For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్బీఐ ఎఫెక్ట్: ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్ల పెంపు: అప్పుడే అమల్లోకి

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో 4 శాతం నుండి 4.40 శాతానికి పెరిగింది. ఆర్బీఐ ఎంపీసీ సమావేశం నిన్న అత్యవసరంగా సమావేశమై వడ్డీ రేట్లు పెంచూతూ నిర్ణయం తీసుకున్నది. సీఆర్ఆర్ (క్యాష్ రిజర్వ్ రేషియో)ను కూడా 50 బేసిస్ పాయింట్లు పెంచింది. వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో హోమ్ లోన్, వెహికిల్ లోన్, ఇతర రుణాలు తీసుకునే వారికి ఈఎంఐ భారంగా మారుతుంది. ఆర్బీఐ ప్రకటన అనంతరం రెపో రేటు లింక్డ్ హోమ్ లోన్ వడ్డీ రేట్ల పెంపును ప్రకటించాయి పలు బ్యాంకులు.

ఐసీఐసీఐ పెంపు

ఐసీఐసీఐ పెంపు

ప్రయివేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా తమ హోమ్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఐసీఐసీఐ వెబ్ సైట్ ప్రకారం... ఈ బ్యాంకు ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు 8.10 శాతానికి పెంచింది. ఈ పెంచిన వడ్డీ రేటు మే, 2022 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా పెంపు

బ్యాంక్ ఆఫ్ బరోడా పెంపు

బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా రెపో లింక్డ్ లెండింగ్ రేటు బీఆర్ఎల్ఎల్ఆర్‌ను రిటైల్ లోన్స్ పైన 6.90 శాతానికి పెంచినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 4.40 శాతంగా ఉంది. 2.50 శాతం మేక్-అప్ కలిపి 6.90 శాతంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. ఈ పెంచిన వడ్డీ రేట్లు మే 5, 2022 నుండి అమలులోకి వస్తాయని తెలిపింది.

బాహ్య బెంచ్ మార్క్

బాహ్య బెంచ్ మార్క్

అక్టోబర్ 1, 2019 నుండి అన్ని కొత్త ఫ్లోటింగ్ రేట్లు వ్యక్తిగత లేదా రిటైల్ లోన్స్ (హౌసింగ్, ఆటో మొదలైనవి) బ్యాహ్య బెంచ్ మార్క్‌తో లింక్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది.

బాహ్య బెంచ్ మార్క్ అంటే 1. ఆర్బీఐ పాలసీ రెపో రేటు, 2. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 నెలల ట్రెజరీ బిల్ యీల్డ్స్, 3. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6 నెలల ట్రెజరీ బిల్స్, 4. ఫైనాన్షియల్ బెంచ్ మార్క్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ ప్రచురించిన ఇతర బెంచ్ మార్కెట్ వడ్డీ రేటు.

ఆర్బీఐ వడ్డీ రేటు పెంచిన నేపథ్యంలో వరుసగా అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచవచ్చు. ఇది రుణ గ్రహీతలకు అధిక ఈఎంఐకి కారణమవుతుంది.

English summary

ఆర్బీఐ ఎఫెక్ట్: ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్ల పెంపు: అప్పుడే అమల్లోకి | ICICI, Bank of Baroda hike interest rates of repo rate linked home loans

The RBI governor on Wednesday announced a surprise 40 bps hike in key policy rates. The CRR has also been increased by 50 basis points, putting further upward pressure on interest rates.
Story first published: Thursday, May 5, 2022, 16:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X