For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.45,000కు పైనే...బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

|

బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. చివరి సెషన్‌లో రూ.45,000 క్రాస్ చేసిన పసిడి నేడు (ఏప్రిల్ 5, సోమవారం) ప్రారంభ సెషన్‌లో రూ.45,500 క్రాస్ చేసినప్పటికీ మళ్లీ తగ్గింది. దీంతో ధరలు సాయంత్రం సెషన్‌లో స్థిరంగా కనిపించాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.65,000 దిగువకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల దిగువనే ట్రేడ్ అవుతోంది. కరోనా కేసులు పెరగడం, బిట్ కాయిన్ ఊగిసలాట మధ్య ఉన్న నేపథ్యంలో పసిడికి కాస్త ఈ వారం కలిసి రావొచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ నేపథ్యంలో ధరలు పెరిగినప్పటికీ అది స్వల్పంగా ఉండవచ్చునని అంటున్నారు.

ఉదయం స్వల్పంగా పెరిగి.. స్థిరంగా

ఉదయం స్వల్పంగా పెరిగి.. స్థిరంగా

గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం రూ.45వేలను క్రాస్ చేసి రూ.45,418 వద్ద ట్రేడ్ అయింది. నేడు ఆ మార్కుకు పైనే ట్రేడ్ అవుతోంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్‌లో రూ.8.00 (0.02%) తగ్గి రూ.45,426.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,349.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,514.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,274.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ రూ.135.00 (0.30%) పెరిగి రూ.45760.00 వద్ద ట్రేడ్ అయింది.

వెండి స్వల్ప తగ్గుదల

వెండి స్వల్ప తగ్గుదల

వెండి ధరలు స్వల్పంగా క్షీణించాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.181.00 (0.28%) క్షీణించి రూ.64908.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,800.00 వద్ద ప్రారంభమై, రూ.65,530.00 గరిష్టాన్ని, రూ.64,473.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.203.00 (-0.31%) తగ్గి రూ.65773.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,951.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,409.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,457.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు పెరిగాయి. 1730 డాలర్ల వద్ద ఉంది. 1.75 (0.10%) డాలర్లు పెరిగి 1,730.15 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,721.65 - 1,734.35 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. 0.105 (0.42%) డాలర్లు తగ్గి 24.843 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.665 - 25.137 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

రూ.45,000కు పైనే...బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? | Gold prices stay firm on safe haven buying: rates expected to move sideways this week

Bullion prices witnessed strong recovery from key support levels as ease in US bond yields and dollar decline boosted buying in the safe-haven asset.
Story first published: Monday, April 5, 2021, 22:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X