For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు పెరుగుతున్నాయి.. మరింత పెరిగే అవకాశముందా?

|

గతవారం పెరిగిన బంగారం ధరలు ఈ వారం కూడా ముందుకు సాగుతున్నాయి. వారం ప్రారంభంలోనే గోల్డ్ ఫ్యూచర్ రూ.48,000 స్థాయికి చేరుకుంది. నేడు (సోమవారం, అక్టోబర్25) ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.151.00 (0.32%) పెరిగి రూ.47948.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.174.00 (0.36%) లాభపడి రూ.48080.00 వద్ద ట్రేడ్ అయింది. నేటి ప్రారంభ సెషన్‌లో ఓ సమయంలో రూ.48,038 వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ చాలా రోజులకు ఈ మార్కును దాటింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్లను క్రాస్ చేసింది.

క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1,796.30 డాలర్ల వద్ద ముగిసింది. నేటి ప్రారంభ సెషన్‌లో 5.15 (0.29%) డాలర్లు లాభపడి 1,801.45 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో దాదాపు 7 శాతం మేర క్షీణించింది. 52 వారాల గరిష్టం 1978.40 డాలర్లు, కనిష్టం 1677.90 డాలర్లు. నేటి సెషన్‌లో 1,793.05 - 1,801.45 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.

సిల్వర్ ఫ్యూచర్స్ రూ.66,000ను క్రాస్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా 25 డాలర్ల సమీపానికి చేరుకుంది. ఎంసీఎక్స్‌లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.453.00 (0.69%) ఎగిసి రూ.66109.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.495.00 (0.75%) లాభపడి రూ.66852.00 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.141 (0.58%) డాలర్లు లాభపడి 24.590 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

మరింత పైకి వెళ్తాయా?

మరింత పైకి వెళ్తాయా?

బంగారం ధరలు గతవారం రోజులుగా పైపైకి చేరుకుంటున్నాయి. సెప్టెంబర్ ప్రారంభం ధరలతో పోలిస్తే ప్రస్తుతం అధికంగా ఉన్నాయి. తాత్కాలిక ద్రవ్యోల్భణం అంచనాలకు మించి ఉన్నదని ఫెడ్ చైర్మన్ ప్రకటించారని, ఫెడ్ చైర్మన్ మరిన్ని వ్యాఖ్యలు, ఇతర అంతర్జాతీయ అంశాల ప్రభావం బంగారంపై ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఈ వారం కూడా పాజిటివ్‌గా కొనసాగవచ్చునని, కాబట్టి ఏదైనా డిప్ కనిపిస్తే కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మద్దతు ధర 1784 డాలర్ల నుండి 1772 డాలర్లు. నిరోధకస్థాయి 1804 డాలర్ల నుండి 1818 డాలర్లు.

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.47600 నుండి రూ.47440, నిరోధకస్థాయి రూ.48050 నుండి రూ.48260.

వెండి మద్దతు ధర రూ.65220 నుండి రూ.64700. నిరోధకస్థాయి రూ.66100 నుండి రూ.66600.

ఎక్కడ కొనుగోలు చేయవచ్చు

ఎక్కడ కొనుగోలు చేయవచ్చు

బంగారాన్ని రూ.47,440 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.48,100 టార్గెట్ ధరతో రూ.47,660 వద్ద కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వెండిని రూ.64,700 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.66,100 వద్ద టార్గెట్ ధరతో రూ.65,200 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

అందుకే బంగారానికి సానుకూలం

అందుకే బంగారానికి సానుకూలం

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం 1.6 శాతం లాభపడి 1795 డాలర్ల వద్ద ముగిసింది. బలహీనమైన డాలర్, బాండ్ యీల్డ్స్, ద్రవ్యోల్భణం పెరుగుదల వంటి అంశాలు పసిడి పైన ప్రభావం చూపుతున్నాయి. బంగారం ఈ వారం 1800 డాలర్లకు పైన ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక రికవరీలో ఎదురవుతున్న సవాళ్లు బంగారానికి సానుకూలంగా మారాయి.

English summary

బంగారం ధరలు పెరుగుతున్నాయి.. మరింత పెరిగే అవకాశముందా? | Gold Price Today: Yellow metal trades higher: buy for a target of Rs 48150

Gold MCX December futures trade higher on Monday following positive trend seen in the international spot prices.
Story first published: Monday, October 25, 2021, 11:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X