For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Prices Today: నిన్న భారీగా తగ్గి, నేడు పసిడి జంప్: ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా?

|

బంగారం ధరలు నిన్న భారీగా తగ్గాయి. అయితే నేడు (నవంబర్ 23, మంగళవారం) ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా పెరిగాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.48,000 దిగువకు పడిపోయింది. నేడు ప్రారంభంలో స్వల్పంగా పెరిగినప్పటికీ ఈ మార్కుకు దిగువనే ఉంది.
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో నిన్న రూ.48,800కు పైన ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ ముగింపు సమయానికి దాదాపు రూ.900 మేర క్షీణించి రూ.47,950 దిగువకు పడిపోయింది. అయితే నిన్న మార్కెట్ భారీ నష్టాలు, అంతర్జాతీయ పరిణామాలు, డిమాండ్-లేమి భయంతో చమురు ధరలు మళ్లీ పుంజుకోవడం, ద్రవ్యోల్భణ ఆందోళనల నేపథ్యంలో ఈ రోజు బంగారం ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రారంభంలో ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితిని అనుసరించి కదలాడవచ్చు.

రూ.48,000 దిగువనే బంగారం ధరలు

రూ.48,000 దిగువనే బంగారం ధరలు

డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.39.00 (0.08%) పెరిగి రూ.47962.00 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.7.00 (0.01%) పెరిగి రూ.48200.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న ఉదయం 1840 డాలర్లకు పైన ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ సెషన్ ముగిసే సమయానికి 1806 డాలర్లకు పడిపోయింది. అయితే నేడు స్వల్పంగా 2.45 డాలర్లు లాభపడి 1808.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గతవారం ఓ సమయంలో 1900 డాలర్ల దిశగా కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు 1800 డాలర్ల స్థాయికి వచ్చింది. ఈ కొద్ది సెషన్‌లలో 60 డాలర్లకు పైగా పడిపోయింది. బంగారం ధర ఏడాదిలో 4 శాతం క్షీణించింది. నేటి సెషన్‌లో 1,804.60 - 1,812.45 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.

సిల్వర్ ఫ్యూచర్స్

సిల్వర్ ఫ్యూచర్స్

నిన్న ప్రారంభంలో రూ.65,000కు పైనే ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ నిన్న రూ.1000కి పైగా తగ్గడంతో రూ.64,600 దిగువకు వచ్చింది. నేటి ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.92.00 (0.14%) పెరిగి రూ.64663.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.74.00 (0.11%) పెరిగి రూ.65718.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ అంతర్జాతీయ మార్కెట్లో 25 డాలర్లకు దిగువనే ఉంది. నేటి సెషన్‌లో స్వల్పంగా 0.015 (+0.06%) డాలర్లు పెరిగి రూ.24.312 వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో సిల్వర్ ధర 0.21 శాతం పెరిగింది.

బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా?

బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా?

ఐరోపాలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసుల పెరుగుదల, ద్రవ్యోల్భణ ఆందోళనలు, చమురు డిమాండ్ వంటి అంశాలపై బంగారం ధరల తగ్గుదల, పెరుగుదల ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ వారం బంగారం ధరలు కాస్త పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. బుధవారం ఫెడ్ మినట్స్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించవచ్చు. బంగారం ధరలు మళ్లీ 1830 డాలర్ల దిశగా కనిపిస్తోందని అంటున్నారు. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ప్రస్తుత డిప్ సమయంలో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

బంగారం మద్దతు ధర 1834-1825 డాలర్లు, నిరోధకస్థాయి 1,860-1870 డాలర్లు. ఎంసీఎక్స్‌లో మద్దతు ధర రూ.48,670-48,550. నిరోధకస్థాయి రూ.49,060-49,300. వెండి ఫ్యూచర్ రూ.65,200-64,750. నిరోధకస్థాయి రూ.66,100-66,650.

English summary

Gold Prices Today: నిన్న భారీగా తగ్గి, నేడు పసిడి జంప్: ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా? | Gold Prices Today: Should you buy yellow metal on dips

Global Gold prices on November 22 showed signs of stability and recovery after hitting the lowest point in nearly weeks. The recovery in the metal’s prices was also helped by a retreating dollar.
Story first published: Tuesday, November 23, 2021, 10:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X