For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Home Loan repayment tips: 20 ఏళ్లలో చెల్లించే హోమ్ లోన్ త్వరగా చెల్లించండి ఇలా..

|

హోమ్ లోన్ కాలపరిమితి ఇరవై ఏళ్ల నుండి ముప్పై ఏళ్ల వరకు ఉంటుంది. అయితే కొంతమంది రుణగ్రహీతలు చేతికి డబ్బులు అందాక రుణాన్ని త్వరగా తీర్చాలని భావిస్తారు. రుణం వేగంగా తీర్చాలని భావించేవారు చాలామంది ఉంటారు. హోమ్ లోన్ త్వరగా తీర్చడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది డౌన్ పేమెంట్ ఎక్కువగా చేయడం. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి.

ఇలా చేయండి...

ఇలా చేయండి...

హోమ్ లోన్‌ను త్వరగా తీర్చడానికి పలు మార్గాలు ఉన్నాయి. చేతిలో ఎక్కువ మొత్తం అందుబాటులో ఉన్నప్పుడు హోమ్ లోన్ తీసుకోవాలి. తద్వారా డౌన్ పేమెంట్ ఎక్కువగా చెల్లించేలా చూసుకోవాలి.

మీ చేతికి డబ్బులు అందితే ప్రీ-పేమెంట్‌ను చెల్లించేందుకు ఉపయోగించుకోవాలి.

హోమ్ లోన్ ఎక్కువ కాలం ఉండకూడదనుకుంటే తక్కువ కాలపరిమితిని ఎంచుకోవాలి. అలాగే, మీ హోమ్ లోన్ ఈఎంఐ ఎక్కువగా చెల్లించేలా చూసుకోవాలి.

హోమ్ లోన్ పైన తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకుకు ట్రాన్సుఫర్ చేసుకోవాలి.

ప్రారంభంలో వడ్డీయే ఎక్కువ

ప్రారంభంలో వడ్డీయే ఎక్కువ

మీరు తీసుకునే రుణంపై ప్రారంభ ఈఎంఐలలో వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. అసలు తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా హోమ్ లోన్ ఈఎంఐ చివరి నాటికి వడ్డీ తగ్గుతుంది. అసలు పెరుగుతుంది. కాబట్టి డౌన్ పేమెంట్ ఎక్కువగా ఉంటే వడ్డీ రేటు తగ్గి, హోమ్ లోన్ భారం కూడా కాస్త తగ్గుతుంది. వడ్డీ పైన రూ.2 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80సీలో హోమ్ లోన్ అసలుకు పరిమితి మేరకు మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ పరిమితి గరిష్టంగా రూ.1,50,000 వరకు ఉంటుంది.

పెట్టుబడి పెట్టి..

పెట్టుబడి పెట్టి..

హోమ్ లోన్ త్వరగా చెల్లించాలనుకుంటే ప్రతి నెల కొంత మొత్తాన్ని సిప్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. మంచి రిటర్న్స్ ఇస్తాయని భావించే స్టాక్స్‌ను ఎంచుకొని కూడా పెట్టుబడి పెట్టవచ్చు. కొంతకాలం తర్వాత మంచి రాబడి వస్తుంది. మీ టార్గెట్‌కు అనుగుణంగా వచ్చాక ఆ జమ అయిన మొత్తాన్ని తీసి హోమ్ లోన్ ప్రీ-పేమెంట్ చేయవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో, రిస్క్‌తో కూడుకున్నది. కాబట్టి అప్రమత్తంగా ఉండటం అవసరం

English summary

Home Loan repayment tips: 20 ఏళ్లలో చెల్లించే హోమ్ లోన్ త్వరగా చెల్లించండి ఇలా.. | Home Loan repayment tips: Pay 20 Year loan faster

Easy Ways To Pay Home Loan Faster. Make a large down payment. Make part prepayments as and when you can. Select a short tenor to repay the loan quickly.
Story first published: Monday, July 19, 2021, 16:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X