For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెప్టెంబర్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు, మరింత తగ్గే ఛాన్స్ ఉందా?

|

బంగారం ధరలు గతవారం స్వల్పంగా పెరిగాయి. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం రూ.46,000 దిగువన ప్రారంభమైంది. కానీ ముగిసింది మాత్రం ఈ మార్కుకు పైనే. గతవారం గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు రూ.300 వరకు లాభపడింది. చివరి సెషన్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.40.00 (-0.09%) క్షీణించి రూ.46283.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.21.00 (-0.05%) తగ్గి రూ.46500.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం క్రితం సెషన్‌లో పెరిగింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.908.00 (1.52%) పెరిగి రూ.60525.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.868.00 (1.44%) లాభపడి రూ.60967.00 వద్ద ముగిసింది. ఇక, అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో చివరి సెషన్‌లో 4.20(+0.24%) లాభపడిన గోల్డ్ ఫ్యూచర్స్ 1,761.20 డాలర్ల వద్ద, 0.513 (+2.33%) ఎగిసిన సిల్వర్ ఫ్యూచర్స్ 22.560 వద్ద ముగిసింది.

సెప్టెంబర్ నెలలో బంగారం దాదాపు నాలుగు శాతం మేర కరెక్షన్‌కు గురయింది. ఈ వారం కూడా ఒత్తిడిలో ఉండే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ 1750 డాలర్ల దిగువకు పడిపోవచ్చునని అంటున్నారు. 1680 డాలర్ల వద్ద మద్దతు ధర కాగా, దీర్ఘకాలంలో పెట్టుబడికి కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు. గోల్డ్ కమోడిటీ ఎక్స్‌పర్ట్స్ మేరకు డాలర్ వ్యాల్యూ రోజురోజుకు బలపడుతున్నందున బంగారం ధరలు ఒత్తిడిలో ఉండవచ్చునని, ఈ ధరలు ఈ వారం కూడా కాస్త క్షీణించే అవకాశాలు ఉంటాయనిచెబుతున్నారు.

 Gold price dips in last month, Should you buy?

వివిధ నగరాల్లో బంగారం ధరలు

చెన్నై - 22 క్యారెట్ల పసిడి రూ.43,880 - 24 క్యారెట్ల పసిడి రూ.47,870
బెంగళూరు - 22 క్యారెట్ల పసిడి రూ.43,510 - 24 క్యారెట్ల పసిడి రూ.47,470
ఢిల్లీ - 22 క్యారెట్ల పసిడి రూ.45,560 - 24 క్యారెట్ల పసిడి రూ.49,720
ముంబై - 22 క్యారెట్ల పసిడి రూ.45,490 - 24 క్యారెట్ల పసిడి రూ.46,490
కేరళ - 22 క్యారెట్ల పసిడి రూ.43,510 - 24 క్యారెట్ల పసిడి రూ.47,470
పాట్నా - 22 క్యారెట్ల పసిడి రూ.44,780 - 24 క్యారెట్ల పసిడి రూ.47,940
నాగపూర్ - 22 క్యారెట్ల పసిడి రూ.45,490 - 24 క్యారెట్ల పసిడి రూ.46,490
భువనేశ్వర్ - 22 క్యారెట్ల పసిడి రూ.43,940 - 24 క్యారెట్ల పసిడి రూ.47,710
అహ్మదాబాద్ - 22 క్యారెట్ల పసిడి రూ.44,300 - 24 క్యారెట్ల పసిడి రూ.47,420

English summary

సెప్టెంబర్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు, మరింత తగ్గే ఛాన్స్ ఉందా? | Gold price dips in last month, Should you buy?

Gold price on yesterday dipped 0.05 per cent on Multi Commodity Exchange (MCX). The December 2021 gold future contract on MCX closed at ₹46,500 per 10 gm, ₹21 below its Thursday close price.
Story first published: Sunday, October 3, 2021, 14:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X