బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.. అయితే ఇది స్వల్పంగా మాత్రమే. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఉదయం 10 గ్రాముల అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.56 శాతం తగ్గి రూ.54,600 పైన పలికింది. వెండి ఫ్యూచర్స్ కిలో 0.77 శాతం తగ్గి రూ.74,816 పలికింది. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ధరలు వివిధ కారణాలతో మూడు రోజులుగా కొద్దిగా మాత్రమే క్షీణించాయి. పసిడి ధరలు తగ్గడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో పసిడి ధర రూ.58,500కు కిందకు దిగి వచ్చింది. వెండి ధర కూడా కిలో రూ.2,300 తగ్గి రూ.74,000కు పడిపోయింది.

రష్యా వ్యాక్సీన్ ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా కరోనా రికవరీ పెరిగింది. దీని కంటే ముఖ్యమైన విషయం ఏమంటే రష్యా కరోనా వ్యాక్సీన్‌ను విడుదల చేసింది. ఈ రోజు విడుదల చేస్తామని ముందే ప్రకటించడంతో రెండు రోజులుగా ఈ ప్రభావం కనిపించిందని చెప్పవచ్చు. ఈ రోజు వ్యాక్సీన్ విడుదల చేసింది. వ్యాక్సీన్ ప్రభావం ఎలా ఉంటుందనే విషయం పక్కన పెడితే.. వ్యాక్సీన్ వచ్చిందనే అంశం పసిడిపై ఒత్తిడిని తగ్గించింది. మరో ఒకటి రెండు రోజులు కూడా పసిడిపై ఈ ప్రభావం ఉండవచ్చునని అంటున్నారు.

లాభాలకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
కరోనా నేపథ్యంలో గత కొద్దిరోజులుగా ఆచితూచి వ్యవహరిస్తున్న ఇన్వెస్టర్లు, రికవరీలు పెరగడం, వ్యాక్సీన్ రావడం వంటి వివిధ కారణాలతో లాభాలు స్వీకరించేందుకు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. దీంతో బంగారం ధరలు పడిపోయాయని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో భారీగా డౌన్
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు మరింతగా తగ్గాయి. ఓ సమయంలో ఔన్స్ 2,070 డాలర్లు దాటిన పసిడి రెండు రోజులుగా తగ్గుముఖం పట్టింది. స్పాట్ గోల్డ్ 0.5 శాతం తగ్గి 2,017.98 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 2,028 డాలర్లకు పడిపోయింది. వెండి 0.6 శాతం పడిపోయి 28.97 డాలర్లు, ప్లాటినమ్ 0.7 శాతం పడిపోయి 979.50 డాలర్లు, పల్లాడియం 0.5 శాతం ఎగిసి 2,231 డాలర్లు పలికింది. గత మూడు రోజుల్లో ఏకంగా దాదాపు 50 డాలర్లకు పైగా పడిపోయింది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అంతర్జాతీయ మార్కెట్లో రూ.3,500కు పైగా తగ్గింది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications