For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Personal Finance: ఫిక్స్డ్ డిపాజిట్స్ రిటర్న్స్ పెంపొందించుకోండి ఇలా..

|

అత్యధిక రిటర్న్స్ వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్‌లను(FD)ని ఎంచుకొని ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. ఆర్థిక వ్యవస్థ క్రమంగా డిజిటలైజ్ అవుతోంది. కరోనా మహమ్మారి కారణంగా బ్యాంకులు తమ కస్టమర్లకు ఇచ్చే రుణ వడ్డీ రేటు తగ్గినట్లే, డిపాజిటర్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసే మొత్తంపై కూడా వడ్డీ రేటు భారీగా తగ్గింది. అయితే ఆర్థిక రికవరీ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు, రివర్స్ రెపో రేటును సవరించే అవకాశముంది. అంటే 2022లో పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో వచ్చే సంవత్సరం FD వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి రాబడుల కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చే సంవత్సరం మంచి ఎంపికగా చెప్పవచ్చు.

మీరు మంచి రిటర్న్స్ కోసం వేచి చూస్తుంటే, కనీసం 6.5 శాతం వడ్డీ రేటును ఆశించవచ్చు. అది కూడా కొన్ని బ్యాంకుల్లో మాత్రమే. దాదాపు రెండేళ్లుగా ఆర్థిక రంగంపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అయితే ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తోంది. మీరు బ్యాంకు FDలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తే కనుక మార్కెట్ మొత్తం మెరుగైన రాబడులు, ఆఫర్లతో కనిపిస్తుంది. అయితే మీరు సంప్రదాయ బ్యాంకు FD కంటే రాబడిని మరింత పెంచే FD వైపు చూడవచ్చు. ఇందుకు పలు మార్గాలు ఉన్నాయి.

కార్పోరేట్ FD

కార్పోరేట్ FD

కార్పోరేట్ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా బ్యాంకు FD వంటిది. ఇవి కూడా గ్యారెంటీ రిటర్న్స్ అందిస్తుంది. టర్మ్‌ను కూడా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. కార్పోరేట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ప్రస్తుతం సాధారణంగా 1 శాతం నుండి 3 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఉదాహరణకు బజాజ్ ఫిన్ సర్వ్ కార్పోరేట్ FD మంచి రిటర్న్స్ ఇస్తోంది. బ్యాంకు FD కంటే అధిక రిటర్న్స్ అందిస్తోంది. ఈ FDలు అస్యూర్డ్ రిటర్న్స్ అందిస్తాయి. సులభమైన ఆన్ లైన్ అప్లికేషన్స్, యాక్సెసబులిటీ, హయ్యర్ రిటర్న్స్ ఇస్తుంది. ఈ FD స్కీమ్స్ రిటర్న్స్ ఆప్షన్స్‌ను బట్టి నెలవారీ, త్రైమాసికం వారీగా ఉన్నాయి.

వడ్డీ రేట్ల పరిశీలన

వడ్డీ రేట్ల పరిశీలన

నిర్దిష్ట FDకి వెళ్లేముందు ఆయా కంపెనీలు అందిస్తున్న FD వడ్డీ రేట్లను పరిశీలించాలి. ప్రతి రుణదాత తమ తమ కస్టమర్ FDపైన భిన్నమైన వడ్డీ రేటును అందిస్తారు. మీ పెట్టుబడిపై మీకు అత్యుత్తమ రాబడిని అందించే దానిని ఎంచుకోవడం మంచిది. FD వడ్డీ రేట్లను పోల్చుకోవడం ద్వారా ఏ FD ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందో తెలుసుకోవచ్చు. ఇది మీ రాబడిని మెరుగుపరుస్తుంది.

అధిక రిటర్న్స్ కోసం...

అధిక రిటర్న్స్ కోసం...

మీరు కార్పోరేట్ లేదా బ్యాంకు FD.. ఎందులో ఇన్వెస్ట్ చేసినప్పటికీ మీరు సాధ్యమైనంత ఎక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేలా చూసుకోవాలి. మీకు క్యుమ్యులేటివ్ లేదా నాన్-కుమ్యులేటివ్.. ఇలా రెండు అందుబాటులో ఉంటాయి. క్యుమ్యులేటివ్‌ను ఎంచుకోవడం కాస్త బెట్టర్. దీంతో మంచి రిటర్న్స్ ఉంటాయి. క్యుమ్యులేటివ్ FD మెచ్యూరిటీ తర్వాత మీకు వడ్డీ రేటు, ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది. మీ క్యుమ్యులేటివ్ FDకి నెలవారీగా లేదా త్రైమాసికం వారీగా వడ్డీ రేటు కలుస్తుంది. అంటే మీకు వడ్డీ మీద వడ్డీ వస్తుంది.

ట్యాక్స్ బెనిఫిట్స్

ట్యాక్స్ బెనిఫిట్స్

కొన్ని FD పెట్టుబడుల ద్వారా పన్ను ప్రయోజనాలు ఉంటాయి. వాటిని ఎంచుకోవడం మంచిది. రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి ఆదాయపు పన్ను చట్టం, 1961, సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం ఉంటుంది. రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం కలిగిన సెక్షన్ ఇది. ఇందులో పీఎఫ్, FD తదితరాలు ఉంటాయి.

రెండో పన్ను ప్రయోజనం వడ్డీ లేదా రిటర్న్స్ ప్రయోజనం. ఇది నేరుగా రిటర్న్స్ పైన పన్నును అవాయిడ్ చేస్తుంది.

వివిధ FDలలో

వివిధ FDలలో

ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో ఇన్వెస్ట్ చేసే సమయంలో వివిధ FDలలో పెట్టుబడి పెట్టడం మంచిది. వివిధ కాలపరిమితుల FDల పైన కూడా ఇన్వెస్ట్ చేయాలి. మీ మొత్తాన్ని ఒకే FDలో ఇన్వెస్ట్ చేయడానికి బదులు, రెండు లేదా మూడింట ఇన్వెస్ట్ చేయాలి.

English summary

Personal Finance: ఫిక్స్డ్ డిపాజిట్స్ రిటర్న్స్ పెంపొందించుకోండి ఇలా.. | How To Improve Returns On Fixed Deposits

As pandemic grows it become important to look for investment in FDs with better returns. 2022 is a good year to invest in Fixed Deposits as the economy is transforming into digital. If you are looking for a good return on Fixed Deposits, the maximum you can expect is 6.5% and that's too only by few banks. The pandemic affected the financial sector in last 2 years. However, now it is rising to its normal.
Story first published: Friday, December 3, 2021, 13:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X