For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్ లోన్ వడ్డీ రేటు పెంచిన HDFC, పెరిగిన వడ్డీ రేట్లు ఇవే

|

ఆర్బీఐ రెపో రేటును పెంచిన నేపథ్యంలో వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేస్తూ ఇటీవల రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు, నగదు నిల్వల నిష్పత్తిని (CRR)ని 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో బ్యాంకులు కూడా రుణ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా HDFC బ్యాంకు నిధుల వ్యయం ఆధారిత రుణ రేటు(MCLR)ను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఈ నెల 7వ తేదీ నుండి ఇది అమలులోకి వచ్చినట్లు తెలిపింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.5 శాతానికి, ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 7.15 శాతానికి పెరిగింది.

సవరించిన రుణ రేటు

సవరించిన రుణ రేటు

HDFC బ్యాంకు ఎంసీఎల్ఆర్ రేటును పెంచడంతో హౌసింగ్, వెహికిల్, పర్సనల్ లోన్, ఇతర రుణాలకు సంబంధించి కూడా ఈఎంఐ పెరుగుతుంది. సవరించిన ఎంసీఎల్ఆర్ రుణ రేటు ప్రకారం ఓవర్ నైట్ వడ్డీ రేటు 7.15 శాతం, 1 నెల 7.20 శాతం, 3 నెలలు 7.25 శాతం, ఆరు నెలలు 7.35 శాతం, ఏడాది కాలపరిమితిపై 7.50 శాతం, రెండేళ్ల కాలపరిమితిపై 7.60 శాతం, మూడేళ్ల కాలపరిమితిపై 7.70 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

హోమ్ లోన్ వడ్డీ రేటు

హోమ్ లోన్ వడ్డీ రేటు

ఇక, HDFC బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటు కూడా పెరిగింది. రూ.30 లక్షల వరకు రుణం తీసుకునే కొత్త కస్టమర్లకు వడ్డీ రేటు 7.10 శాతంఉంటుందని HDFC ప్రకటించింది. HDFC హౌసింగ్ లోన్స్ పైన తన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు(RPLR)ను 30 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది మే 7వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. అంటే HDFC హోమ్ లోన్ తీసుకునే వారికి ఇక నుండి ఈఎంఐ పెరుగుతుంది.

ఈ బ్యాంకులు కూడా

ఈ బ్యాంకులు కూడా

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కరూర్ వైశ్య బ్యాంకు కూడా రుణ రేట్లను పెంచాయి. ఎంసీఎల్ఆర్ 0.15 శాతం పెంచినట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పేర్కొనగా, కరూర్ వైశ్య బ్యాంకు బాహ్య బెంచ్ ప్రామాణిక రుణ రేటును 7.15 శాతం నుండి 7.45 శాతానికి సవరించింది. ఈ నెల 7వ తేదీ నుండి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చినట్లు తెలిపాయి.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 7.25 శాతం నుండి 7.4 శాతానికి చేరుకుంది. ఓవర్ నైట్, నెల, మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు 6.85 శాతం నుండి 7.30 శాతం మధ్య ఉన్నాయి. రెపో రేటు ఆధారిత రుణ రేటు 6.8 శాతం నుండి 7.2 శాతానికి చేరుకుంది.

English summary

హోమ్ లోన్ వడ్డీ రేటు పెంచిన HDFC, పెరిగిన వడ్డీ రేట్లు ఇవే | HDFC hikes home loan interest rates: Check latest loan interest rates

HDFC Ltd has increased its Retail Prime Lending Rate (RPLR) on Housing Loans by 30 basis points, effective May 9, 2022. This increase is applicable to all borrowers, both existing and new. This increase will result in an increase in EMIs for HDFC home loan borrowers.
Story first published: Tuesday, May 10, 2022, 12:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X