For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాలర్, బాండ్ యీల్డ్స్ ఎఫెక్డ్, 1700 డాలర్ల దిగువకు బంగారం: 2021లో 11% పతనం

|

బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి పతనమవుతున్నాయి. తాజాగా మరోసారి 1700 డాలర్ల దిగువకు పడిపోయాయి. 2021లో పసిడి ధరలు ఏకంగా 11.2 శాతం క్షీణించాయి. 2018 జూన్ తర్వాత ఓ త్రైమాసికంలో బంగారం 212.34 డాలర్లు లేదా 11.2 శాతం పడిపోవడం ఇదే మొదటిసారి. కరోనా కారణంగా గత ఏడాది పసిడి ధరలు భారీగా ఎగిశాయి. అయితే కేసులు తగ్గి, రికవరీ బాట పట్టడంతో బంగారం తిరిగి పడిపోతోంది. అతి తక్కువ కాలంలో కరోనా కారణంగా ఎగిసిన బంగారం, రికవరీ నేపథ్యంలో దాదాపు అదే విధంగా క్షీణిస్తోంది.

పర్సనల్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా.. క్రెడిట్ స్కోర్ ముఖ్యంపర్సనల్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా.. క్రెడిట్ స్కోర్ ముఖ్యం

1750 నిరోధకం

1750 నిరోధకం

అమెరికా ట్రెజరీ యీల్డ్స్ పెరగడంతో బంగారంపై ఒత్తిడి తగ్గింది. డాలర్ కూడా మరింత బలపడుతోంది. దీంతో ఇన్వెస్టర్లు కొంతమంది మరింత తగ్గుతుందనే ఆందోళనతో తమ వద్ద ఉన్న పసిడిని విక్రయిస్తున్నారు. కామెక్స్‌లో బ్రేక్ డౌన్ ట్రేడింగ్ 1680 సమీపానికి వచ్చింది. అంతక్రితం తాకిన 1750 డాలర్ల స్థాయికి చేరుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. గత కొద్ది వారాలుగా ఈ మార్కుకు దిగువనే కదలాడుతోంది.

రిటైల్ మార్కెట్లో...

రిటైల్ మార్కెట్లో...

ముంబై రిటైల్ మార్కెట్లో క్రితం సెషన్లో పసిడి రూ.260 క్షీణించి రూ.44,395 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం, రూపాయి బలహీనపడటం ప్రభావం చూపింది. గత వారం కూడా డొమెస్టిక్ మార్కెట్లో బంగారం రూ.282 లేదా 0.63 శాతం క్షీణించింది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర పది గ్రాములకు రూ.40,666 ఉండగా, 24 క్యారెట్ల పసిడికి 44,395గా ఉంది. వీటికి జీఎస్టీ అదనం. 18 క్యారెట్ల పసిడి రూ.33,ధర రూ.33,296గా ఉంది.

భారీ తగ్గుదల

భారీ తగ్గుదల

2018 జూన్ నుండి మొదటిసారి ఓ త్రైమాసికంలో పసిడి ధరలు 212 డాలర్లు క్షీణించాయి. దేశీయ కరెన్సీ రూపాయి విధంగా చూస్తే రూ.5800కు పైగా క్షీణించింది. ప్రపంచ అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఎస్పీఆర్ గోల్డ్ ఫండ్స్ వద్ద జనవరి 4 నాటికి 150 టన్నులు తగ్గి 1187.95 టన్నులకు పడిపోయింది. టెన్ ఇయర్ బాండ్ యీల్డ్స్ 1.7419 శాతం పెరిగాయి.

English summary

డాలర్, బాండ్ యీల్డ్స్ ఎఫెక్డ్, 1700 డాలర్ల దిగువకు బంగారం: 2021లో 11% పతనం | Gold sinks below $1,700 as dollar, bond yields climb: down 11.2 per cent in 2021

Gold is on track for its first quarterly fall since June 2018 down $212.34 or 11.20 percent in 2021. It has declined Rs 5,807 or 11.57 percent in the rupee term in the same period.
Story first published: Wednesday, March 31, 2021, 11:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X