For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్ లోన్ అర్హత పెంపు, రకాలు... పూర్తిగా తెలుసుకోండి: ఇది గుర్తుంచుకోండి

|

ఉద్యోగి నుండి వ్యాపారి వరకు ఎవరికైనా ఇంటి కొనుగోలు/నిర్మాణం ఓ కల. గ్రామం నుండి మెట్రో నగరాల వరకు ఇంటి కొనుగోళ్లపై బ్యాంకులు హోమ్ లోన్స్ ఇస్తాయి. హోమ్ లోన్ వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. సాధారణంగా పర్సనల్ లోన్ అసురక్షిత రుణం కాబట్టి ఈ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే హోమ్ లోన్ సెక్యూర్డ్ లోన్ కాబట్టి వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఇది దీర్ఘకాలిక రుణ సదుపాయం. ఈ నేపథ్యంలో హోమ్ లోన్ గురించి పలు అంశాలు తెలుసుకుందాం...

హోమ్ లోన్ సుదీర్ఘ ప్రక్రియ

హోమ్ లోన్ సుదీర్ఘ ప్రక్రియ

హోమ్ లోన్ తీసుకోవడం అంటే చాలా పెద్ద అడుగు వేయడమే. గోల్డ్ లోన్ లేదా పర్సనల్ లోన్ లేదా వెహికిల్ లోన్ తీసుకుంటే ఏడాది నుండి గరిష్టంగా అయిదు నుండి ఏడెళ్ల కాలపరిమితి ఉంటుంది. కానీ హోమ్ లోన్ సుదీర్ఘ రుణ ప్రక్రియ. గరిష్టంగా ముప్పై ఏళ్లు కూడా ఉంటుంది. ఎక్కువగా ఇరవై ఏళ్లకు తీసుకుంటారు.

హోమ్ లోన్ తీసుకునేటప్పుడు హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ రేటు, హౌసింగ్ లోన్ అర్హతలు, లోన్ అర్హత కాలిక్యులేటర్, హోమ్ లోన్ అర్హతను మరింత పెంచుకోవడం వంటి అంశాలు తెలుసుకోవాలి.

హోమ్ లోన్ రకాలు

హోమ్ లోన్ రకాలు

దేశంలో వివిధ రకాల హోమ్ లోన్స్ ఉన్నాయి. ఇంటి కొనుగోలు చేయడానికి హోమ్ లోన్ ఉంటుంది. అలాగే కన్‌స్ట్రక్షన్ హోమ్ లోన్, లోన్ పర్చేజ్ లోన్, హోమ్ ఇంప్రూమెంట్ లోన్, హోమ్ రెపేర్ లోన్, హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్ ఉన్నాయి.

మీరు ఇంటిని నిర్మించుకోవడానికి అలాగే హోమ్ లోన్ తీసుకోవడానికి మొదట చేయాల్సింది బడ్జెట్ వేసుకోవడం. ఆ తర్వాత ఇంటి కొనుగోలుకు, ఇల్లు రిపేర్ కోసం, ఇంటి విస్తరణకు, ఇంప్రుమెంట్ కోసం.. ఇలా వివిధ రకాల లోన్లు తీసుకోవాలి.

వీటిని గుర్తుంచుకోండి

వీటిని గుర్తుంచుకోండి

- హోమ్ లోన్ 70 శాతం నుండి 95 శాతం వరకు రావొచ్చు. కాబట్టి మిగతా మొత్తాన్ని మన వద్ద అట్టిపెట్టుకోవాలి. ఆ తర్వాతే ముందడుగు వేయాలి.

ఆ తర్వాత కీలకమైన అంశాలు హోమ్ లోన్ కాలపరిమితి, వడ్డీ రేటు, ఈఎంఐ, ప్రాసెసింగ్ ఫీజు, డౌన్ పేమెంట్.

మీకు సరిపోయే కాలపరిమితిని ఎంచుకోవాలి. మీ ఆదాయం ఆధారంగా మీ ఈఎంఐ, అందుకు అనుగుణంగా కాలపరిమితిని ఎంచుకోవాలి. అలాగే ఏ బ్యాంకులో వడ్డీ రేటు తక్కువగా ఉందో చూసుకోవాలి. అలాగే, డౌన్ పేమెంట్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఈఎంఐ లేదా వడ్డీ భారం తగ్గుతుంది.

లోన్ ప్రాసెస్ ఇలా...

లోన్ ప్రాసెస్ ఇలా...

లోన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది.. మొదట దరఖాస్తును నింపాలి. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు, బ్యాంకుతో వడ్డీ రేటు, ఇతర అంశాల గురించి చర్చలు, డాక్యుమెంటేషన్(కేవైసీ, ఆదాయం, బ్యాంకు స్టేట్‌మెంట్), శాంక్షన్/అప్రూవల్ ప్రాసెస్, ప్రాసెసింగ్ ఆఫర్ లెటర్, ప్రాపర్టీ పేపర్స్, లోన్ డీల్ ఫైనలైజేషన్, అగ్రిమెంట్ సైనింగ్, లోన్ డిస్పర్సల్.. ఇలా వివిధ స్టెప్స్ ఉంటాయి.

అర్హత

అర్హత

హోమ్ లోన్, వడ్డీ రేటు వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ నెల ఆదాయం, ప్రస్తుత వయస్సు, క్రెడిట్ స్కోర్, ఫిక్స్డ్ మంత్లీ ఫైనాన్షియల్ ఆప్లిగేషన్స్, క్రెడిట్ హిస్టరీ, ప్రాపర్టీ కాస్ట్, రిటైర్మెంట్ వంటివి ప్రభావం చూపుతాయి.

హోమ్ లోన్ అర్హత పెంపు ఇలా...

హోమ్ లోన్ అర్హత పెంపు ఇలా...

హోమ్ లోన్ అర్హతను ఇలా పెంచుకోవచ్చు. బ్యాంకుల్లో (ఉదాహరణకు పంజాబ్ నేషనల్ బ్యాంకు) సంపాదించే కో-అప్లికెంట్‌ను జత చేయడం ద్వారా అర్హతను పెంచుకోవచ్చు.

రీస్ట్రక్చర్డ్ రీపేమెంట్ ప్లాన్

క్రమమైన ఆదాయం.

రెగ్యులర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కౌంట్.

స్థిర ఆదాయ వనరుల వివరాలు

మీ క్రెడిట్ స్కోర్‌లో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేయాలి.

కొనసాగుతున్న రుణాలు, స్వల్పకాలిక అప్పులను తిరిగి చెల్లించడం.

మీకు ఉన్న రుణభారం తగ్గించుకోవడం ద్వారా రుణ అర్హతను పెంచుకోవచ్చు.

మీరు చేసే డౌన్ పేమెంట్ పైన కూడా హోమ్ లోన్ అర్హత ఆధారపడి ఉంటుంది.

English summary

హోమ్ లోన్ అర్హత పెంపు, రకాలు... పూర్తిగా తెలుసుకోండి: ఇది గుర్తుంచుకోండి | How to improve Home Loan eligibility, What is the Home Loan process?

We all dream of buying the best home possible. But, with property prices sky high and soaring, turning the dream into a reality could be a step too far. Here, the good old home loan comes to the rescue.
Story first published: Monday, January 3, 2022, 15:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X