For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold rates today: భారీగా పడిపోయిన బంగారం ధరలు, అంతలోనే..

|

బంగారం ధరలు క్రితం సెషన్‌లో భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో 1800 డాలర్ల స్థాయికి, దేశీయ మార్కెట్లో రూ.48,000 దిగువకు పడిపోయాయి. వెండి ధరలు కూడా క్షీణించాయి. సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.1000 వరకు క్షీణించింది. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.374 తగ్గి రూ.47,725 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.373 తగ్గి రూ.47,790 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న దాదాపు 30 డాలర్ల మేర క్షీణించింది. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో రూ.966 క్షీణించి రూ.62,000 దిగువకు వచ్చింది. సమీప భవిష్యత్తులో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 2022 ముగిసే నాటికి మాత్రం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.55,000కు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా.

ఆరు వారాల్లో భారీ పతనం

ఆరు వారాల్లో భారీ పతనం

బంగారం ధరలు నిన్నటి సెషన్‌లో భారీగా పతనమయ్యాయి. గత ఆరువారాల్లోనే ఇది భారీ పతనం. 1830 డాలర్ల స్థాయి నుండి 1800 డాలర్లకు పడిపోయింది. అమెరికా బాండ్ యీల్డ్స్ పెరగడం, ఫెడ్ రేట్ హైక్ ఆందోళనల వంటి అంశాలు పసిడిపై తీవ్ర ప్రభావం చూపాయి. బంగారం ధరలు 2020 ఆగస్ట్ నెలలో ఎంసీఎక్స్‌లో రూ.56,200తో ఆల్ టైమ్ గరిష్టం, అంతర్జాతీయ మార్కెట్లో 2075 డాలర్లతో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టంతో ఎంసీఎక్స్‌లో రూ.8500, అంతర్జాతీయ మార్కెట్లో 275 డాలర్లు తక్కువగా ఉంది.

నేడు స్వల్ప పెరుగుదల

నేడు స్వల్ప పెరుగుదల

నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు మాత్రం అతి స్వల్పంగా పెరిగాయి. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.90 పెరిగి రూ.47,806 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్ రూ.49 ఎగిసి రూ.47,865 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో నేడు దాదాపు 5 డాలర్ల మేర ఎగిసి 1804 డాలర్లను తాకింది.

సిల్వర్ ఫ్యూచర్ మాత్రం స్వల్పంగా క్షీణించింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.41 తగ్గి రూ.61,700 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.14 తగ్గి రూ.62,378 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ అతి స్వల్పంగా 0.002 డాలర్లు తగ్గి 22.808 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

వివిధ నగరాల్లో ధరలు

వివిధ నగరాల్లో ధరలు

బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 1800 డాలర్ల దిగువకు పడిపోతే 1790 డాలర్ల కంటే మరింత కిందకు వెళ్లవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా.

వివిధ నగరాల్లో బంగారం ధరల విషయానికి వస్తే ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.47,390, 24 క్యారెట్ల పసిడి రూ.51,700, చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.45,490, 24 క్యారెట్ల పసిడి రూ.49,630, కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి రూ.47,440, 24 క్యారెట్ల బంగారం రూ.50,140, ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.47,260, 24 క్యారెట్ల బంగారం రూ.49,260గా ఉంది.

English summary

Gold rates today: భారీగా పడిపోయిన బంగారం ధరలు, అంతలోనే.. | Gold rates fall RS 400 on January 3, May correction above $1,800

Gold remains pressured after the biggest daily fall in six weeks. Gold is attempting to recover losses made at the start of the New Year and trades some 0.25% higher in the Asia session at $1,805.76 within a tight $5.00 range so far.
Story first published: Tuesday, January 4, 2022, 9:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X