For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ICICI బంపరాఫర్, హోంలోన్‌పై వడ్డీరేటు భారీ తగ్గింపు: కానీ లిమిటెడ్ పీరియడ్

|

హోంలోన్ కొనుగోలుదారులకు ప్రయివేటురంగ దిగ్గజం ICICI బ్యాంకు శుభవార్త చెప్పింది. హోంలోన్ పైన వడ్డీ రేటును 6.70 శాతానికే అందిస్తున్నట్లు తెలిపింది. ఈ బ్యాంకు నుండి గత పదేళ్లలో ఇదే అత్యంత కనిష్ట వడ్డీ రేటు కావడం గమనార్హం. తగ్గించిన కొత్త వడ్డీ రేట్లు 5 మార్చి 2021 నుండి అమలులోకి వస్తాయి. రూ.75 లక్షల వరకు హోం లోన్‌కు ఇది వర్తిస్తుంది. రూ.75 లక్షలకు మించిన హోమ్ లోన్ వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. ఈ సవరించిన వడ్డీ రేట్లు మార్చి 31, 2021 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

GST పరిధిలోకి వస్తే పెట్రోల్ రూ.75, డీజిల్ రూ.68! కానీ నేతలు సిద్ధంగా లేరుGST పరిధిలోకి వస్తే పెట్రోల్ రూ.75, డీజిల్ రూ.68! కానీ నేతలు సిద్ధంగా లేరు

ఇంటికి కొనుగోలుకు ఆసక్తి

ఇంటికి కొనుగోలుకు ఆసక్తి

హోమ్ లోన్ కొనుగోలుకు కొద్దినెలలుగా క్రమంగా డిమాండ్ పెరుగుతోందని, ప్రస్తుతం సొంతగా ఇంటి కొనుగోలుకు మరింత ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని ఐసీఐసీఐ బ్యాంకు హెడ్ సెక్యూర్డ్ అసెట్స్ రావి నారాయణ్ అన్నారు. ప్రస్తుతం బ్యాంకు వడ్డీ రేట్లు కనిష్టానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో ఇంటి కొనుగోలుకు ఇది సరైన సమయంగా వారు పేర్కొన్నారు. కేవలం ఐసీఐసీఐ బ్యాంకు మాత్రమే కాదు, ఇతర బ్యాంకులు కూడా పరిమిత సమయానికి గాను వడ్డీ రేట్లను తగ్గించాయి.

హోంలోన్ కోసం దరఖాస్తు

హోంలోన్ కోసం దరఖాస్తు

ఇంటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి కలిగినz వారు హోం లోన్స దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు కాని వారు కూడా దరఖాస్తు చేయవచ్చు. డిజిటల్‌గా దరఖాస్తులు చేసుకోవచ్చు. బ్యాంకు వెబ్ సైట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ప్లాట్ ఫాం iMobile Pay ద్వారా దరఖాస్తు చేయవచ్చు. సమీప బ్యాంకును సంప్రదించవచ్చు. వెంటనే డిజిటల్‌గా లోన్ శాంక్షన్‌కు సంబంధించిన వివరాలు వస్తాయి. మోర్టగేజ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో గత ఏడాది నవంబర్ నెలలో రూ.2 లక్షల కోట్లు దాటిన మొదటి ప్రయివేటు బ్యాంకు ఐసీఐసీఐ.

ఇతర బ్యాంకులు

ఇతర బ్యాంకులు

ఇతర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించాయి. HDFC తమ కస్టమర్లకు, ఇళ్లు కొనుగోలు చేసేవారికి ఇటీవలే గుడ్ న్యూస్ చెప్పింది. తమ బ్యాంకు ఖాతాదారులకు హోం లోన్ పైన వడ్డీ రేట్లను 0.05 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఖాతాదారుల క్రెడిట్ హిస్టరీ, తీసుకునే రుణ మొత్తంతో సంబంధం లేకుండా కొత్త రుణాలకు 6.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), కోటక్ మహీంద్రా బ్యాంకులు కూడా వడ్డీ రుణ రేట్లను తగ్గించాయి. వరుసగా 6.7%, 6.65 శాతానికి రుణాలు అందిస్తున్నాయి. హోం లోన్ పైన రిటైల్ ప్రైమ్ రుణ రేటు (RPLR)ను కూడా 0.05 శాతం మేర తగ్గిస్తున్నట్లు, దీంతో ఇప్పటికే రుణాలు తీసుకున్న కస్టమర్లకు కూడా వడ్డీ రేటు ఈ మేరకు తగ్గుతుందని HDFC తెలిపింది. HDFC తగ్గించిన 5 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు మార్చి 4వ తేదీ నుండి అమలవుతున్నాయి.

English summary

ICICI బంపరాఫర్, హోంలోన్‌పై వడ్డీరేటు భారీ తగ్గింపు: కానీ లిమిటెడ్ పీరియడ్ | ICICI Bank reduces home loan interest rate to 6.70 percent till March 31

ICICI Bank announced on Friday that it has reduced home loan interest rate to 6.70%.The revised interest rate is effected from March 5, 2021, stated the bank in a press release. Customers can avail of this interest rate for home loans up to Rs 75 lakh. For loans above Rs 75 lakh, interest rates are pegged at 6.75% onwards, stated the release. These revised rates will be available till March 31, 2021.
Story first published: Friday, March 5, 2021, 16:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X