For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధర భారీగా పతనం: వేలల్లో తగ్గుదల.. ఇక ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది?

|

బంగారం ధరలు ఈ రోజు మరింతగా పడిపోయాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం పడిపోయి 10 గ్రాములు రూ.52,036 పలికింది. గత వారం శుక్రవారం స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ వారంలో రష్యా వ్యాక్సీన్ అనంతరం దారుణంగా పతనమయ్యాయి. వెండి ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా పెరిగింది. ఎంసీఎక్స్‌లో కిలో వెండి 0.4 శాతం పెరిగి రూ.67వేల పైన పలికింది. అంతకుముందు సెషన్‌లో మాత్రం పడిపోయింది. మంగళవారం గోల్డ్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో ఏకంగా రూ.3,200 పడిపోయింది. గత వారం రూ.56,000 దాటిన పసిడి ఇప్పుడు ఆ రికార్డ్ హై కంటే రూ.4,000 తక్కువగా ఉంది.

భారీగా పడిపోయిన బంగారం ధర, మూడ్రోజుల్లో రూ.5,000 తగ్గుదల: లాభాలు తీసుకోవడం వల్లే..భారీగా పడిపోయిన బంగారం ధర, మూడ్రోజుల్లో రూ.5,000 తగ్గుదల: లాభాలు తీసుకోవడం వల్లే..

రూ.4 వేలకు పైగా తగ్గడంతో...

రూ.4 వేలకు పైగా తగ్గడంతో...

ఎంసీఎక్స్‌లో ఈ రోజు పసిడి ధరలు 10 గ్రాములు రూ.250 మాత్రమే పడిపోయింది. కానీ రికార్డ్ గరిష్టం నుండి రూ.4,000 కంటే ఎక్కువగా క్షీణించింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ మద్దతు ధర రూ.50,450 నుండి రూ.49,200, అప్ రిసిస్టెన్స్ రూ.53,600గా ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎంసీఎక్స్, బులియన్ మార్కెట్లో బంగారం ధరలు నాలుగు రోజుల్లో రూ.4,000కు పైగా తగ్గడంతో ఇన్వెస్టర్లు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పసిడి ధర జూలై 21న రూ.50వేల కంటే తక్కువగా ఉంది. మళ్లీ ఆ స్థాయికి దిగి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుదల

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుదల

అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. గరిష్టస్థాయి నుండి మంగళవారం 6 శాతం పడిపోయిన పసిడికి ఏడేళ్లలో ఒకరోజు అతిపెద్ద పతనం ఇదే. కామెక్స్‌లో నేడు స్పాట్ గోల్డ్ ఔన్స్ 1 శాతం తగ్గి 1,936.29 డాలర్లకు చేరుకుంది. డిసెంబర్ డెలివరీ ఫ్యూచర్ 1 శాతం తగ్గి 1,930 డాలర్లు పలికింది. గత వారం పసిడి 2,070కి పైగా డాలర్లతో ఆల్ టైమ్ హైకి చేరుకుంది.

ఇక.. బంగారం ఎప్పుడు తగ్గుతుంది.. ఎప్పుడు పెరుగుతుంది

ఇక.. బంగారం ఎప్పుడు తగ్గుతుంది.. ఎప్పుడు పెరుగుతుంది

బంగారం ధరలపై డాలర్, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు, ఇటీవలి కాలంలో అమెరికా-చైనా వార్ ప్రభావం ఉంటుంది. నాలుగైదు నెలలుగా కరోనా కారణంగా పసిడి పెరుగుతూ వస్తోంది. కరోనా కారణంగా ఈక్విటీ మార్కెట్లు నష్టపోవడం, చమురు ధరలు పడిపోవడంతో ఇన్వెస్టర్లు పసిడి వైపు చూశారు. అయితే ఇటీవల భారీగా పడిపోవడానికి ప్రధాన కారణంగా రష్యా వ్యాక్సీన్. రష్యా రష్యా వ్యాక్సీన్‌పై కొన్ని అనుమానాలు లేవనెత్తుతున్నారు. ఈ అనుమానాలు తేలిపోతే పసిడి మరింతగా పడిపోయే ఆస్కారం ఉందని చెబుతున్నారు. అది కాకపోయినా ఇతర దేశాలు ఏవైనా డబ్ల్యుహెచ్ఓ ఆమోదంతో వ్యాక్సీన్ తీసుకు వచ్చినా పసిడిపై ఒత్తిడి తగ్గి, ధరలు తగ్గుతాయని అంటున్నారు. రష్యా వ్యాక్సీన్ పైన వచ్చిన అనుమానాలు నిజమైతే లేదా ఆ లోగా మరో వ్యాక్సీన్ రాకపోతే మాత్రం ధరలు తిరిగి భారీగా పుంజుకోవడం ఖాయమని అంటున్నారు. సంక్షోభ సమయంలో పసిడి ధరలు పెరగడం తెలిసిందే. 1992 నుండి సంక్షోభాలు తలెత్తినప్పుడు పసిడికి డిమాండ్ పెరగడం ఎక్కువ అయింది. కరోనా సంక్షోభంలోను అప్ ట్రెండ్ చూసిన పసిడి.. ఇప్పుడు వ్యాక్సీన్ ఆశలతో డౌన్ ట్రెండ్ ప్రారంభమైంది. అయితే ఇది ఎంత మేరకు తగ్గుతుందనేది చూడాలి.

హైదరాబాద్‌లో ధర..

హైదరాబాద్‌లో ధర..

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.55 వేలకు దిగువన ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.50,130గా ఉంది. ఓ సమయంలో హైదరాబాద్‌లో రూ.59,000 సమీపానికి చేరుకుంది. రూ.60వేలు చేరుకుంటుందని భావించినంతలోనే రష్యా వ్యాక్సీన్ తీసుకు రావడంతో డౌన్ ట్రెండ్ ప్రారంభమైంది.

English summary

బంగారం ధర భారీగా పతనం: వేలల్లో తగ్గుదల.. ఇక ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది? | Gold prices today fall, down ₹4,000 from recent highs: Where will it go next?

Gold prices in India today fell as the volatile ride continued in global markets. On MCX, October gold futures dipped 0.4% ₹52,036 per 10 gram, the second decline in three days. Silver futures on MCX rose 0.4% to ₹67050 per 10 gram.
Story first published: Thursday, August 13, 2020, 16:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X