For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC బ్యాంకు కస్టమర్లకు శుభవార్త, వడ్డీ రేట్లు తగ్గింపు: నెలకు ఎంత తగ్గుతుంది?

|

ప్రయివేటురంగ బ్యాంకు దిగ్గజం HDFC తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్ పైన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (RPLR)ను తగ్గించిందని, ఇది జూన్ 12వ తేదీ నుండి అంటే ఈ రోజు నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. ఇప్పుడు తగ్గించిన వడ్డీ రేట్లు హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్, గృహరుణేతర కస్టమర్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది.

Gold Bond Scheme: మార్కెట్ ధర కంటే తక్కువకు బంగారం... ధర, వడ్డీ, డిస్కౌంట్Gold Bond Scheme: మార్కెట్ ధర కంటే తక్కువకు బంగారం... ధర, వడ్డీ, డిస్కౌంట్

వడ్డీ రేట్లు ఇలా

వడ్డీ రేట్లు ఇలా

ఇప్పటికే ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ తగ్గించింది. HDFC నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు (MCLR)ను 5 బేసిస్ పాయింట్లు లేదా 0.05 శాతం తగ్గించింది. సవరణ తర్వాత ఓవర్ నైట్ MCLR రేటు 7.30 శాతానికి, ఒక నెల MCLR రేటు 7.35 శాతానికి, ఏడాది కాల MCLR 7.65 శాతానికి, మూడేళ్ల MCLR 7.85 శాతానికి దిగి వచ్చినట్లు బ్యాంకు తెలిపింది. ప్రస్తుత శాలరైడ్ కస్టమర్లకు కొత్త రుణాలు 7.65 శాతం నుండి 7.95 శాతం మధ్య ఉంటాయని తెలిపింది.

ఎంత తగ్గుతుంది

ఎంత తగ్గుతుంది

రుణగ్రహీతలు 20 సంవత్సరాల కాలపరిమితితో రూ.25 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే నెలవారీ ఈఎంఐపై రూ.325 తగ్గుతుంది. 15 ఏళ్ల కాలపరిమితికి రూ.300 వరకు తగ్గుతుంది. బ్యాంకు RPLRను తగ్గించిన తర్వాత 16.20 శాతం వద్ద ఉంది. మార్చి నెల నుండి RPLR 40 బేసిస్ పాయింట్లు తగ్గింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఎంసీఎల్‌ఆర్‌ను 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం తగ్గించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.80 శాతం నుంచి 7.65 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.65 శాతం నుంచి 7.50 శాతానికి దిగి వచ్చాయి. ఈ రేట్లు ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు ప్రకటించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రుణ రేట్లను 10 బేసిస్ పాయింట్లు లేదా (0.10 శాతం తగ్గించింది. దీంతో ఏడాది ఎంసీఎల్ఆర్ 7.60 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.45 శాతం, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 7.30 శాతం, ఒక నెల ఎంసీఎల్ఆర్ 7.15 శాతానికి తగ్గింది.

English summary

HDFC బ్యాంకు కస్టమర్లకు శుభవార్త, వడ్డీ రేట్లు తగ్గింపు: నెలకు ఎంత తగ్గుతుంది? | HDFC cuts lending rate by 20 basis points

HDFC, India's largest private sector mortgage financier has reduced its benchmark lending rate by 20 basis points with immediate effect. One basis point is 0.01 percentage point.
Story first published: Friday, June 12, 2020, 17:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X