For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్ లోన్ తీసుకుంటున్నారా, HDFC షాక్: ఈఎంఐ ఇక భారం!

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇటీవల రెపో రేటు 40 బేసిస్ పెంచిన నేపథ్యంలో వరుసగా అన్ని బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. హోమ్ లోన్, వెహికిల్ లోన్ తదితర వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో పెరుగుతాయి. రుణగ్రహీతలకు వడ్డీ రేటు పెరగడంతో పాటు డిపాజిటర్లకు మాత్రం శుభవార్త. ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ వంటి డిపాజిట్లు చేసే వారికి కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇప్పటికే వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి. తాజాగా HDFC కూడా హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచింది. ఈ పెంచిన వడ్డీ రేట్లు మే 9వ తేదీ నుండి అమలులోకి వస్తాయి.

వడ్డీ రేట్ల పెంపు

వడ్డీ రేట్ల పెంపు

HDFC ప్రామాణిక రుణ రేటును 30 బేసిస్ పాయింట్లు లేదా 0.30 శాతం పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది. దీంతో ఇప్పటికే ఉన్న రుణగ్రహీతలకు ఈఎంఐలు భారం కానున్నాయి. హోమ్ లోన్ పైన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును (RPLR) ఈ నెల 9వ తేదీ నుండి 30 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు HDFC తెలిపింది. కొత్త రుణగ్రహీతలకు అందించే రుణ రేట్లను మాత్రం యథాతథంగా 9.7 శాతం నుండి 7.15 శాతం మధ్య ఉంది. ఇప్పటికే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఎంసీఎల్ఆర్‌‍ను పెంచింది.

క్రెడిట్ స్కోర్ బాగుంటే

క్రెడిట్ స్కోర్ బాగుంటే

క్రెడిట్ స్కోర్ బాగుంటే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. 750 పాయింట్లకు పైగా క్రెడిట్ స్కోర్ ఉంటే రూ.30 లక్షలకు పైగా రుణం తీసుకుంటే 7.10 శాతం వడ్డీ రేటు, రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల వరకు 7.35 శాతం, రూ.75 లక్షలు ఆ పైన 7.45 శాతం వడ్డీ రేటు ఉంటుంది. మహిళలకు 0.05 శాతం వడ్డీ రేటు తగ్గుతుంది. అంటే మహిళలకు రూ.30 లక్షల రుణం తీసుకుంటే 7.05 శాతం, రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల మధ్య 7.30 శాతం, రూ.75 లక్షలకు పైన 7.40 శాతం వర్తిస్తుంది.

వడ్డీ రేట్లు

వడ్డీ రేట్లు

HDFC తాజా నిర్ణయంతో కొత్త రుణాలతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న రుణాలపై కూడా వడ్డీరేట్లు పెరుగుతున్నాయి. ఆర్బీఐ రెపోరేటు పెంచడానాకి ముందు పలు బ్యాంకులు ఎంసీఎల్ఆర్ బేసిక్ పాయింట్లను పెంచడం ద్వారా పరోక్ష పద్దతిలో ఇప్పటికే వడ్డీరేట్లు పెంచాయి. HDFC నిర్ణయంతో మిగిలిన బ్యాంకులు కూడా వడ్డీరేట్లు పెంచే అవకాశముంది. దీని ప్రభావం రియాల్టీ రంగంపై ఉంటుంది.

English summary

హోమ్ లోన్ తీసుకుంటున్నారా, HDFC షాక్: ఈఎంఐ ఇక భారం! | HDFC hikes home loan rates for all customers

Three days after the RBI announced a 40 basis point hike in its repo rate, HDFC Saturday announced raising its RPLR by 30 basis points, leading to an identical hike in home loan rates for exiting customers. The hike comes into effect from May 9.
Story first published: Saturday, May 7, 2022, 18:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X