For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: నిన్న పెరిగి, నేడు భారీగా తగ్గిన బంగారం ధర, ఏ స్థాయిలో కొనుగోలు చేయాలి

|

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో నిన్న రూ.48,000 క్రాస్ చేసిన గోల్డ్ ఫ్యూచర్స్, నేటి సెషన్‌లో ఈ మార్కు దిగువకు వచ్చాయి. నిన్నటి వరకు అంతర్జాతీయ మార్కెట్లోను ముందుకు సాగిన పసిడి నేడు భారీగా పడిపోయింది. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ 23 డాలర్ల దిగువకు వచ్చింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో ఎంసీఎక్స్‌లో పసిడి ఫ్యూచర్ రూ.8400 వరకు తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో 270 డాలర్ల మేర తక్కువగా ఉంది.

క్రితం సెషన్‌లో పెరిగి.. నేడు భారీగా తగ్గి

క్రితం సెషన్‌లో పెరిగి.. నేడు భారీగా తగ్గి

బంగారం ధరలు క్రితం సెషన్‌లో స్వల్పంగా పెరిగాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.89 ఎగిసి రూ.48,038 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.79 లాభపడి రూ.48,135 వద్ద ముగిసింది. అంతకుముందు రూ.48,000 దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో ఈ మార్కును దాటాయి. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.62,000కు పైనే ఉంది. క్రితం సెషన్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు స్థిరంగా ముగిసింది. అయితే నేటి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,800 దిగువకు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో 1800 డాలర్ల పైన ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ మళ్లీ రూ.62,000 దిగువకు వచ్చింది.

నేటి ధరలు ఇలా..

నేటి ధరలు ఇలా..

నేటి (గురువారం, 6) ప్రారంభ సెషన్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.252 క్షీణించి రూ.47,769 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.240 తగ్గి రూ.47,910 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు 20 డాలర్లు తగ్గి 1805 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ఇక సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి రూ.984 క్షీణించి తగ్గి రూ.61,254 వద్ద, మే ఫ్యూచర్స్ రూ.914 క్షీణించి రూ.61,963 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.533 డాలర్లు తగ్గి 22.637 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ఏ స్థాయిలో కొనుగోలు చేయవచ్చు

ఏ స్థాయిలో కొనుగోలు చేయవచ్చు

బెంచ్ మార్క్ యూఎస్ టెన్ ఇయర్ ట్రెజరీ యీల్డ్స్ ఏప్రిల్ 2021 తర్వాత మొదటిసారి భారీగా పెరిగాయి. అలాగే ఫెడ్ మినట్స్ తర్వాత డాలర్ నష్టాలు తగ్గాయి. ఇది పసిడిపై ప్రభావం చూపింది. ఒమిక్రాన్ కేసులు, ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, ఆర్థిక రికవరీ మాత్రం కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇది స్టాక్ మార్కెట్, పసిడి మార్కెట్ పైన ప్రభావం చూపుతోంది.

గోల్డ్ బై-జోన్ రూ.48,200, టార్గెట్ ధర రూ.48,500.

గోల్డ్ సెల్-జోన్ రూ.47,800, టార్గెట్ ధర రూ.47,600.

English summary

Gold price today: నిన్న పెరిగి, నేడు భారీగా తగ్గిన బంగారం ధర, ఏ స్థాయిలో కొనుగోలు చేయాలి | Gold price today: Yellow metal support at Rs 47,800

Gold prices were little changed in the international market on January 6 as a surge in US Treasury yields following hawkish meeting minutes released by the Federal Reserve offset the precious metal's safe-haven demand amid rising cases of the Omicron coronavirus variant.
Story first published: Thursday, January 6, 2022, 10:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X