For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు మరింత పెరుగుతాయా, ఆ టార్గెట్‌తో కొనవచ్చు

|

బంగారం ధరలు రూ.48,000 దాటాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో నిన్న రూ.400 వరకు పెరిగి రూ.48,200 వద్ద ముగిసింది. చాన్నాళ్లకు ఈ మార్కును దాటింది. అయితే నేటి సెషన్‌లో అతి స్వల్పంగా తగ్గింది లేదా స్థిరంగా ఉంది. నేటి (అక్టోబర్ 26, మంగళవారం) ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.54.00 (-0.11%) తగ్గి రూ.48146.00 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.61.00 (-0.13%) క్షీణించి రూ.48267.00 వద్ద ట్రేడ్ అయింది.

అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు రూ.48,100 నుండి రూ.48,170 మధ్య ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న 1806.80 డాలర్ల వద్ద ముగిసిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 1.65 డాలర్లు క్షీణించి 1805.15 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 1,804.35 డాలర్ల నుండి 1,809.75 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. 52 వారాల గరిష్టం 1978 డాలర్లు, కనిష్టం 1678 డాలర్లు. క్రితం సెషన్‌లో 1806.80 డాలర్ల వద్ద క్లోజ్ కాగా, నేడు 1808.30 డాలర్ల వద్ద ప్రారంభమైంది. బంగారం ధర ఏడాదిలో 6.1 శాతం క్షీణించింది.

బంగారం మద్దతు ధర.. రూ.49,000 వద్ద పరీక్ష

బంగారం మద్దతు ధర.. రూ.49,000 వద్ద పరీక్ష

ద్రవ్యోల్భణ ఆందోళనలు, వృద్ధి రేటు ఆందోళనలు, పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ పుంజుకోవడం వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు కారణంగా మారుతున్నాయి. ఈటీఎఫ్‌ల నుండి ఔట్-ప్లో పెరుగతుండటం ఈక్విటీ మార్కెట్ పైన ఇన్వెస్టర్ బలహీన సెంటిమెంట్‌కు నిదర్శనం. ఇది బంగారానికి సానుకూలంగా మారింది. డాలర్ కాస్త బలహీనపడటం కూడా కలిసి వచ్చింది.

కామెక్స్‌లో కీలక నిరోధకస్థాయి 1800 డాలర్లను బంగారం క్రాస్ చేసింది. ఈ నేపథ్యంలో మరింత బుల్లిష్‌గా ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం 1830 డాలర్ల నుండి 1835 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చునని భావిస్తున్నారు. యూఎస్ టెన్ ఇయర్ బాండ్ యీల్డ్స్ 1.63 శాతం క్షీణించాయి.

ఇక, ఎంసీఎక్స్‌లో గోల్డ్ నిరోధకస్థాయి రూ.48,300 నుండి రూ.48500. ఈ స్థాయిని దాటితే మాత్రం బంగారం రూ.49,000 వద్ద పరీక్షను ఎదుర్కోవచ్చునని భావిస్తున్నారు. మద్దతు ధర రూ.47,900.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.163.00 (-0.25%) నష్టపోయి రూ.65976.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.233.00 (-0.35%) నష్టపోయి రూ.66656.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.084 (-0.34%) డాలర్లు నష్టపోయి 24.508 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 24.592 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. 52 వారాల కనిష్టం 21.410 డాలర్లు, 52 వారాల గరిష్టం 29.930. ఏడాదిలో వెండి ధర 0.36 శాతం పెరిగింది.

బంగారం కొనుగోలు

బంగారం కొనుగోలు

బంగారం ధరలు ట్రాయ్ ఔన్స్ 1832 వద్ద పరీక్షను ఎదుర్కోవచ్చునని ప్రముఖ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ అన్నారు. బంగారం మద్దతు ధర 1,796-1,784 డాలర్ల మధ్య ఉండవచ్చునని, నిరోధకస్థాయి 1,818-1,832 డాలర్లు, వెండి మద్దతు ధర 24.20-24.00 డాలర్లు, నిరోధకస్థాయి 24.88-25.10 డాలర్లుగా చెబుతున్నారు.

ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.48,000-47,860, నిరోధకస్థాయి రూ.48,440-48,700, వెండి మద్దతు ధర రూ.65,700-65,220, నిరోధకస్థాయి రూ.66,660-67,200. బంగారాన్ని రూ.47,900 వద్ద స్టాప్ లాస్‌తో, రూ.48,500 టార్గెట్ ధరతో రూ.48,050 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. వెండిని రూ.65,200 వద్ద స్టాప్ లాస్‌తో, రూ.67,000 టార్గెట్ ధరతో రూ.65,800 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

English summary

బంగారం ధరలు మరింత పెరుగుతాయా, ఆ టార్గెట్‌తో కొనవచ్చు | Gold prices likely to stay volatile amid global economic uncertainty

Gold prices edged lower on October 26 weighed down by an uptick in the dollar as investors wait for the key central bank meetings this week.
Story first published: Tuesday, October 26, 2021, 11:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X