూ.4,633 కోట్లు సమీకరించే లక్ష్యంతో వస్తోంది. దీనికి సంబంధించి యాంకర్ ఇన్వెస్టర్లకు 15వ తేదీ నుండే బుకింగ్స్ మొదలు పెట్టింది. శుక్రవారం నాటికే రూ.1398 కోట్లను సమీకరించినట్లుగా తెలుస్తోంది.

రిటైలర్లకు 35 శాతం
ఓ ప్రభుత్వరంగ NBFC ఐపీవోకు రావడం ఇది మొదటిసారి. లిస్టింగ్‌కు వచ్చిన అయిదో రైల్వే కంపెనీ. ఈ ఆఫర్‌లో 50 శాతం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్లకు రిజర్వ్ చేశారు. 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించారు. మిగిలిన 35 శాతం వాటాల్ని రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి కేంద్రం లేదా రైల్వే మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రభావం ఈ స్టాక్స్ పైన ప్రభావం చూపుతుంది. ఐపీవో ప్రైస్ బ్యాండ్ చవగ్గానే ఉందని అంటున్నారు.

ఒక్కో షేర్ రూ.25 లేదా రూ.26
ఒక్కో షేర్ ధర రూ.25 నుండి రూ.26 మధ్య ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. లాట్ సైజ్ 575. ఇప్పటి వరకు ఐపీవోకు వచ్చిన రైల్వేసంస్థలు లిస్టింగ్ సమయంలో మంచి లాభాలు అందించాయి. దీంతో IRFCపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ రైల్వేలకు బహిరంగ మార్కెట్‌లో రుణ పరపతి కల్పించే సంస్థ IRFC. 1,782,069,000 షేర్లను విక్రయించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో IRFC రూ. 71,392 కోట్లు ఫైనాన్స్ చేసింది.

ఇండిగో పేయింట్స్ కూడా
సీక్వియో క్యాపిటల్ బ్యాక్డ్ ఇండిగో పెయింట్స్ కూడా 20 నుండి 22 ఐపీవోకు వస్తోంది. రూ.58,40,000 షేర్లు జారీ చేస్తోంది. ఒక్కో షేర్ వ్యాల్యూ రూ.1488 నుండి 1490 మధ్య ఉంటుందని అంచనా. గత ఏడాది ఐపీవోలకు మంచి ఆదరణ లభించింది. ఈ ఏడాది కూడా పలు కంపెనీలు ఇష్యూకు వస్తున్నాయి.
More From GoodReturns

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్థ గంట ముందు బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు.. కొత్త నిబంధనలు ఇవే..

పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. Jio IPO రెడీ అవుతోంది.. 250 మిలియన్లకు పైగా షేర్లు మార్కెట్లోకి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications