For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెద్ద బ్యాంకులు సరే.. సేవింగ్స్ అకౌంట్‌పై ఈ బ్యాంకులు మంచి ఆఫర్

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ICIC, HDFC బ్యాంకుల్లో కరోనా కాలంలో వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. IDFC ఫస్ట్ బ్యాంకు, బంధన్ బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులైన ఈక్విటాస్, ఉత్కర్ష్ వంటివి సేవింగ్స్ అకౌంట్స్ పైన 7 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు గత కొద్ది నెలలుగా తగ్గుతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు లాభదాయకమైన వాటివైపు చూడవచ్చు. HDFC బ్యాంకు, ICICI బ్యాంకు తమ సేవింగ్స్ ఖాతాదారులకు 3 శాతం నుండి 3.5 శాతం ఆఫర్ చేస్తున్నాయి. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ 2.70 శాతం అందిస్తోంది. కింది బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ పైన ఇలా ఇస్తున్నాయి...

రైతు ఉద్యమం-MNP war: జియో సంచలన ఆరోపణ, ఎయిర్‌టెల్, VI ఏమన్నదంటే?రైతు ఉద్యమం-MNP war: జియో సంచలన ఆరోపణ, ఎయిర్‌టెల్, VI ఏమన్నదంటే?

IDFC ఫస్ట్ బ్యాంకు వడ్డీ రేటు

IDFC ఫస్ట్ బ్యాంకు వడ్డీ రేటు

IDFC ఫస్ట్ బ్యాంకులో రూ.1 లక్ష వరకు బ్యాలెన్స్ పైన(సేవింగ్స్ అకౌంట్) 6 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. రూ.1 లక్షకు పైనుండి రూ.10 కోట్ల వరకు ఉన్న మొత్తంపై 7 శాతం వడ్డీ ఇస్తోంది.

రూ.1 లక్షపై 6%

రూ.1 లక్ష నుండి రూ.10 కోట్ల వరకు 7%

రూ.10 కోట్ల నుండి రూ.50 కోట్ల వరకు 4.5%

రూ.50 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు 4%

రూ.100 కోట్లకు పైన 3.50% వడ్డీ రేట్లు అందిస్తోంది.

బంధన్ బ్యాంకు వడ్డీ రేటు

బంధన్ బ్యాంకు వడ్డీ రేటు

బంధన్ బ్యాంకు వడ్డీ రూ.1 లక్షకు 3 శాతం, రోజువారీ బ్యాలెన్స్ పైన రూ.1 లక్ష నుంచి రూ.10 కోట్ల వరకు, 6.55 శాతం రోజువారీ బ్యాలెన్స్ పై రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు 7.15 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది.

డైలీ బ్యాలెన్స్ రూ.1 లక్ష వరకు 3%

డైలీ బ్యాలెన్స్ రూ.1 లక్ష నుండి రూ.10 కోట్ల పైన 6%

డైలీ బ్యాలెన్స్ రూ.10 కోట్ల నుండి రూ.50 కోట్ల పైన 6.55%

డైలీ బ్యాలెన్స్ రూ.50 కోట్లకు పైన 7.15% వడ్డీ అందిస్తోంది.

ఈ బ్యాంకులు కూడా

ఈ బ్యాంకులు కూడా

ఈక్విటీస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రూ.1 లక్ష వరకు డైలీ బ్యాలెన్స్ పైన 3.5 శాతం వడ్డీని, రూ.1 లక్ష నుండి రూ.30 కోట్ల వరకు డైలీ బ్యాలెన్స్ పైన 7 శాతం వడ్డీని, రూ.30 కోట్ల నుండి రూ.50 కోట్ల వరకు వరకు డైలీ బ్యాలెన్స్ పైన 7.25 శాతం వడ్డీని అందిస్తోంది.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు డైలీ బ్యాలెనన్స్ రూ.1 లక్ష వరకు 5 శాతం వడ్డీని, రూ.1 లక్ష నుండి రూ.25 లక్షల డైలీ బ్యాలెన్స్ పైన 6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

English summary

పెద్ద బ్యాంకులు సరే.. సేవింగ్స్ అకౌంట్‌పై ఈ బ్యాంకులు మంచి ఆఫర్ | Interest rates on saving account: Four banks offers over 7 percent

IDFC First Bank, Bandhan Bank and small finance banks like Equitas and Utkarsh are offering 7 percent interest rates on savings accounts, when these banks are compared like State Bank of India (SBI), ICICI and HDFC Bank.
Story first published: Thursday, December 17, 2020, 14:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X