For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Personal Finance: ఈ నెలలో ఈ కీలక విషయాలు గుర్తుంచుకోండి

|

ప్రస్తుతం 2021 ఏడాది చివరలో ఉన్నాం. ఈ డిసెంబర్ నెల గడిస్తే కొత్త సంవత్సరం 2022కి స్వాగతం పలుకుతాం. ప్రతి నెల కొన్ని నిబంధనలు లేదా ధరలు మారి కొత్తవి అమలులోకి వస్తుంటాయి. ఇవి సామాన్యులపై ప్రభావం చూపుతాయి. ఇప్పటికే ఈ నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. మరో నాలుగైదు రోజుల్లో డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు, ఆహారం, దుస్తులు, ఫోన్లు, టీవీ, ఫుట్ వేర్ వంటి ఉత్పత్తులపై జీఎస్టీ పెరుగుతుండటంతో ధరలు పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ నెలలో ఐటీ రిటర్న్స్ గడువు ముగుస్తోంది. ఆధార్-పాన్ లింక్ చేయకుంటే ఈపీఎఫ్ మనీ నిలిచిపోతుంది. ఇలా ఈ నెలలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

టారిఫ్ పెంపు

టారిఫ్ పెంపు

- ఈటింగ్ ఔట్ నుండి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, దుస్తులు వంటి వివిధ ఉత్పత్తులు ఖరీదు అవుతున్నాయి. ఉదాహరణకు ఇంటర్నేషనల్ కాఫీ ధర పెరుగుతోంది. రూ.100కు పైగా పలికిన టొమాటో ధర ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. అయితే ఇతర పలు ఆహార ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి.

-వివిధ ఛానల్స్ తమ బకెట్ లేదా చానల్ ప్యాక్‌ను మార్చుతున్నాయి. వివిధ కంపెనీలు కొన్ని ఛానల్స్‌ను ప్యాక్ నుండి తప్పిస్తున్నాయి. దీంతో భారం పెరిగే అవకాశముంది.

-ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో టారిఫ్స్ పెరిగాయి. టెలికం కంపెనీలు 20 శాతం నుండి 25 శాతం మేర పెంచా

ఐటీ రిటర్న్స్ గడువు

ఐటీ రిటర్న్స్ గడువు

- ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు డిసెంబర్ 31వ తేదీతో ముగియనుంది. కొత్త ఆదాయపు పన్ను పోర్టల్ వచ్చాక ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో గడువును పొడిగించారు.

- ఈపీఎఫ్‌తో ఆధార్ కార్డును లింక్ చేయకుంటే పీఎఫ్ నిలిచిపోతుంది. యూఎఎన్-ఆధార్ లింకింగ్‌కు గడువు నవంబర్ 30వ తేదీతో ముగిసింది.

- ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌కు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభిస్తున్నారు.

- ప్రొటెక్షన్ టర్మ్ ఇన్సురెన్స్ ప్రీమియమ్ 25 శాతం నుండి 45 శాతం మేర పెరగనుంది. కరోనా తర్వాత ఏడు లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలు తమ ప్రీమియం మొత్తాన్ని పెంచాయి.

వడ్డీ రేట్లలో మార్పు

వడ్డీ రేట్లలో మార్పు

- సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్ పైన పంజాబ్ నేషనల్ బ్యాంకు వడ్డీ రేటును పది బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. రూ.10 లక్షల కంటే తక్కువ మొత్తంపై 10 బేసిస్ పాయింట్లు, రూ.10 లక్షల కంటే ఎక్కువ ఉంటే 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

- HDFC, బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచాయి. 36 నెలల కాలపరిమితిపై HDFC బ్యాంకు 6.1 శాతం, 60 నెలల కాలపరిమితిపై 6.5 శాతం ఇస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు అదనంగా 25 బేసిస్ పాయింట్లు అందిస్తోంది. బజాజ్ ఫైనాన్స్ 30 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.

- కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.100కు పైగా పెరిగింది.

English summary

Personal Finance: ఈ నెలలో ఈ కీలక విషయాలు గుర్తుంచుకోండి | Important personal finance changes you need to know this month

It's the end of the year and there are a few money changes this month that are likely to impact your wealth.
Story first published: Thursday, December 2, 2021, 22:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X