For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 రోజులే గడువు: ఉద్యోగులకు, వ్యాపారులకు 'ట్యాక్స్' డెడ్‌లైన్, లేదంటే పెనాల్టీ!

|

మీరు వేతనజీవులా? అలాగే ట్యాక్స్ పేయరా? అయితే ఇది మీకోసమే. ఆదాయపు పన్ను అంశానికి సంబంధించి జనవరి నెలలో పూర్తి చేయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. వీటిని పూర్తి చేయకుంటే జరిమానా ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే ట్యాక్స్‌కు సంబంధించిన డేట్‌లతో క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు అన్ని ట్యాక్స్ సంబంధిత డెడ్ లైన్స్ ఉన్నాయి. ఇందులో జనవరి నెలలో మూడు డెడ్ లైన్స్ ఉన్నాయి.

ఆదాయపు పన్ను శాఖ గుడ్‌న్యూస్: ఇది చూశాక మీరు ట్యాక్స్ కట్టడం మరిచిపోరు!ఆదాయపు పన్ను శాఖ గుడ్‌న్యూస్: ఇది చూశాక మీరు ట్యాక్స్ కట్టడం మరిచిపోరు!

జనవరి 15 తొలి డెడ్ లైన్

జనవరి 15 తొలి డెడ్ లైన్

ఆదాయపు పన్ను శాఖ క్యాలెండర్‌ను చూసుకొని, దానిని అమలు చేయడం ద్వారా పెనాల్టీని తప్పించుకోవచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఆలస్యంగా దాఖలు చేయడాన్ని, టీడీఎస్ రిటర్న్స్ ఫైలింగ్ ఆలస్యాన్ని తప్పించుకోవచ్చు. ఇక డెడ్ లైన్స్ విషయానికి వస్తే జనవరి 15వ తేదీన 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి TDS థర్డ్ క్వార్టర్లీ స్టేట్‌మెంట్‌ను ఫైల్ చేయవలసి ఉంటుంది. దీనికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది.

జనవరి 30, 31

జనవరి 30, 31

జనవరి 30వ తేదీన TDCS సర్టిఫికేట్ ఇష్యూకు గడువు తేదీ లాస్ట్. ఈ లోపు దీనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 31, 2019తో ముగిసిన క్వార్టర్‌లో ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్స్‌కు TDS రిటర్న్స్ ఫైలింగ్‌కు జనవరి 31వ తేదీ.

ఐటీ శాఖ క్యాలెండర్

ఐటీ శాఖ క్యాలెండర్

కాగా, ఆదాయపు పన్ను ఇటీవల క్యాలెండర్ విడుదల చేసింది. ఇందులో ఆయా నెలల్లో ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్‌కు సంబంధించి డెడ్ లైన్స్‌ను పేర్కొంది. ఇది ఐటీ డిపార్టుమెంట్ వెబ్ సైట్లోను అందుబాటులో ఉంది.

English summary

2 రోజులే గడువు: ఉద్యోగులకు, వ్యాపారులకు 'ట్యాక్స్' డెడ్‌లైన్, లేదంటే పెనాల్టీ! | Income Tax: Three deadlines you shouldn't miss this month

If you are a salaried employee and taxpayer, there are certain deadlines you need to keep in mind to ensure that you don't end up paying a hefty penalty. The Income-Tax department has already released a list of important dates which taxpayers should know for 2020.
Story first published: Monday, January 13, 2020, 13:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X