For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివిధ బ్యాంకులు అందించే హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే

|

భారతదేశంలో అన్ని ప్రముఖ బ్యాంకులు పండుగ ఆఫర్ కింద హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. క్రెడిట్ స్కోర్ 800 కంటే ఎక్కువ ఉంటే రూ.75 లక్షలకు పైన ఉన్న హోమ్ లోన్ పైన రుణ గ్రహీతలకు 40 బేసిస్ పాయింట్ల నుండి 60 బేసిస్ పాయింట్ల మధ్య వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC, పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB), కొటక్ మహీంద్రా బ్యాంకు ఇలా.. పలు బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి.

HDFC లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రేణూ సూద్ కర్నాడ్ ప్రకారం ప్రస్తుతం అతి తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయని, దీనికి తోడు PMAY కింద సబ్సిడీ వస్తోందని, పన్ను ప్రయోజనాలు ఉన్నాయని, వీటిని పరిగణలోకి తీసుకుంటే తక్కువ ధరకే ఇంటిని కొనుగోలు చేయవచ్చునని తెలిపింది.

వివిధ బ్యాంకుల హోమ్ లోన్ వడ్డీ రేట్లు

వివిధ బ్యాంకుల హోమ్ లోన్ వడ్డీ రేట్లు

- HDFC - హోమ్ లోన్ వడ్డీ రేటు 6.70%,

- SBI - హోమ్ లోన్ వడ్డీ రేటు 6.70%,

- PNB - హోమ్ లోన్ వడ్డీ రేటు 6.80%,

- బ్యాంక్ ఆఫ్ బరోడా - హోమ్ లోన్ వడ్డీ రేటు 6.75%,

- కొటక్ మహీంద్రా బ్యాంకు - హోమ్ లోన్ వడ్డీ రేటు 6.50%

జేఎల్ఎల్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ అండ్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఆర్ఈఎస్ఐ శమంతక్ దాస్ ప్రకారం బ్యాంకులు క్రెడిట్ స్కోర్ లింక్‌తో కూడిన హోమ్ లోన్ వడ్డీ రేటు ఆఫర్‌ను ప్రకటిస్తున్నాయని, హోమ్ లోన్ మొత్తం లేదా ఉపాధి కేటగిరీతో సంబంధం లేకుండా క్రెడిట్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం కొనుగోలు చేయాలనుకునే అందరికీ తక్కువ ధరకు అందుతోంది. భారత రియల్ ఎస్టేట్ విభాగం ప్రస్తుతం సరసమైన, లగ్జరీ హౌస్ విభాగాలలో కొత్త గృహాల అమ్మకాలు లేక ఇబ్బందులు పడుతోంది. కరోనా కారణంగా గత ఏడాదిగా ఉద్యోగాల కోత, వేతనాల కోత ప్రభావం చూపింది. కొత్తగా నిర్మించిన చాలా ఇళ్లు అమ్మకాలు లేక పడిఉన్నాయి. 2019లో రియాల్టీ రంగం కొత్త ఊపును ఇచ్చింది. ఎన్నారైలు కూడా లగ్జరీ విభాగంలో సహకరించారు. కానీ మహమ్మారి కారణంగా 2020 నుండి పడిపోయాయి.

రియాల్టీ మార్కెట్ జూమ్

రియాల్టీ మార్కెట్ జూమ్

ఇప్పుడిప్పుడే ఆర్థిక కార్యకలాపాలు కోలుకోవడంతో తిరిగి రియాల్టీ మార్కెట్ పుంజుకుంటోంది. పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. బ్యాంకుల రుణ పుస్తకాలు ఇప్పటికే ఏడాది ప్రాతిపదికన జూలై నెలలో 8.9 శాతం పెరిగి 14.66 ట్రిలియన్లకు చేరుకున్నాయి. ఇప్పుడు ఈ వడ్డీ రేటు తగ్గింపు మరింత మంది భారతీయులు హోమ్ లోన్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించినందున రియాల్టీ రంగం క్రమంగా వేగం పుంజుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.

కన్స్యూమర్ సెంటిమెంట్

కన్స్యూమర్ సెంటిమెంట్

ఇటీవలి CII-ANAROCK కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వే ప్రకారం కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ 48 శాతం కాగా, సెకండ్ వేవ్ సమయానికి 54 శాతానికి పెరిగింది. మొదటిసారి అఫోర్డబుల్ హౌసింగ్ వడ్డీ తక్కువగా ఉండి, తక్కువ ధరకు వస్తున్నాయి. తక్కువ ధరకే హోమ్ లోన్స్ వస్తుండటంతో 34 శాతం మంది రెస్పాండెంట్స్ రూ.90 లక్షల నుండి రూ.2.5 కోట్ల మధ్య హోమ్ లోన్ పైన దృష్టి సారించారు. 35 శాతం మంది రూ.45 లక్షల నుండి రూ.90 లక్షలు, 27 శాతం మంది రూ.45 లక్షల దిగువ హోమ్ లోన్స్‌కు ఓటు వేశారు.

English summary

వివిధ బ్యాంకులు అందించే హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే | Home Loan Interest Rates Down By Banks

All the leading banks in India have been lowering their home loan interest rates under their festive offers, they are cutting the interest rates by around 40-60 bps for borrowers with credit scores more than 800, for a loan of above Rs. 75 lakh.
Story first published: Thursday, September 23, 2021, 12:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X