For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

100% వద్దు... రిసెషన్‌లో పెట్టుబడులను ప్లాన్ చేసుకోండి

|

స్టాక్ మార్కెట్లు గతవారం భారీ నష్టాల్లో ముగిశాయి. కరోనా తర్వాత మార్కెట్లు తీవ్ర ఊగిసలాటలో కనిపిస్తున్నాయి. 2020 మార్చి చివరి వారంలో 25,000 స్థాయికి పడిపోయిన సెన్సెక్స్, ఆ తర్వాత 62,245 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టంతో పోలిస్తే దాదాపు 11,000 పాయింట్ల దిగువన 51,400 పాయింట్ల వద్ద ఉంది.

భారీ ఊగిసలాట నేపథ్యంలో మార్కెట్ ఇన్వెస్టర్లు కాస్త ఆందోళనగా ఉన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ద్రవ్యోల్భణ భయాలు నెలకొన్నాయి. ప్రపంచం మాంద్యం గుప్పిట్లోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అయితే మీరు కూడా రిసెషన్ సమయంలో పెట్టుబడులను చక్కగా ప్లాన్ చేసుకోవాలి.

ఒకే స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయవద్దు

ఒకే స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయవద్దు

పెట్టుబడులకు కొన్ని కీలక అంశాలను గుర్తుంచుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న డబ్బు మొత్తాన్ని ఒకే రంగం లేదా ఒకే స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయవద్దు. మీ పెట్టుబడి పోర్ట్‌పోలియో భిన్నంగా ఉండాలి. చాలామంది చేసే పొరపాటు ఏమంటే తమ వద్ద ఉన్న 100 శాతం పెట్టుబడిని ఒకే వాహకంలో ఇన్వెస్ట్ చేస్తారని, అది సరైనది కాదని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.

మీరు ఇన్వెస్ట్ చేసే సమయంలో డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన పెట్టుబడులు ఉంటాయి. అలాంటి పెట్టుబడులపై కూడా రూపాయి బలహీనత, బలాన్ని ఎప్పటికి అప్పుడు గమనించాలి.

కనిష్టాల వద్ద కొనుగోలు

కనిష్టాల వద్ద కొనుగోలు

మార్కెట్ డౌన్ సమయంలో ఓ స్టాక్ లేదా రంగం భవిష్యత్తు బాగుంటుందని ధీమా ఉంటే సాధ్యమైనంత మేర కొనుగోలు చేయాలి. కరోనా ప్రారంభం నాటి పరిస్థితి లేకపోయినప్పటికీ, ఇప్పుడు కూడా దాదాపు మార్కెట్ పతనాన్ని చూస్తోందని, కాబట్టి కనిష్టాల వద్ద కొనుగోలుకు మొగ్గు చూపవచ్చునని సూచిస్తున్నారు. అయితే ఆ స్టాక్, రంగంపై భవిష్యత్తును చదవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

కాలపరిమితి

కాలపరిమితి

మీరు పెట్టుబడి పెట్టడంతో పాటు ఆ పెట్టుబడులను ఎప్పుడు ఉపసంహరించుకోవాలనుకుంటున్నారో ముందే అనుకుంటే అందుకు అనుగుణంగా పెట్టుబడి అంశాన్ని ఎంచుకోవాలి. స్వల్పకాలం, మధ్యకాలం, దీర్ఘకాలం... ఇలా చూసుకోవాలి. కొన్ని స్టాక్స్ స్వల్పకాలంలో మంచి రిటర్న్స్ ఇవ్వవచ్చు. హెవీ వెయిట్స్ దీర్ఘకాలంలో అయితే మంచి ఫలితాలు ఇస్తాయి.

English summary

100% వద్దు... రిసెషన్‌లో పెట్టుబడులను ప్లాన్ చేసుకోండి | Investing moves you should make before a recession

Don't put 100% of your money in one investment vehicle. Diversifying your portfolio is one of the most commonly shared pieces of investing advice.
Story first published: Monday, June 20, 2022, 14:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X