For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: 9 నెలల గరిష్టం వద్ద బంగారం, తగ్గి.. భారీగా పెరిగే ఛాన్స్

|

బంగారం ధరలు క్రితం సెషన్‌లో తగ్గుముఖం పట్టాయి. క్రితం సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.195.00 (-0.40%) క్షీణించి రూ.48864.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.198.00 (-0.40%) క్షీణించి రూ.49108.00 వద్ద ముగిసింది. గతవారం బంగారం ధరలు రూ.49,000ను దాటి రూ.50,000 దిశగా కనిపించాయి. అయితే ఆ తర్వాత కాస్త తగ్గి రూ.49,000 దిగువకు వచ్చాయి. డాలర్ వ్యాల్యూ పుంజుకోవడం, కరోనా కేసుల భయం కాస్త తగ్గడం వంటి అంశాలు పసిడి ధర పైన ప్రభావం చూపాయి.

1850 డాలర్ల దిగువకు పసిడి

1850 డాలర్ల దిగువకు పసిడి

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1850 డాలర్ల దిగువకు వచ్చింది. ఇటీవల కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1900 డాలర్ల దిశగా కనిపించింది. అయితే ఇప్పుడు 1847 డాలర్ల వద్ద ముగిసింది. గోల్డ్ ఫ్యూచర్స్ 14.35(-0.77%) డాలర్లు క్షీణించి 1,847.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1,844.35 - 1,867.95 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ 52 వారాల కనిష్టం 1677.90 డాలర్లు, గరిష్టం 1971.50 డాలర్లు. క్రితం సెషన్‌లో 1,861.40 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో బంగారం 2.18 శాతం క్షీణించింది.

25 డాలర్ల దిగువకు సిల్వర్

25 డాలర్ల దిగువకు సిల్వర్

డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.350.00 (-0.53%) తగ్గి రూ.65620.00 డాలర్ల వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.283.00 (-0.42%) క్షీణించి రూ.66680.00 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల దిగువకు వచ్చింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.250 (-1.00%) డాలర్లు తగ్గి 24.650 డాలర్ల వద్ద ట్రేడ్ ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్ అంతకుముందు సెషన్లో 24.900 డాలర్ల వద్ద ముగిసింది. చివరి సెషన్లో మాత్రం 24.650 డాలర్ల వద్ద ముగిసింది.

మున్ముందు.. తగ్గి పెరగవచ్చు

మున్ముందు.. తగ్గి పెరగవచ్చు

బంగారం ధరలు 9 నెలల గరిష్టం వద్ద ఉంది. ఈ నేపథ్యంలో మరింత కాలం ప్రాఫిట్ బుకింగ్ ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రాఫిట్ బుకింగ్ రేంజ్ 1830 డాలర్ల నుండి 1850 డాలర్ల మధ్య ఉంటుందని అంటున్నారు. అయితే ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు 50,000 నుండి రూ.51000 స్థాయికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. అలాగే సిల్వర్ రూ.74,000 స్థాయికి చేరుకోవచ్చునని అంటున్నారు.

English summary

Gold price today: 9 నెలల గరిష్టం వద్ద బంగారం, తగ్గి.. భారీగా పెరిగే ఛాన్స్ | Gold price dips after hitting 9 month high: Should you buy now?

Gold price on Friday dipped ₹195 per 10 gm on Multi Commodity Exchange (MCX) and closed at ₹48,864 per 10 gm whereas silver price shed 0.53 per cent and closed at ₹65,620 per kg levels. As per commodity experts, this dip in gold and silver price is more a profit-booking than anything else.
Story first published: Sunday, November 21, 2021, 13:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X