బంగారం ధరలు ఈరోజు (ఆగస్ట్ 3) పెరిగాయి. కరోనా కేసులు, అంతర్జాతీయ మార్కెట్లు వంటి వివిధ కారణాల ప్రభావం దేశీయ పసిడి మార్కెట్ పైన పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఉదయం 0.08 శాతం పెరిగి రూ.53,490 పలికింది. రూ.54,000కు చేరువలో ఉంది. వెండి ఫ్యూచర్స్ రూ.700 లేదా 1.1 శాతం పెరిగి కిలో రూ.65,690గా ఉంది. కరోనా వెలుగుచూసినప్పటి నుండి బంగారం ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే.

ఈ వారం పసిడి ధర ఎలా ఉండవచ్చు
పసిడి అక్టోబర్ కాంట్రాక్ట్ రూ.54,271 ఎగువకు వెళ్తే మరింత పెరిగే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. లేదంటే స్థిరంగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. స్థిరత్వం చోటు చేసుకుంటే ఆ తర్వాత కాంట్రాక్ట్ రూ.52 వేలకు పైన, ఆ తర్వాత రూ.52వేల దిగువకు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
వెండి ధర రూ.63,285 దిగువకు రాకుంటే సానుకూలంగా ఉండవచ్చునని, అయితే మరింతగా పెరిగే అవకాశాలు తక్కువే అంటున్నారు. లాభాలు స్వీకరించవచ్చునని సూచిస్తున్నారు.

2,000 డాలర్ల దిశగా బంగారం
గత సెషన్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.650(1.2 శాతం) పెరిగింది. అలాగే వెండి రూ.2,300(3.6 శాతం) ఎగిసింది. ఈ జనవరి నుండి మన దేశంలో బంగారం ధరలు 35 శాతం పెరిగి, సరికొత్త గరిష్టాన్ని తాకాయి. ఇంతకుముందు సెషన్‌లో ఓ సమయంలో బంగారం రూ.53,700 పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. స్పాట్ గోల్డ్ 0.1 శాత ఎగిసి ఔన్స్ 1,976.47 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు సెషన్‌లో 1,984 కూడా పలికింది. 2,000 డాలర్ల సమీపానికి వచ్చింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 0.1 శాతం తగ్గి ఔన్స్‌కు 24.35, పల్లాడియం 1.1 శాతం తగ్గి 2,068.98 డాలర్లకు చేరుకుంది.

జూలైలో రికార్డ్ పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో జూలై నెలలో బంగారం ధర ఏకంగా 11 శాతం ఎగిసింది. నెలవారీగా చూస్తే 2012 తర్వాత ఇది రికార్డ్. ఔన్స్ ధర సింగపూర్ మార్కెట్లో బంగారం 2,009.50 డాలర్లకు, స్పాట్ 24,3212 డాలర్లకు చేరుకుంది. దేశీయంగా కూడా జూలై నెలలో బంగారం ధరలు భారీగానే పెరిగాయి. పసిడి ఒక్క నెలలోనే పదకొండు శాతం పెరుగుదలతో ఎనిమిదేళ్ల రికార్డులను చేరుకుందని బులియన్ మార్కెట్ నిపుణులు మనోజ్ జైన్ అన్నారు.

బంగారం ధరలు..
బంగారం ధరలు గత రెండు వారాలుగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రూ.56,500కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ.540 పెరిగింది. ఢిల్లీలోను బంగారం రూ.260 పెరిగింది. 24 క్యారెట్ల ధర రూ.53,460, 22 క్యారెట్ల బంగారం రూ.52,260 పలికింది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications