For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Prices Today: బంగారం ధరలు భారీగా తగ్గాయ్, మద్దతు ధర ఎక్కడంటే?

|

బంగారం ధరలు భారీగా తగ్గాయి. గతవారం మధ్యలో ఓ సమయంలో రూ.50,000 దిగువకు చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్, చివరకు రూ.51,700 పైన ముగిశాయి. అయితే నేడు భారీగా తగ్గాయి. నేటి (మే 2, 2022) ప్రారంభ సెషన్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.678 లేదా 1.30 శాతం తగ్గి రూ.51,076 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.659 లేదా 1.27 శాతం తగ్గి రూ.51,340 వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.5000 వరకు తక్కువగా ఉంది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం సమయంలో పసిడి ఓ సమయంలో రూ.55,000 దాటింది. ఈ కొద్ది కాలంలోనే రూ.4000 వరకు తగ్గింది.

వెండి ధరలు

వెండి ధరలు

సిల్వర్ ధరలు భారీగా పడిపోయాయి. పది రోజుల క్రితం రూ.70,000 స్థాయిలో కనిపించిన సిల్వర్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.63,000 దిగువకు పడిపోయాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.911 లేదా 1.40 శాతం క్షీణించి రూ.62,645 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1189 లేదా 1.85 శాతం క్షీణించి రూ.63,160 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లో

అంతర్జాతీయ మార్కెట్లో

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. నేడు ప్రారంభ సెషన్‌లోనే ఏకంగా దాదాపు 30 డాలర్లు క్షీణించాయి. దీంతో 1885 డాలర్ల దిగువకు పడిపోయింది. ఈ వార్త రాసే సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ 26 డాలర్లు తగ్గి 1885 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.393 డాలర్లు తగ్గి 22.722 డాలర్లకు తగ్గింది.

డిప్ సమయంలో కొనుగోలు

డిప్ సమయంలో కొనుగోలు

బంగారాన్ని రూ.52,050 టార్గెట్ ధరతో రూ.51,200 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని రూ.51,550 వద్ద కొనుగోలు చేయవచ్చునని, సిల్వర్ రూ.65,000 టార్గెట్ ధరతో రూ.62,200 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.63,800 వద్ద కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. బంగారాన్ని డిప్ సమయంలో కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ వర్గాలు చెబుతుంటాయి.

ఫెడ్ సమావేశానికి ముందు బంగారం ధరలు వయోలేట్ కావొచ్చునని బులియన్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లు 3, 4 తేదీల్లో ఉంది.

English summary

Gold Prices Today: బంగారం ధరలు భారీగా తగ్గాయ్, మద్దతు ధర ఎక్కడంటే? | Gold Prices Today: Yellow metal to be volatile ahead of US Fed meet

Gold prices dipped on Monday in the international market as elevated US Treasury yields pressured demand for zero-yield bullion, ahead of a key US Federal Reserve meeting later this week where the central bank is expected to aggressively raise its interest rates.
Story first published: Monday, May 2, 2022, 11:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X