For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: బంగారం ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా?

|

బంగారం ధరలు నేడు (సెప్టెంబర్, 15, బుధవారం) స్వల్పంగా తగ్గాయి. రెండు రోజుల క్రితం వరకు క్షీణతతో ఉన్న పసిడి ధరలు నిన్న భారీగా పెరిగాయి. నేడు స్థిరంగా ఉన్నాయి లేదా అతి స్వల్పంగా క్షీణించాయి. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్‌లో రూ.20.00 (-0.04%) క్షీణించి రూ47240.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.14.00 (-0.03%) క్షీణించి రూ.47408.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ డిసెంబర్ రూ.164 తగ్గి రూ.63,421 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ39.00 పెరిగి రూ.64,440 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న పెరిగి 1800 డాలర్లు దాటింది. నేడు స్వల్పంగా తగ్గినప్పటికీ ఈ మార్కు పైనే ఉంది. కామెక్స్‌లో నేడు ప్రారంభ సెషన్‌లో రూ.1.75 (-0.10%) డాలర్లు క్షీణించి 1,805.35 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.092 (-0.39%) డాలర్లు తగ్గి 23.797 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

గోల్డ్ జ్యువెల్లరీ ధరలు

గోల్డ్ జ్యువెల్లరీ ధరలు

దేశంలో అత్యధికంగా వినియోగించే రెండో మెటల్ బంగారం. వినియోగదారుడు కొనుగోలు చేసే బంగారంపై ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ ట్యాక్స్, మేకింగ్ ఛార్జీలు వంటివి ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గోల్డ్ జ్యువెల్లరీ ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.46,140, ముంబైలో రూ.46,000, చెన్నైలో రూ.44,350 ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.50,340, ముంబైలో రూ.47,000, చెన్నైలో రూ.48,380, కోల్‌కతాలో రూ.49,250 ఉంది.

బంగారం ధరలపై ప్రభావం

బంగారం ధరలపై ప్రభావం

అమెరికా ద్రవ్యోల్భణం డేటా అంచనాల కంటే తక్కువగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కాస్త సానుకూలంగా ఉన్నాయి. అమెరికాలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్(CPI) జూలై నెలతో పోలిస్తే ఆగస్ట్ నెలలో 0.3 శాతం పెరిగింది. బంగారం ధరలు నేడు వయోలేట్ అవుతున్నప్పటికీ, మద్దతు ధర స్థాయిలోనే కొనసాగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మద్దతు ధర (ట్రాయ్ ఔన్స్) 1,796-1,784 డాలర్లు, నిరోధకస్థాయి 1,818-1,832 డాలర్లు, వెండి మద్దతు ధర 23.55-23.20 డాలర్లు, నిరోధకస్థాయి 24.14-24.50 డాలర్లు. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.47,050-రూ.46,920, నిరోధకస్థాయి రూ.47,400-రూ.47,550, వెండి మద్దతు ధర రూ.63,100-రూ.62,800, నిరోధకస్థాయి రూ.63,900-రూ.64,200 వద్ద ఉంది.

కొనుగోలు చేయాలా?

కొనుగోలు చేయాలా?

వెండిని రూ.63,200 స్థాయిలో కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. రూ.62,800 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.64,100 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ప్రస్తుతం 1800 డాలర్ల వద్ద ఉంది.

అక్టోబర్ గోల్డ్ మద్దతు ధరలు... రూ.47,000, రూ.46,800, నిరోధకస్థాయిలు రూ.47,450, రూ.47,700.

డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ మద్దతు ధరలు రూ.63,000, రూ.62,400, నిరోధకస్థాయిలు రూ.64,200,రూ.65,030.

అంతర్జాతీయ మార్కెట్లో మొదటి నిరోధకస్థాయి బంగారం 1809 డాలర్లు, రెండో నిరోధకస్థాయి 1815 డాలర్లు. గోల్డ్ కీ-లెవల్ 47,067, కొనుగోలు స్థాయి రూ.47,100, టార్గెట్ ధర రూ.47,513-రూ.47,767. అమ్మకం జోన్ రూ.47,050 దిగువకు. టార్గెట్ ధర రూ.46,813-రూ.46,690.

English summary

Gold price today: బంగారం ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా? | Gold price today above Rs 47,000, silver selling at Rs 63,420

Gold is selling at Rs 47,000 per ten gram on Wednesday in India, down Rs 10 from the previous trade.
Story first published: Wednesday, September 15, 2021, 11:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X