For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కన్స్యూమర్ సెంటిమెంట్ ఎఫెక్ట్: హమ్మయ్య.. బంగారం ధరలు తగ్గుతున్నాయి

|

బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000 దిగువకు పడిపోయింది. క్రితం సెషన్‌లో రూ.300కు పైగా తగ్గిన పసిడి ధర నేడు(అక్టోబర్ 27, బుధవారం) ప్రారంభ సెషన్‌లో రూ.36 మేర తగ్గింది. దేశీయంగా, అంతర్జాతీయంగా కస్టమర్ కాన్ఫిడెన్స్ పెరిగింది. డాలర్ వ్యాల్యూ కాస్త బలపడింది. బలమైన కార్పోరేట్ ఎర్నింగ్స్, అధిక ద్రవ్యోల్భణం ఆందోళనలు కాస్త తగ్గడం వంటి అంశాలు కూడా బంగారం తగ్గుదలకు కారణమయ్యాయి. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్.. ఆదాయం అంచనాలను మించింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల దిగువకు రావడంతో దేశీయ ఫ్యూచర్ మార్కెట్‌లోను రూ.48,000 దిగువకు వచ్చాయి.

వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి

వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి

కరోనా నేపథ్యంలో బ్యాంకుల వంటి వాటిలో వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి. బంగారంపై ఇన్వెస్ట్ చేసినప్పటికీ, కరోనా ప్రభావం తగ్గడం, అదే సమయంలో స్టాక్ మార్కెట్ పుంజుకోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడుతోంది. పెట్టుబడి సాధనాల్లో తక్కువ వడ్డీ రేటు ఉండటం, మార్కెట్ పరుగులు పెడుతుండటంతో ఇన్వెస్టర్లు.. దీనికి తోడు కంపెనీలు బలమైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించడం వంటివి కలిసి వస్తున్నాయి. చాలామంది పసిడి నుండి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ దిశగా చూస్తున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ అక్టోబర్ నెలలో పెరిగింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ మాసివ్ స్టిమ్యులస్ ప్రోగ్రాంతో పాటు ద్రవ్యోల్భణం అంచనాలను తగ్గించింది.

ధరలు ఎలా ఉన్నాయంటే

ధరలు ఎలా ఉన్నాయంటే

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో 36.00 (-0.08%) తగ్గి రూ.47777.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.64.00 (-0.13%) క్షీణించి రూ.47853.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నిన్ననే 1800 డాలర్ల దిగువకు పడిపోయింది. క్రితం సెషన్‌లో 1,793.40 డాలర్ల వద్ద ముగిసింది. నేటి ప్రారంభ సెషన్‌లో 2.95 (-0.16%) తగ్గి 1790.45 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం పెరిగింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.52.00 (0.08%) పెరిగి రూ.65041.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.65681.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 24.102 డాలర్ల వద్ద ఉంది.

వివిధ నగరాల్లో బంగారం ధరలు

వివిధ నగరాల్లో బంగారం ధరలు

- ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,280.

- ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,210.

- చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,390.

- కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,410.

- బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,060.

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,060.

- కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,060.

- పుణేలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,310.

- అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,990.

English summary

కన్స్యూమర్ సెంటిమెంట్ ఎఫెక్ట్: హమ్మయ్య.. బంగారం ధరలు తగ్గుతున్నాయి | Gold prices down to below RS 48,000 as Consumer Confidence Rises

Gold prices fell on Wednesday morning in Asia, while the U.S dollar retreated marginally.
Story first published: Wednesday, October 27, 2021, 9:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X