For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices today: భారీగా పెరిగిన బంగారం ధరలు, ఇప్పుడు కొనుగోలు చేయాలా?

|

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిన్న రూ.200 వరకు పెరిగిన పసిడి ధరలు నేడు (ఏప్రిల్ 12, మంగళవారం) ప్రారంభ సెషన్‌లోనే దాదాపు రూ.500 ఎగిసిపడింది. పసిడి ధరలు తిరిగి రూ.53,000 దిశగా పరుగు పెడుతున్నాయి. అంతర్జాతీయంగా అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ పసిడి ధరలు మాత్రం భిన్నంగా ముందుకు కదులుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1960 డాలర్లను క్రాస్ చేసింది.

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం గం.11.10 సమయానికి రూ.431 పెరిగి రూ.52,610 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.428 లాభపడి రూ.52,855 వద్ద ట్రేడ్ అయింది. అంటే పసిడి దాదాపు 1 శాతం మేర లాభపడింది. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ కూడా నేడు భారీగానే పెరిగింది. రూ.1000కి పైగా ఎగిసింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,015 లేదా 1.50 శాతం లాభపడి రూ.68,309 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.945 లేదా 1.4 శాతం పెరిగి రూ.69,000 వద్ద ట్రేడ్ అయింది.

పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200కు రూ.3600 తక్కువగా ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో రూ.55,000 క్రాస్ చేసిన గోల్డ్ ఫ్యూచర్స్ ఆ తర్వాత రూ.51,000 దిగువకు పడిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ రూ.52,600 దాటింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో

అంతర్జాతీయ మార్కెట్‌లో

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 11.80 డాలర్లు లేదా 0.60 శాతం లాభపడి 1960 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లోను బంగారం ధర పెరిగి 1948 డాలర్ల వద్ద ముగిసింది. నేడు మరింత పెరిగి 1960 డాలర్లను క్రాస్ చేసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్లు దాటింది. నేడు ప్రారంభ సెషన్‌లో 0.361 డాలర్లు ఎగిసి 25.348 డాలర్లకు పెరిగింది.

బంగారం కొనవచ్చునా?

బంగారం కొనవచ్చునా?

ఓ వైపు అంతర్జాతీయంగా పసిడికి అననుకూల పరిస్థితులు కనిపిస్తున్నప్పటి ధరలు మాత్రం పెరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఫెడ్ వడ్డీ రేట్లు 2.25 శాతం నుండి 2.50 శాతం మధ్య ఉండే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. సీపీఐ ద్రవ్యోల్భణం కూడా 8.2 శాతం అంతకంటే ఎక్కువగా ఉండనుందని అంటున్నారు. భవిష్యత్తు అంచనాలు పసిడిపై ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.52,000 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని పసిడిని స్వల్పకాలానికి కొనుగోలు చేయవచ్చునని అంటున్నారు.

English summary

Gold prices today: భారీగా పెరిగిన బంగారం ధరలు, ఇప్పుడు కొనుగోలు చేయాలా? | Gold rises despite weak global cues, buy on dips with stoploss at Rs 52000

Gold prices were trading higher in India on Tuesday, even as global prices traded weak.
Story first published: Tuesday, April 12, 2022, 12:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X